ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ బడ్జెటు పేదల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది: ప్రధాన మంత్రి


‘‘అమృత కాలం లో ఒకటో బడ్జెటు అయిన ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్కఆకాంక్షల కు మరియు సంకల్పాల కు ఒక బలమైన పునాది ని వేస్తున్నది’’

‘‘ఈ బడ్జెటు వంచితుల కు పెద్ద పీట ను వేస్తున్నది’’

‘‘పిఎమ్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్  అంటే, అదే..‘పిఎమ్ వికాస్’.. కోట్ల కొద్దీవిశ్వకర్మల జీవితాల లో ఒక పెద్ద మలుపు ను తీసుకు వస్తుంది’’

‘‘ఈ బడ్జెటు సహకార సంఘాల ను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్కఅభివృద్ధి లో ఒక ఆధారం గా తీర్చిదిద్దుతుంది’’

‘‘డిజిటల్ చెల్లింపుల లో సాధించిన సాఫల్యాన్ని మనం వ్యవసాయ రంగం లో కూడా అమలులోకి తీసుకు రావలసి ఉంది’’

‘‘ఈ బడ్జెటు సుస్థిర భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ గ్రోథ్, గ్రీన్ ఇకానమీ, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా గ్రీన్ జాబ్స్ లఅపూర్వ విస్తరణ కు తోడ్పడుతుంది’’

‘‘మౌలిక సదుపాయాల రంగం లో ఇది వరకు ఎన్నడు లేనంత గా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిఅనేది భారతదేశం యొక్క అభివృద్ధి కి కొత్త శక్తి ని మరియు వేగాన్ని ప్రసాదిస్తుంది’’

‘‘2047వ సంవత్సరం తాలూకు కలల ను నెరవేర్చాలి అంటే మధ్య తరగతి ఒక బ్రహ్మాండమైన శక్తి అని చెప్పాలి. మా ప్రభుత్వం ఎప్పుడూ మధ్య తరగతి వెన్నంటి నిలబడింది’’

Posted On: 01 FEB 2023 3:15PM by PIB Hyderabad

భారతదేశం యొక్క అమృత కాలంలో తొలి బడ్జెటు అయినటువంటి ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షల ను మరియు సంకల్పాల ను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాది ని వేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితుల కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్షభరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుంది అని కూడా ఆయన అన్నారు.

 

 

ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెటు ను ఇచ్చినందుకు ఆర్థిక మంత్రి ని మరియు ఆమె జట్టు ను ప్రధాన మంత్రి అభినందించారు. వడ్రంగులు, కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు వంటి సాంప్రదాయక చేతి వృత్తుల వారు మరియు ఇతర అనేక మంది దేశాని కి సృష్టికర్త గా ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మొట్ట మొదటిసారి గా దేశం ఈ ప్రజల కఠోర శ్రమ మరియు సృజనల కు ప్రశంసా అన్నట్లుగా అనేక పథకాల తో ముందుకు వచ్చింది. వీరికి శిక్షణ ను ఇవ్వడాని కి, రుణాల ను మంజూరు చేయడాని కి, మార్కెట్ పరం గా సమర్థన ను అందించడాని కి తగిన ఏర్పాట్లు జరిగాయి. పిఎమ్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అంటే, అదే.. సంక్షిప్తం గా పిఎమ్-వికాస్’.. కోట్ల కొద్దీ విశ్వకర్మల జీవితాల లో ఒక పెద్ద మార్పు ను తీసుకు రానుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

నగరాల మొదలుకొని గ్రామాల లో మనుగడ సాగిస్తున్న మహిళల నుండి, ఉద్యోగాలు చేసుకొనే వారు మొదలుకొని గృహిణుల వరకు చూస్తే ప్రభుత్వం జల్ జీవన్ మిశన్, ఉజ్జ్వల యోజన మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర ముఖ్యమైన చర్యల ను చేపట్టింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ చర్య లు మహిళ ల సంక్షేమాని కి మరింత అండదండల ను అందిస్తాయని ఆయన అన్నారు. అమిత సామర్థ్యం కలిగినటువంటి రంగాల లో ఒక రంగం అయిన మహిళా స్వయం సహాయ సమూహాల ను మరింత గా బలపరచడం జరిగిందా అంటే గనక అద్భుత కార్యాల ను సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. కొత్త బడ్జెటు లో మహిళ ల కోసం కొత్త గా ఒక ప్రత్యేకమైన పొదుపు పథకాన్ని ప్రారంభించడం తో మహిళా స్వయం సహాయ సమూహాల విషయం లో ఒక కొత్త పార్శ్వాన్ని జత పరచినట్లు అయిందని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఇది మహిళల ను ప్రత్యేకించి సామాన్య కుటుంబాల లోని గృహిణుల ను బలోపేతం చేస్తుందన్నారు.

 

ఈ బడ్జెటు సహకార సంఘాల ను గ్రామాలు ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి కి ఒక ఆధారం గా తీర్చిదిద్దుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం సహకార రంగం లో ప్రపంచం లోనే అతి పెద్దది అయినటువంటి ఆహార నిలవ పథకాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు. కొత్త ప్రాథమిక సహకార సంఘాల ను ఏర్పాటు చేయడాని కి ఉద్దేశించిన ఒక మహత్వాకాంక్ష యుక్త పథకాన్ని బడ్జెటు లో ప్రకటించడమైంది. ఇది వ్యవసాయం తో పాటు గా పాడి రంగం తో పాటు చేపల ఉత్పత్తి రంగం పరిధి ని విస్తరింపచేస్తుంది, అంతేకాక రైతులు. పశుపోషణ లో నిమగ్నం అయిన వారు మరియు మత్స్యకారులు కూడా వారి ఉత్పత్తుల కు మెరుగైన ధర లను అందుకొంటారు అని ఆయన అన్నారు.

 

 

డిజిటల్ పేమెంట్స్ యొక్క సాఫల్యాన్ని వ్యవసాయ రంగం లో సైతం ఆచరణ లోకి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఈ బడ్జెటు డిజిటల్ ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయం లో ఒక పెద్ద ప్రణాళిక తో ముందుకు వచ్చింది అని ఆయన అన్నారు.

 

 

ప్రపంచం చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని జరుపుకొంటోందని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం లో అనేకమైనటువంటి పేరుల తో ఎన్నో రకాల చిరుధాన్యాలు ఉన్నాయన్న సంగతి ని ప్రస్తావించారు. చిరుధాన్యాలు ప్రపంచవ్యాప్తం గా అనేక కుటుంబాల చెంత కు చేరుతూ ఉన్నాయి అంటే మరి అలాంటప్పుడు చిరుధాన్యాల కు ప్రత్యేకమైన గుర్తింపు అనేది అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ సూపర్ ఫూడ్ శ్రీ-అన్నానినకి ఒక కొత్త గుర్తింపు ను ఇచ్చింది’’ అని ఆయన అన్నారు. దేశం లోని చిన్న రైతులు మరియు ఆదివాసీ వ్యవసాయదారులు ఆర్థికం గా మద్ధతు ను అందుకోవడమే కాకుండా దేశం లోని పౌరుల కు ఒక ఆరోగ్యదాయకమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

ఈ బడ్జెటు ఒక సుస్థిర భవిష్యత్తు కై గ్రీన్ గ్రోథ్, గ్రీన్ ఇకానమీ, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా గ్రీన్ జాబ్స్ ల కు ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో విస్తరణ కు అవకాశాన్ని ఇస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బడ్జెటు లో మేం సాంకేతిక విజ్ఞానాని కి మరియు కొత్త ఆర్థిక వ్యవస్థ కు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇచ్చాం. నేటి కాలాని కి చెందిన ఆకాంక్ష భరిత భారతదేశం రహదారులు , రైలు మార్గం , మెట్రో , నౌకాశ్రయాలు , ఇంకా జల మార్గాలు .. ఇలా ప్రతి రంగం లోను ఆధునిక మౌలిక సదుపాయాలు కావాలి అని కోరుకొంటున్నది. 2014వ సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల లో పెట్టుబడి 400 శాతాని కి పైగా వృద్ధి చెందింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన లో 10 లక్షల కోట్ల రూపాయల అపూర్వమైనటువంటి పెట్టుబడి భారతదేశం యొక్క అభివృద్ధి కి సరికొత్త శక్తి ని మరియు వేగాన్ని ప్రసాదిస్తుంది అని ఆయన అన్నారు. ఈ పెట్టుబడులు యువత కు వినూత్నమైన ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా జనాభా లో ఎక్కువ శాతాని కి నవీనమైన ఆదాయ ఆర్జన అవకాశాలు అందివస్తాయి అని ఆయన చెప్పారు.

 

 

పరిశ్రమల కు రుణ సమర్థన మరియు సంస్కరణ ల కార్యక్రమం ద్వారా వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని మరింత ముందుకు తీసుకు పోవడం జరిగింది అని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ పూచీకత్తు ను ఇవ్వడమైంది’’ అని ఆయన అన్నారు. సంభావ్య పన్ను తాలూకు పరిమితి ని పెంచడం అనేది ఎమ్ఎస్ఎమ్ఇ వర్థిల్లడాని కి సహాయకారి అవుతుంది అని ఆయన అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు పెద్ద కంపెనీ లు సకాలం లో చెల్లింపులు జరిపేటట్లుగా ఒక కొత్త ఏర్పాటు ను తీసుకు రావడమైంది అని కూడా ఆయన అన్నారు.

 

 

2047 వ సంవత్సరం తాలూకు కలల ను పండించుకోవడం లో మధ్య తరగతి కి గల సత్తా ను ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మధ్య తరగతి ని సశక్తం గా మార్చడం కోసం ప్రభుత్వం గత కొన్నేళ్ళు గా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాల ను తీసుకొంది, మరి ఆ నిర్ణయాల వల్ల జీవించడం లో సౌలభ్యం ఒనగూరింది అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సందర్భం లో ఆయన పన్ను రేటుల లో తగ్గింపు తో పాటు పన్ను రేటుల ను సరళతరం చేయడం, పారదర్శకత ను తీసుకు రావడం గురించి, ప్రక్రియల ను వేగవంతం చేయడం గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ప్రధాన మంత్ర చివర గా ‘‘మా ప్రభుత్వం ఎప్పుడూ మధ్య తరగతి వెన్నంటి నిలచింది; వారికి పన్నుల పరం గా భారీ సహాయాన్ని అందించింది’’ అంటూ ముగించారు.

 

*****

DS/TS



(Release ID: 1895524) Visitor Counter : 234