ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాపూజీతోపాటు దండి యాత్రలో పాల్గొన్నవారికి ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2023 11:15AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర  మోదీ ఇవాళ బాపూజీతోపాటు దండి యాత్రలో పాల్గొన్న వారిందరికీ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు  ఒక ట్వీట్‌ ద్వారా  ఇచ్చిన సందేశంలో:

బాపూజీకి దండి యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా నివాళి. మన దేశ చరిత్రలో ఇదొక కీలక పరిణామం. వివిధ రకాల అన్యాయాలను, ఆగడాలను నిరసిస్తూ కృతనిశ్చయంతో సాగించిన పోరాటానికి ఇదొక నిదర్శనంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

******

 

DS/SH


(రిలీజ్ ఐడి: 1906089) సందర్శకుల సూచీ సంఖ్య : : 195