ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిబ్రవరి 10 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను మరియు మహారాష్ట్ర ను సందర్శించనున్న ప్రధానమంత్రి


ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023 ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు - ఈపెట్టుబడి సంబంధి శిఖర సమ్మేళనం యుపి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల లో ఒకటిగా ఉంది

వందే భారత్ రైళ్ళు రెండిటి కి ప్రధాన మంత్రి ఆకుపచ్చటి జెండా నుచూపనున్నారు; ఈ రైళ్ళు మహారాష్ట్ర లో ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రాల కు రాకపోకల కుదన్ను గా నిలుస్తాయి

సాంతాక్రూఝ్- చెంబూర్ లింక్ రోడ్డు, ఇంకా కురార్ అండర్ పాస్ ప్రాజెక్టుల నుదేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు; ఈ ప్రాజెక్టులు ముంబయి లోనిరహదారి మార్గాల లో వాహనాల రాకపోకల లో ఇప్పుడున్న రద్దీ ని సడలిస్తాయి

ముంబయి లో అల్ జామియా-తుస్-సైఫియా యొక్క కొత్త కేంపస్ ను ప్రారంభించనున్నప్రధాన మంత్రి

Posted On: 08 FEB 2023 5:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను మరియు మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. ఉదయం పూట దాదాపు గా 10 గంటల వేళ లో ప్రధాన మంత్రి లఖ్ నవూ కు చేరుకొని, అక్కడ ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023 ను ప్రారంభిస్తారు. దాదాపు గా 2 గంటల 45 నిమిషాల కు ఆయన ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లో వందే భారత్ రైళ్ళు రెండిటి కి ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపుతారు. అలాగే రెండు రహదారి పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేస్తారు; ఆ రెండు పథకాల లో ఒకటి సాంతాక్రూఝ్- చెంబూర్ లింక్ రోడ్డు. రెండోది కురార్ అండర్ పాస్ ప్రాజెక్టు. ఆ తరువాత, ఆయన సాయంత్రం పూట దాదాపు గా 4:30 గంటల వేళ లో ముంబయి లోని అల్ జామియా-తుస్-సైఫియా కు చెందిన ఒక కొత్త కేంపస్ ను కూడా ప్రారంభించనున్నారు.

 

లఖ్ నవూ లో ప్రధాన మంత్రి

ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023 ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయన గ్లోబల్ ట్రేడ్ శో ను కూడా ప్రారంభించి, మరి ఇన్ వెస్ట్ యుపి 2.0 ను మొదలు పెడతారు.

 

ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023ను ఫిబ్రవరి 10వ తేదీ నాటి నుండి 12వ తేదీ వరకు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేయడమైంది. ఈ కార్యక్రమం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధానమైన పెట్టుబడి శిఖర సమ్మేళనం గా ఉంది. ఇది విధాన రూపకర్తల ను, పరిశ్రమ కు చెందిన నాయకుల ను, విద్యారంగ ప్రముఖుల ను, ఆలోచనపరుల ను, అలాగే ప్రపంచం లో వివిధ ప్రాంతాల కు చెందిన నేతల ను ఒక చోటు కు తీసుకు రావడం తో పాటు, సామూహికం గా వ్యాపార అవకాశాల అన్వేషణ కు మరియు భాగస్వామ్యాల ఏర్పాటు కు దోహదపడనుంది.

 

ఇక ఇన్ వెస్టర్ యుపి 2.0 అనేది ఉత్తర్ ప్రదేశ్ లో ఒక సమగ్రమైనటువంటి, ఇన్ వెస్టర్ ను కేంద్ర స్థానం లో నిలిపేటటువంటి మరియు సేవ ప్రధానం గా పెట్టుబడి సంబంధి ఇకోసిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇన్ వెస్టర్ లకు ప్రాసంగికంగా ఉండే, రాచబాట ను వేసే మరియు ప్రామాణికమైన సేవల ను అందజేసేందుకు ఉద్దేశించింది.

 

ముంబయి లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లో పచ్చజెండా ను చూపనున్న రెండు రైళ్ళు ఏవేవి అంటే అవి ముంబయి-శోలాపుర్ వందే భారత్ రైలు మరియు ముంబయి-సాయినగర్ శిర్డి వందే భారత్ రైలు, న్యూ ఇండియా కై మెరుగైనటువంటి, సమర్థమైనటువంటి, ప్రయాణికుల కు మిత్రపూర్వకం గా ఉండేటటువంటి రవాణా సంబంధి మౌలిక సదుపాయాల ను అందించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేసే దిశ లో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పాలి.

 

ముంబయి-శోలాపుర్ వందే భారత్ రైలు దేశం లో ప్రారంభం అయ్యే తొమ్మిదో వందే భారత్ రైలు కానుంది. ఈ కొత్త ప్రపంచ శ్రేణి రైలు ముంబయి కి, శోలాపుర్ కు మధ్య సంధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శోలాపుర్ లోని సిద్ధేశ్వర్, అక్కల్ కోట్, తులజాపుర్, శోలాపుర్ కు సమీపం లో గల పంఢర్ పుర్ కు, ఇంకా పుణే కు దగ్గర లోని ఆలందీ వంటి ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాల కు ప్రయాణించడాని కి మార్గాన్ని సైతం సుగమం చేస్తుంది.

 

ముంబయి-సాయినగర్ శిర్ డీ వందే భారత్ రైలు దేశం లో పరుగులు తీయబోయేటటువంటి పదో వందే భారత్ రైలు కానుంది. ఇది కూడా మహారాష్ట్ర లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రాలైన నాశిక్, త్రయంబకేశ్వర్, సాయినగర్ శిర్ డీ, ఇంకా శని శింగణాపుర్ లకు సంధానాన్ని మెరుగు పరచనుంది.

 

ముంబయి లో రహదారుల మీద వాహనాల రాకపోకల తాలూకు రద్దీ ని కాస్త తగ్గుముఖం పట్టించడం కోసం సాంతాక్రూఝ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్ సిఎల్ఆర్) ను మరియు కురార్ అండర్ పాస్ ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. కుర్ లా నుండి వకోలా, ఇంకా ఎమ్ టిఎన్ఎల్ జంక్షన్ వరకు, బికెసి నుండి కుర్ లా లోని ఎల్ బిఎస్ ఫ్లయ్ ఓవర్ వరకు సాగిపోయే ఎలివేటెడ్ కారిడార్ ను కొత్తగా నిర్మించడం జరిగింది. ఇది నగరం లో తూర్పు ప్రాంతానికి మరియు పశ్చిమ ప్రాంతానికి మధ్య కనెక్టివిటీ ని పెంపొందింప చేయడానికి తోడ్పడనుంది. ఈ రాస్తాలు వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే (డబ్ల్యుఇహెచ్) నను ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే తో కలిపి తద్వారా తూర్పు శివారు ప్రాంతాల ను మరియు పడమర శివారు ప్రాంతాల ను చక్కగా సంధానించ గలుగుతాయి. కురార్ అండర్ పాస్ అనేది డబ్ల్యుఇహెచ్ తాలూకు ట్రాఫిక్ సమస్యల ను తగ్గించడం లో ఎంతో కీలకమైన పాత్ర ను పోషించేటటువంటి ప్రాజెక్టు. ఇది డబ్ల్యుఇహెచ్ లో మలాడ్ ను, కురార్ ను జతపరుస్తుంది. ఈ అండర్ పాస్ వల్ల ప్రజలు సులభం గా రోడ్డు ను దాటి పోగలుగుతారు. అంతేకాదు, వాహనాలు డబ్ల్యుఇహెచ్ మీది భారీ ట్రాఫిక్ లోకి చేరే అగత్యం లేకుండానే పయనించగలుగుతాయి.

ముంబయి లోని మరోల్ లో గల అల్ జామియా-తుస్-సైపియా (ద సైఫీ అకాడమీ) యొక్క కొత్త కేంపస్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. దావూదీ బోహ్ రా సముదాయాని కి చెందిన ప్రధానమైన విద్య బోధన సంస్థ యే అల్ జామియా-తుస్-సైపియా. దావుదీ బోహ్ రా సముదాయం తాలూకు సంప్రదాయాలు మరియు సాహితీ సంస్కృతి ని పరిరక్షించే ధ్యేయం తో ఈ సంస్థ పరమ పూజ్యులు శ్రీ సయ్యద్ నా ముఫద్దాల్ సైఫుద్దీన్ యొక్క మార్గదర్శకత్వం లో పాటుపడుతున్నది.

 

***



(Release ID: 1897538) Visitor Counter : 159