ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుణె పార్లమెంట్ సభ్యుడు శ్రీ గిరీశ్ బాపట్ కన్నుమూత పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 MAR 2023 4:19PM by PIB Hyderabad

పుణె పార్లమెంట్ సభ్యుడు శ్రీ గిరీశ్ బాపట్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘శ్రీ గిరీశ్ బాపట్ గారు అణకువ కలిగినటువంటి మరియు కష్టపడి పని చేసేటటువంటి నాయకుడు. సమాజాని కి ఆయన శ్రద్ధ తో, తత్పరత తో సేవల ను అందించారు. మహారాష్ట్ర యొక్క అభివృద్ధి కి మరియు పుణె వికాసాని కి ఎంతో మక్కువ తో విరివి గా శ్రమించారు. ఆయన మృతి దుఃఖదాయకం. ఆయన కుటుంబాని కి మరియు ఆయన సమర్థకుల కు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

‘‘మహారాష్ట్ర లో బిజెపి నిర్మాణం లోను, పార్టీ ని బలపరచడం లోను ఒక ముఖ్యమైన పాత్ర ను శ్రీ గిరీశ్ బాపట్ పోషించారు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చిన శాసన సభ్యుడు గా నడుచుకొన్నారు. ప్రజా సంక్షేమాని కి సంబంధించిన అంశాల ను గురించి ఆయన ప్రస్తావించే వారు. ఆయన ఒక కార్యసాధకుడైనటువంటి మంత్రి గా, ఆ తరువాతి కాలం లో పుణె ఎంపి గా తనదైన ప్రభావాన్ని కనబరచారు. ఆయన చేసిన మంచి పనులు అనేక మంది కి ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1911929) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam