ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చైతన్యం ద్వారా మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా పోషకాహార లోపం ప్రమాదాన్ని ఎదుర్కోవడాన్ని గురించి ఒడిశా లోని బలాంగీర్ ఎమ్ పి ట్వీట్ లను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 10 APR 2023 10:06AM by PIB Hyderabad

చైతన్యం ద్వారా మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా పోషకాహార లోపం తాలూకు ప్రమాదాన్ని ఎదుర్కోవడాన్ని గురించి ఒడిశా లోని బలాంగీర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి సంగీత కుమారి సింహ్ దేవ్ ట్వీట్ లకు ప్రధాన మంత్రి  సమాధానాన్ని ఇచ్చారు.

 

మహిళలు మరియు బాల ల వికాసం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పోషణ్ అభియాన్ గురించి ఒడిశా లోని బాలన్ గీర్ పార్లమెంట్ సభ్యురాలు కొన్ని ట్వీట్ లలో వివరించారు.  బాల లు ప్రస్తుతం ఆరోగ్యం గా జన్మించేటట్టు మరియు వారి కి సమృద్ధమైనటువంటి పోషణ  లభించేటట్టు పోషణ్ అభియాన్ పూచీ పడుతోంది అని ఆమె అన్నారు.  స్వచ్ఛ్ భారత్ విషయం లో ప్రజల కు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ను గురించి కూడా ఆమె ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపునకు ప్రజలు గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకొన్నారని ఆమె అన్నారు.  ఇదే మాదిరి గా పోషణ్ అభియాన్ కూడాను ప్రభుత్వం యొక్క ప్రభావశీల ఆచరణ మరియు పౌరుల చురుకైన భాగస్వామ్యం ల కారణం గా సఫలం అవుతోందని ఆమె అన్నారు. 

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చైతన్యం మరియు ప్రజల భాగస్వామ్యం ల ద్వారా పోషకాహార లోపం తాలూకు ప్రమాదాన్ని ఎదుర్కోవడం గురించినటువంటి ఆసక్తిని రేకెత్తించే ట్వీట్ లు.’’ అని పేర్కొన్నారు.

 

 

******

DS/ST


(Release ID: 1915302)