ప్రధాన మంత్రి కార్యాలయం
వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపుర వరకు నిర్మించిన బెంగుళూరు మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి
మెట్రో రైలులో ప్రయాణించిన - మోదీ
Posted On:
25 MAR 2023 2:10PM by PIB Hyderabad
వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపుర వరకు నిర్మించిన బెంగుళూరు మెట్రో రైలు మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన మెట్రో రైలు మార్గంలో శ్రీ మోదీ కూడా ప్రయాణించారు.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు మెట్రో లో ప్రయాణిస్తూ, వివిధ వర్గాల ప్రజలతో సంభాషిస్తున్నారు." అని పేర్కొంది.
వైట్ ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్ కు చేరుకున్న ప్రధానమంత్రి ముందుగా టికెట్ కౌంటర్ లో టిక్కెట్‌ను కొనుగోలు చేసి, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. వైట్ ఫీల్డ్ మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి, మెట్రో ఎక్కేందుకు ప్లాట్ ఫారమ్ వైపు వెళ్లారు. ప్రయాణ సమయంలో ఆయన అక్కడ ఉన్న బెంగళూరు మెట్రో కార్మికులు, సిబ్బందితో ముచ్చటించారు.
ప్రధానమంత్రితో పాటు కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బస్వరాజ్ బొమ్మై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం:
దేశ వ్యాప్తంగా ప్రపంచ స్థాయి అర్బన్ మొబిలిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా, బెంగళూరు మెట్రో రెండవ కింద 13.71 కి.మీల విస్తీర్ణంలో వైట్‌ఫీల్డ్ (కడుగోడి) మెట్రో నుండి కృష్ణరాజపుర మెట్రో స్టేషన్ వరకు మెట్రో లైన్ ఆఫ్ రీచ్-1 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి వైట్ ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్‌లో ఈ రోజు ప్రారంభించారు. సుమారు 4,250 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం బెంగళూరులోని ప్రయాణికులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది, ఇది చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.
(Release ID: 1910913)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam