ప్రధాన మంత్రి కార్యాలయం

రాబోయే 2023 మార్చి 21 న దేశంలోని ఈశాన్య రాష్ట్రాల కు భారత్ గౌరవ్ రైలు ఆరంభం అవుతున్నసందర్భం లో ప్రతిస్పందించిన ప్రధాన మంత్రి

Posted On: 06 MAR 2023 8:09PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ర్టాల కు రాబోయే 2023 వ సంవత్సరం లో మార్చి 21 వ తేదీ నాడు భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి మరియు గుర్తుండిపోయేటటువంటి ప్రయాణం కాగలదని, అంతేకాకుండా దేశం లోని ఈశాన్యః ప్రాంతాల ను గురించి తెలుసుకొనేందుకు ఇది ఒక ఉత్తేజదాయకం అయినటువంటి అవకాశం కూడా కాగలదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

భారత్ గౌరవ్ డీలక్స్ ఎసి టూరిస్ట్ రైలు ను ప్రారంభించడం ద్వారా దేశం లో ఈశాన్య ప్రాంత రాష్ర్టాలన్నిటిని కలుపుతూ ‘‘నార్థ్ ఈస్ట్ డిస్కవరీ : బియాండ్ గువాహాటీ’’ యాత్ర ను నిర్వహించాలని భారతీయ రైల్ వే నిర్ణయించింది. ఈ రైలు 2023వ సంవత్సరం లో మార్చి 21 వ తేదీ నాడు న్యూఢిల్లీ లోని సఫ్ దర్ జంగ్ రైల్ వే స్టేశన్ నుండి మొదలవుతుంది. 15 రోజుల పాటు ఈ యాత్ర అసమ్ లోని గువాహాటీ, శివ్ సాగర్, జోర్ హాట్, కాజీరంగ; త్రిపుర లోని ఉనాకోటి, అగర్ తలా, ఉదయ్ పుర్; నాగాలాండ్ లోని దీమాపుర్, కొహిమా; మేఘాలయ లోని శిలాంగ్, మరియు చిరపుంజిల ను చుడుతుంది.

భారత్ గౌరవ్ రైలు త్వరలో మొదలవనున్న సంగతి ని గురించి సంస్కృతి, పర్యటన, మరియు ఈశాన్య ప్రాంతం అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -

‘‘ఇది ఒక ఆసక్తిదాయకం అయినటువంటి మరియు గుర్తుండిపోయేటటువంటి యాత్ర కానుంది. దేశం లోని ఈశాన్య ప్రాంతాల ను గురించి తెలుసుకోవడం కోసం ఇది ఒక ఉత్తేజదాయకం అయినటువంటి అవకాశం అవుతుంది.’’ అని పేర్కొన్నారు.

This would be an interesting and memorable journey, an exciting opportunity to discover the Northeast. https://t.co/Z0ljlmi5Ae

— Narendra Modi (@narendramodi) March 6, 2023

*****

DS/ST



(Release ID: 1904796) Visitor Counter : 185