ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈస్టర్‌ పర్వదినం నేపథ్యంలో క్రైస్తవ సమాజ మతపెద్దలతో ప్రధాని సమావేశం


ఢిల్లీలోని సేక్రెడ్‌ హార్ట్‌ కెథడ్రల్‌ సందర్శన దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 APR 2023 7:17PM by PIB Hyderabad

స్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ సమాజ మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సేక్రెడ్‌ కెథడ్రల్‌ను తాను సందర్శించిన దృశ్యాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ఈస్టర్‌ పర్వదినం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కెథడ్రల్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజ మతపెద్దలను కూడా కలుసుకున్నాను. ఆ క్షణాలకు సంబంధించిన దృశ్యాలను మీతో పంచుకుంటున్నాను. అలాగే ఈస్టర్ సందర్భంగా ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కెథడ్రల్ నుంచి మరికొన్ని చిత్రాలు చూడండి. ఈ ప్రత్యేక దినాన సమాజంలో మరింత సంతోషం-సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

******

DS/ST


(रिलीज़ आईडी: 1915251) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam