ప్రధాన మంత్రి కార్యాలయం
గువహటి ఎయిమ్స్‌పై పౌరుడి వ్యాఖ్యకు ప్రధాని సమాధానం
Posted On:
15 APR 2023 9:51AM by PIB Hyderabad
గువహటి ఎయిమ్స్‌పై తన ట్వీట్ల మీద వ్యాఖ్యానించిన చేసిన అనేకమంది పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బదులిచ్చారు.
ఈ మేరకు రాజేష్ భారతీయ అనే వ్యక్తి ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“ఎయిమ్స్ నెట్‌వర్క్ విస్తరణ ఓ సంతృప్తికర కార్యక్రమం. ఆ మేరకు అందరికీ ఆరోగ్యం సంరక్షణ సులభంగా లభ్యమయ్యేలా అందుబాటులోకి తేవడం కోసం మరింత కృషిచేస్తాం.” అని ప్రధాని పేర్కొన్నారు.
అలాగే ఈశాన్య భారతంలో సూపర్ స్పెషాలిటీ చికిత్స లభ్యతపై ప్రొఫెసర్ (డాక్టర్) సుధీర్ దాస్ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“అవును... ఈశాన్య రాష్ట్రాల్లోని నా సోదరసోదరీమణులందరికీ ఇదెంతో సౌలభ్యం కల్పిస్తుంది” అని పేర్కొన్నారు.
జోర్హత్ నివాసి దీపాంకర్ పరాశర్ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“అస్సాం ప్రగతి ప్రయాణానికి మరింత ఉత్తేజం లభిస్తుంది. ఇప్పటిదాకా ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయి” అని ప్రధాని వివరించారు.
(Release ID: 1917064)
Visitor Counter : 155
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam