ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పద్మశీ గ్రహీత శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా బహూకరించిన కళాఖండాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 APR 2023 10:09AM by PIB Hyderabad

   ద్మశీ పురస్కార గ్రహీత శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా తనకు పంపిన చారిత్రక దియ్యూ చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా నుంచి కొద్ది రోజుల కిందట నేను ఈ అద్భుత కళాఖండాలను అందుకున్నాను. ఇదిదో చూడండి... అద్భుత చారిత్రక నగరం దియ్యూ సహా అనేక చిత్రాలు వీటిలో ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“ఈ చిత్రాలను వీక్షించండి... వీటిని చూస్తే- భవిష్యత్తులో దియ్యూ నగర సందర్శనాసక్తి మీలో చిగురించడం తథ్యమని నా విశ్వాసం” అని ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1917149) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam