ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రపంచ రేడియో దినం సందర్భం లో రేడియోశ్రోత లు అందరికీ అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


2023 ఫిబ్రవరి 26వ తేదీ న జరగనున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమాని కి సూచనల ను తెలియ జేయవలసిందంటూ పౌరుల కు ఆయన విజ్ఞప్తిచేశారు

Posted On: 13 FEB 2023 9:00AM by PIB Hyderabad

రేడియో ప్రసారాల ను వినే వారందరికీ, రేడియో జాకీ (ఆర్ జె) లకు మరియు ప్రసార వ్యవస్థ తో ముడిపడి ఉన్న ఇతరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ రేడియో దినం సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు. 2023 ఫిబ్రవరి 26 వ తేదీ న జరగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను పౌరులు వారి వారి సూచనల ను వ్యక్తం చేయవలసింది గా కూడా శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

 

‘‘రేడియో ను వినే వారందరికీ, ఆర్ జె లకు మరియు ప్రసార వ్యవస్థ తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ రేడియో దినం విశిష్ట సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. కొత్త కొత్త కార్యక్రమాల ద్వారాను, మానవ సృజనశీలత్వాన్ని చాటే మాధ్యం ద్వారా ప్రజల జీవనాన్ని ఇదే మాదిరి గా ప్రకాశింపచేస్తూ ఉండాలి అని కోరుకొంటున్నాను.’’

‘‘ఈ రోజు న ప్రపంచ రేడియో దినం సందర్భం లో నేను మీ అందరికీ ఈ నెల లో 26 వ తేదీ న జరగవలసి ఉన్నటువంటి #MannKiBaat (‘మనసు లో మాట’) 98 వ కార్యక్రమం గురించి గుర్తు చేస్తున్నాను. ఆ కార్యక్రమం కోసం మీ మీ సూచనల ను వెల్లడి చేయగలరు. మైగవ్ (MyGov), నమో ఏప్ (NaMo App) లలో మీ అభిప్రాయల ను వ్రాసి గాని, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి మీ యొక్క సందేశాన్ని రికార్డు చేయడం గాని మీ అభిప్రాయాల ను సూచించండి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 

 



(Release ID: 1898678) Visitor Counter : 191