ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిల్చర్ లో మరియు పరిసర ప్రాంతాల లో జీవన సౌలభ్యాన్ని పెంచుతున్నటువంటి అభివృద్ధి పనులపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 03 APR 2023 9:55AM by PIB Hyderabad

సిల్ చర్ లో మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల లో ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తున్నటువంటి అభివృద్ధి పనుల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శ్రీ రాజ్ దీప్ రాయ్ పలు ట్వీట్ లలో సిల్ చర్ యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని గురించి తెలియజేశారు. అది విద్య గాని, లేదా స్వచ్ఛత గాని, లేదా ఆరోగ్య సంరక్షణ గాని, లేదా నీటి సరఫరా గాని, లేదా పర్యావరణం గాని, లేదా రవాణా గాని, లేదా తక్కువ ఖర్చు లో గృహ‌ నిర్మాణం గాని, లేదా సురక్ష- భద్రత మరియు సార్వజనిక సేవలు గాని, లేదా జీవించడం లో నాణ్యత గాని మెరుగుపడింది అని, అలాగే ఆ ప్రాంతం లో ఆర్థిక సామర్థ్యం కూడా మెరుగైంది అని ఆయన వెల్లడించారు. సిల్ చర్ మరియు పరిసర ప్రాంతాల లో ప్రజల యొక్క జీవనం లో సౌలభ్యాన్ని పెంపొందింప చేస్తున్నటువంటి సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఎవై-జి) మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల ను గురించి కూడా ఆయన వివరించారు.

పార్లమెంట్ సభ్యుడు చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘అభివృద్ధి తాలూకు ఫలాలు సిల్ చర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల లో ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుండడం సంతోషదాయకం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/ST


(Release ID: 1913257) Visitor Counter : 177