ఆర్థిక మంత్రిత్వ శాఖ

బెంగళూరులో జరిగిన రెండవ జి 20 ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల (ఎఫ్ సీబి డి) సమావేశం ప్రారంభ సమావేశంలో కేంద్ర సమాచార ,ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ప్రసంగం

Posted On: 22 FEB 2023 2:05PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభోపన్యాసంతో రెండవ జి 20 ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల (ఎఫ్ సీ బి డి) సమావేశం ఈ రోజు బెంగళూర్ లో జరిగింది.

 

2023 ఫిబ్రవరి 24-25 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ల

(ఎఫ్ఎంసిబిజి) సమావేశం జరగనుంది.

జి 20 ఎఫ్ఎంసిబిజి సమావేశానికి సన్నాహకంగా ఈ రెండవ జి 20 ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల (ఎఫ్ సీ బి డి) సమావేశం జరిగింది. దీనికి శ్రీ అజయ్ సేథ్, ఆర్ బి ఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ డి పాత్రా సహ అధ్యక్షత వహించారు.

 

జీ20 ప్రక్రియలో ఫైనాన్స్ ట్రాక్ కీలకమైందని, ప్రపంచ ఆర్థిక చర్చలు, విధాన సమన్వయానికి సమర్థవంతమైన వేదికను అందిస్తుందని కేంద్ర సమాచార ,ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తమ ప్రసంగం లో పేర్కొన్నారు..

 

డెవలప్ మెంట్ ఫైనాన్స్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ , ఇతర ఆర్థిక రంగ అంశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్, సస్టైనబుల్ ఫైనాన్స్, గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ , ఇంటర్నేషనల్ టాక్సేషన్ సహా గ్లోబల్ ఎకనామిక్ అవుట్ లుక్, సవాళ్లు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ మొదలైనవి ఫైనాన్స్ ట్రాక్ లోని ప్రధాన వర్క్ స్ట్రీమ్ లు.

 

2022 నవంబరులో, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుండి జి 20 అధ్యక్ష పదవిని అందుకున్నప్పుడు అది దేశానికి గర్వకారణమైన క్షణం. ఇంకా జి 20 విభేదాల పరిష్కారం, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ఏకాభిప్రాయాన్ని సాధించడం దిశగా పని చేయాల్సి రావడం ఒక గొప్ప బాధ్యత.

 

శ్రీ అనురాగ్ ఠాకూర్ తన ప్రారంభ ప్రసంగంలో, మన ఒకే భూమిని స్వస్థపరచడం, మన ఒకే కుటుంబంలో సామరస్యాన్ని సృష్టించడం, మన ఒకే భవిష్యత్తు కోసం ఆశను కల్పించడం భారతదేశ జి20 అధ్యక్ష బాధ్యత ప్రాముఖ్యత , ప్రాధాన్యతగా స్పష్టం చేశారు. ‘‘ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలకు భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది. కొవిడ్-19 మహమ్మారి, ఆహార, ఇంధన అభద్రత, విస్తృత ఆధారిత ద్రవ్యోల్బణం, పెరిగిన రుణ బలహీనతలు, క్షీణిస్తున్న వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది.ఈ సంక్షోభాలన్నింటి ప్రభావం ప్రపంచంలోని కీలక అభివృద్ధి ప్రాధాన్యాలపై పురోగతిని వెనక్కు నెట్టగలదు. కేంద్రీకృత చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ సవాళ్లకు ఆచరణాత్మక అంతర్జాతీయ పరిష్కారాలను కనుగొనడంలో జి 20 గణనీయమైన సహకారాన్ని అందించగలదని, భారత ప్రెసిడెన్సీ దీనిని చురుకుగా సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుందని‘‘ శ్రీ ఠాకూర్ అన్నారు.

ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, 2023 లో జి 20 ఫైనాన్స్ ట్రాక్ చర్చలలో 21 వ శతాబ్ద భాగస్వామ్య ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను (ఎండిబి) బలోపేతం చేయడం, 'రేపటి నగరాలకు' నిధులు సమకూర్చడం, ఆర్థిక సమ్మిళితం, ఉత్పాదకత లాభాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉపయోగించడం, అంతర్జాతీయ పన్నుల అజెండాను ముందుకు తీసుకెళ్లడం వంటివి ఉంటాయని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు.

 

2023 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగే సమావేశంలో జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఆమోదించే ప్రకటనను ఈ డిప్యూటీల సమావేశం ఖరారు చేస్తుంది. ఈ ప్రకటన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన సమస్యలపై జి 20 సమిష్టి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద అంతర్జాతీయ సమాజాన్ని ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ఆర్థిక మంత్రులు ,సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో నేరుగా అనుసంధానిస్తుంది. కీలకమైన ప్రపంచ సమస్యలకు సమన్వయ పరిష్కారాలపై జి 20 దేశాల మధ్య ఏకాభిప్రాయం ప్రస్తుత మందగమనం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి , వృద్ధి , సౌభాగ్యానికి కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని ఈ ప్రకటన సామాన్యుడికి భరోసా ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చూడాల్సిన బాధ్యత విధాన నిర్ణేతలదే. సంక్షోభ సమయాల్లో ఏకాభిప్రాయం సాధించడంలో జీ-20 తన సత్తాను పదేపదే నిరూపించుకుంది.రాబోయే గణనీయమైన ప్రమాదాలను అంచనా వేయడం, నిరోధించడం ,సిద్ధం చేయడంలో మన సామర్థ్యంలోనే విజయం ఉందని భారత ప్రెసిడెన్సీ విశ్వసిస్తుంది. ఇది సమ్మిళిత, ద్విగుణీకృత బహుళపక్షవాదానికి పిలుపునిస్తుంది.

 

శ్రీ అనురాగ్ ఠాకూర్ తన ముగింపు ప్రసంగంలో, బహుళపక్ష స్ఫూర్తిని ఆకాంక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వివాదాస్పద అంశాలు ఉన్నాయని, దేశాలు తమ దేశీయ ఆకాంక్షలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

నిర్మాణాత్మక, క్రియాశీల చర్చల ద్వారా సమష్టిగా సరైన ఫలితాలను సాధించగలమని మంత్రి అన్నారు.

 

ప్రారంభోపన్యాసం నుంచి ట్వీట్లు:

సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రారంభోపన్యాసం కోసం ట్వీట్ లింకులు:

 

 

****

RM/PPG/KMN



(Release ID: 1901421) Visitor Counter : 150