ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆర్థిక సర్వేక్షణ 2022-23: ముఖ్యాంశాలు


భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలను గమనిస్తే చెప్పుకోదగ్గ మెరుగుదల కనపడుతున్నది, ఆర్థిక సంవత్సరం 2023 లో ఇది మహమ్మారి కాలాని కంటే  పూర్వం నమోదైనవృద్ధి పథం వైపు దూసుకుపోతుస్తున్నది

రిటేల్ ఇన్ ఫ్లేశన్ 2022 నవంబరు లో తగ్గిపోయి ఆర్ బిఐనిర్దేశిత లక్ష్యం పరిధి లోకి వచ్చేసింది 

ప్రత్యక్ష పన్ను వసూళ్ళు 2022 ఏప్రిల్ - నవంబర్ మధ్య కాలం లోఉత్సాహభరితం గా ఉన్నాయి

పట్టణ ప్రాంతాల లో క్షీణిస్తున్న నిరుద్యోగంరేటు మరియు ఉద్యోగి భవిష్య నిధి లో వేగంగా నమోదుఅవుతున్నటువంటి నికర నమోదు ల ను బట్టి ఉద్యోగ కల్పన వృద్ధి చెందుతోందనితెలుస్తోంది 

అవకాశాల ను, మనిషి జీవనం లో దక్షత ను మరియు సౌలభ్యాన్ని మెరుగు పరచడాన్ని, విశ్వాసంపై ఆధారపడిన పాలన ను పెంపొందింపచేయడానికి గాను సార్వజనిక సాధనాల ను సమకూర్చడం,  వ్యవసాయ సంబంధి ఉత్పాదకత ను పెంపొందింప చేయడం లతోపాటుగా అభివృద్ధి లో ఒక సహ- భాగస్వామి గా ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం అనేవి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంస్కరణల లో ముఖ్యమైనవిగా ఉన్నాయి

ఆస్తి- అప్పుల పట్టీల ను బాగుపరచడం తో ఆర్థికసహాయ సంస్థ లు రుణ మంజూరుల లో వృద్ధి నమోదు అయింది

రుణాల స్వీకరణ లో వృద్ధి, ప్రైవేటు మూలధన వ్యయం లో పెరుగుదల..ఇవి లాభదాయక పెట్టుబడి అవకాశాల కు దన్ను గా నిలవబోతున్నాయి

షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుల ఆహారేతర రుణ స్థాయి లు 2022 ఏప్రిల్ నాటి నుండి రెండు అంకెల లో పెరుగుతున్నాయి

షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకు ల స్థూలనిరర్థక ఆస్తుల (జిఎన్ పిఎ) నిష్పత్తి  ఏడుసంవత్సరాల కనిష్ఠ స్థాయి లో 5.0 కు పడిపోయింది 

సామాజిక రంగం లో కేంద్ర మరియురాష్ట్రాల ప్రభుత్వాలు చేసే వ్యయం ఆర్థిక సంవత్సరం 2016 లో 9.1 లక్షల కోట్ల రూపాయలు గా ఉండగా ఎఫ్ వై23 (బడ్జెటెడ్ ఎస్టిమేట్స్) లో 21.3 లక్షల కోట్ల రూపాయల కు పెరిగింది

ఆరోగ్య రంగం లో కేంద్రం మరియు రాష్ట్రప్రభుత్వాల బడ్జెటెడ్ ఎక్స్ పెండిచర్ అనేది ఎఫ్ వై23 (బిఇ) అంచనాల లో చూస్తే జిడిపి లో 2.1 శాతాని కి, ఎఫ్ వై22 (ఆర్ఇ) లో 2.2 శాతానికి చేరుకొంది; అది ఎఫ్ వై21 లో 1.6 శాతం గా ఉంది

కోవిడ్ టీకామందు తాలూకు 220 కోట్ల కు పైగా డోజుల ను ప్రజల కుఇప్పించడం జరిగింది

భారతదేశం లో 2005-06 వ సంవత్సరం మరియు 2019-20 వ సంవత్సరం మధ్య కాలం లో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంటూ బహుళ పార్శ్విక పేదరికం సూచిక ఆధారం గా యుఎన్ డిపి 2022 సంవత్సరానికిఇచ్చిన నివేదిక లో పేర్కొనడాన్ని ప్రస్తావించిన సర్వేక్షణ

నెట్ జీరో ప్లెడ్జ్ ను చాటిన భారతదేశం; 2070 వ సంవత్సరానికల్లా ఉద్గారాల కు ఎంత మాత్రం తావుఇవ్వకూడదన్న లక్ష్యాన్ని సాధించడానికే ఈ ప్రతిజ్ఞ

‘ఎల్ఐఎఫ్ఇ ’ - లైఫ్ స్టయిల్ ఫార్ ఎన్వైరన్ మెంట్ పేరు తో ఒక సామూహిక ఉద్యమాన్ని మొదలు పెట్టడమైంది

భారతదేశం 2047వ సంవత్సరానికల్లా శక్తి  రంగం లో స్వయం సమృద్ధంగా మారాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడేలా నేశనల్ గ్రీన్ హైడ్రోజన్ మిశన్ నుప్రకటించడమైంది 

వ్యవసాయ రంగం లో ప్రైవేటు పెట్టుబడి 2020-21వ సంవత్సరం లో పెరిగి, 9.3 శాతాని కి ఎగబాకింది 

జాతీయ ఆహార భద్రత చట్టం పరిధి లోదాదాపు గా 81.4 కోట్ల మంది లబ్ధిదారుల కు ఒక సంవత్సరం వరకు ఆహారపదార్థాల ను ఉచితం గా ఇవ్వడం జరుగుతుంది

పిఎమ్ కిసాన్ లో భాగం గా 2022-23 ఏప్రిల్ మొదలుకొని జులై మధ్య కాలం లోసుమారు 11.3 కోట్ల మంది రైతుల కు చెల్లింపు సదుపాయాన్ని కల్పించడమైంది

‘చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’కార్యక్రమం లో భాగం గా భారతదేశం చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం లోఅందరికంటే ముందు నిలచింది

ఆర్థిక సంవత్సరం 2022 లో పిఎల్ఐ పథకాల లో భాగం

Posted On: 31 JAN 2023 1:59PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక శాఖ మరియు కార్పరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న అంటే 2023 జనవరి 31 వ తేదీ నాడు కేంద్ర పార్లమెంటు లో ‘2022-23 వ సంవత్సర ఆర్థిక సర్వేక్షణ’ ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేక్షణ తాలూకు ప్రధాన అంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

 

ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు: పూర్తి రికవరీ

 

 • భారతదేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి విరుచుకుపడటం తో కుంచించుకుపోయింది కాస్తా క్రమం గా కోలుకొంది; రష్యా-యూక్రేన్ సాయుధ ఘర్షణ, ద్రవ్యోల్బణం ల ప్రభావం నుంచి బయటపడిన తరువాత ప్రస్తుతం వివిధ రంగాల లో చెప్పుకోదగ్గ మెరుగుదల కనపడుతున్నది. దీనితో ఆర్థిక సంవత్సరం (ఎఫ్ వై) 23 లో మహమ్మారి కి పూర్వ కాలపు వృద్ధి పథం వైపు చురుకుగా అడుగులు వేస్తున్నది.
 • భారతదేశం లో స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు ఎఫ్ వై24 లో దృఢం గా ఉంటుందన్న ఆశ నెలకొంది. ఎఫ్ వై24 లో జిడిపి వృద్ధి రేటు 6 శాతం నుండి 6.8 శాతం స్థాయి లో ఉండగలదని అంచనా వేయడమైంది.
 • ఎఫ్ వై15 నాటి నుండి పరిశీలిస్తే గనుక ఆర్థిక సంవత్సరం పూర్వార్థం లో ప్రైవేటు వినియోగం అత్యధికం గా ఉండింది. మరి ఇది ఉత్పత్తి కార్యకలాపాల కు ఉత్తేజాన్ని అందించింది. దీని ద్వారా వేరు వేరు రంగాల లో సామర్థ్యం యొక్క ఉపయోగం పెరుగుతూ పోయింది.

 

 • వర్తమాన సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం తో పాటు ప్రస్తుతం ప్రైవేటు రంగం లో మూలధన వ్యయం అధికం కావడం తో కార్పొరేట్ బ్యాలెన్స్ శీట్ లు బలపడ్డాయి; ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు వృద్ధి చోదకాల లో ఒకటి గా ఉంది.
 • సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగాని కి రుణాల లో వృద్ధి అనేది 2022 జనవరి మొదలుకొని నవంబరు మధ్య కాలం లో సగటు న 30.6 శాతాని కి మించింది.
 • చిల్లర ద్రవ్యోల్బణాన్ని (రిటైల్ ఇన్ ఫ్లేశన్) చూస్తే గనక 2022 నవంబరు లో అది తగ్గిపోయి మళ్లీ ఆర్ బిఐ లక్షించిన పరిధి లోకి వచ్చేసింది.
 • భారతదేశం కరెన్సీ అయినటువంటి రూపాయి 2022 ఏప్రిల్ మొదలుకొని డిసెంబర్ మధ్య కాలం లో ఇతర ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ తో పోలిస్తే బాగా మెరుగుపడింది.
 • ప్రత్యక్ష పన్ను వసూళ్ళు 2022 ఏప్రిల్ మొదలుకొని నవంబర్ మధ్య కాలాని కి ఉత్సాహకరమైనవి గా ఉన్నాయి.
 • పట్టణ ప్రాంతాల లో నిరుద్యోగం రేటు తగ్గుముఖం పట్టడం, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) లో నికర రిజిస్ట్రేశన్ జోరందుకోవడం.. వీటి పరం గా గమనించినప్పుడు ఉపాధి కల్పన వృద్ధి చెందింది అని చెప్పాలి.
 • తయారీ రంగం లో ఉత్పాదన కు ఊతం గా నిలవడం కోసం చేపట్టిన చర్యలు మరియు పబ్లిక్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్ యొక్క విస్తరణ.. ఈ అంశాలు ఆర్థిక వృద్ధి ని వేగవంతం చేయబోతున్నాయి.

 

భారతదేశం యొక్క మధ్యకాలిక వృద్ధి దృష్టి కోణం: అపేక్షల తో రేకెత్తిన ఆశ లు

 • భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2014-2022 మధ్య కాలం లో అనేక నిర్మాణ సంబంధి సంస్కరణల ను, పాలన సంబంధి సంస్కరణల ను చవి చూసింది; ఫలితం గా ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదులు బలపడ్డాయి, అంతేకాకుండా, ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం మీది సామర్థ్యం వృద్ధి చెందింది.

 

 • జీవించడం లో సౌలభ్యాన్ని మరియు వ్యాపారం నిర్వహణ లో సౌలభ్యాన్ని మెరుగు పరచడం పై అంతర్లీనం గా శ్రద్ధ వహించినందువల్ల 2014వ సంవత్సరం అనంతర కాలం లో చోటు చేసుకొన్న సంస్కరణలు ముఖ్యం గా విశ్వాసం ఆధారితమైన పాలన సరళి ని అవలంబించడం, అభివృద్ధి నిమిత్తం ప్రైవేటు రంగం తో కలసి ముందుకు పోవడం మరియు వ్యవసాయ రంగ ఉత్పాదకత ను మెరుగు పరచడం అనేటటువంటి స్థూలమైన సిద్ధాంతాల ను ఆలంబన గా తీసుకొన్నాయి.
 • 2014-2022 మధ్య కాలం లో కూడాను బ్యాలెన్స్ శీట్ మీద ఒత్తిడి ని గమనించవచ్చు; దీని ఫలితం గా అంతకు పూర్వం సంవత్సరాల లో రుణ మంజూరు బాగా పెరిగిపోయినందువల్ల మరియు చాలా కాలం తరువాత ఒకసారి ఎదురయ్యే ప్రపంచ స్థాయి సంక్షోభం తో కీలకమైన స్థూల ఆర్థిక పరిణామాల పై ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరచాయి.
 • ఇది 1998-2002 మధ్య కాలం లో మాదిరి పరిస్థితుల ను పోలి ఉంది; అప్పట్లో ప్రభుత్వం చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణ లు వృద్ధి కి కొంతవరకు ఆటంకాన్ని ఏర్పరచాయి. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ లో తాత్కాలికం గా ఆఘాతాలు కూడా ఎదురయ్యాయి, ఈ విపరిణామాలు ఒకసారి తెరమరుగు కాగానే నిర్మాణాత్మక సంస్కరణ లు వాటి వృద్ధి సంబంధి లాభాల ను 2003వ సంవత్సరం నుండి అందించడం మొదలుపెట్టాయి.
 • ఇదే తరహా లో 2022వ సంవత్సరం లో తలెత్తిన మహమ్మారి తాలూకు ప్రపంచవ్యాప్త ఆఘాతం ఎప్పుడైతే బలహీనం గా మారిపోతుందో, అలాగే కమాడిటీ ధర ల వృద్ధి తాలూకు ప్రభావం అంతరిస్తుందో అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కచ్చితం గా రాబోయే దశాబ్దం లో బాగా వేగవంతమైనటువంటి వృద్ధి ని నమోదు చేయడాని కి అనువైన స్థితి లో ఉంటుందని చెప్పాలి.
 • బ్యాంకింగ్ రంగం, బ్యాంకింగేతర రంగం, కార్పొరేట్ రంగం లలో ఆస్తి, అప్పుల పట్టీ లు మెరుగు పడినందువల్ల సరికొత్త గా రుణాల మంజూరు ఇప్పటికే వేగాన్ని పుంజుకొన్నది, గత కొన్ని మాసాల లో బ్యాంకు క్రెడిట్ లో రెండు అంకె ల వృద్ధి చోటు చేసుకోవడాన్ని బట్టి ఈ సంగతి స్పష్టం అవుతున్నది.
 • ఆర్థిక ప్రయోజనాలు ఇది వరకటి కంటే మరింత గా విభిన్న వర్గాల కు అందుతూ ఉండడం, డిజిటల్ టెక్నాలజీ ఆధారితమైనటువంటి ఆర్థిక సంస్కరణ లు సృష్టించిన అవకాశాల ద్వారా మంచి ఫలితాల ను భారతదేశ ఆర్థిక వ్యవస్థ అందుకోవడం మొదలుపెట్టింది.
 • ఈ విధం గా సర్వేక్షణ లోని రెండో అధ్యాయం చాటి చెబుతున్నది ఏమిటి అంటే మహమ్మారి కి పూర్వపు సంవత్సరాల తో పోలిస్తే ఇప్పుడు భారతదేశం యొక్క వృద్ధి సంబంధి దృష్టి కోణం మెరుగు గా ఉన్నట్లు కనిపిస్తోంది; అంతేకాకుండా భారతదేశం ఆర్థిక వ్యవస్థ రాబోయే సంవత్సరాల లో తన పూర్తి సామర్థ్యం తో వృద్ధి చెందేందుకు తయారు గా ఉన్నది అని కూడా అర్థం అవుతోంది.

 

ప్రభుత్వ కోశ సంబంధి ఘటన క్రమం: ప్రభుత్వ ఆదాయం అమాంతం ఎగసింది

 • ఆర్థిక సంవత్సం 2023 లో కేంద్ర ప్రభుత్వ విత్త రాశులు ఆటుపోటు లను తట్టుకొని నిలచాయి, ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ పుంజుకోవడం, ప్రత్యక్ష పన్నులు, వస్తువులు మరియు సేవ ల పన్ను (జిఎస్ టి) ల నుండి లభించే రాబడులు పెరగడం, ఇంకా బడ్జెటు లో వాస్తవికమైనటువంటి అంచనాల ను పేర్కొనడం ఇందుకు కారణం అయ్యాయి.
 • పన్నుల రూపేణా లభించిన మొత్తం ఆదాయం 2022 ఏప్రిల్ మొదలుకొని నవంబరు మధ్య కాలం లో 15.5 శాతం వార్షిక వృద్ధి ని నమోదు చేసింది. ప్రత్యక్ష పన్నుల లోను, వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) లోను బలమైన వృద్ధి దీనికి కొమ్ము కాసింది.
 • వర్తమాన ఆర్థిక సంవత్సరం లోని తొలి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల లో వృద్ధి నిజానికి దీని దీర్ఘకాలిక సగటు లతో పోల్చి చూసినప్పుడు ఎంతో ఎక్కువ గా ఉన్నది.
 • జిఎస్ టి అనేది ఇక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ప్రభుత్వాల కు ఒక కీలకమైనటువంటి రాబడి వనరు గా స్థిరపడిపోయింది; జిఎస్ టి స్థూల వసూళ్ళు 2022 ఏప్రిల్ మొదలుకొని డిసెంబరు వరకు చూస్తే వార్షిక ప్రాతిపదికన 24.8 శాతం మేరకు పెరిగాయి.
 • వర్తమాన ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వ వ్యయం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ గా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తరఫు నుండి మూలధనం రూప వ్యయం (కేపెక్స్) విషయం లో నిరంతరం ప్రత్యేక శ్రద్ధ ను వహించడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ మూలధన రూప వ్యయం దీర్ఘకాలిక వార్షిక సగటు (ఎఫ్ వై09 నుండి ఎఫ్ వై20 వరకు) అయినటువంటి జిడిపి లో 1.7 శాతం నుండి అదే పని గా హెచ్చుతూ వెళ్లి ఎఫ్ వై22 లో జిడిపి లో 2.5 శాతాని కి చేరుకొంది.
 • రాష్ట్రాల ప్రభుత్వాలు కెపెక్స్ పరం గా వాటి వ్యయం పై ప్రాధాన్యాల ను నిర్ణయించుకొనేందుకు వీలు గా, వడ్డీ లేని రుణాల ద్వారా మరియు అప్పుల గరిష్ట పరిమితుల ను అధికం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రోత్సాహకాల ను సైతం కేంద్రం అందించింది.
 • రహదారులు, రాజమార్గాలు, రైలు మార్గాలు, గృహ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన ముమ్మరం గా ఉండేటటువంటి రంగాల పై ప్రత్యేక శ్రద్ధ ను వహించడం తో మూలధన వ్యయం లో వృద్ధి అనేది మధ్యకాలిక వృద్ధి పై భారీ ఎత్తున సకారాత్మకమైన ప్రభావాన్ని ప్రసరింప చేయనుంది.
 • ప్రభుత్వం యొక్క మూలధన వ్యయ ప్రధానమైనటువంటి వృద్ధి సంబంధి వ్యూహం తో భారతదేశం వృద్ధి కి, వడ్డీ రేటు కు మధ్య సకారాత్మకమైన అంతరాన్ని అవలంబించే విధానాని కి ఆస్కారం కల్పిస్తున్నది; పలితం గా రాబోయే సంవత్సరాల లో రుణం మరియు జిడిపి నిష్పత్తి ని ఒక స్థాయి కి పరిమితం చేయడం సాధ్యపడనుంది.

 

 

ద్రవ్య సంబంధి నిర్వహణ మరియు విత్తీయ మధ్యస్థత: ఒక చక్కని సంవత్సరం గా నిరూపణ అయింది

 • భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) 2022 ఏప్రిల్ లో తన ద్రవ్య సంబంధి ఆంక్ష ల విధానాన్ని మొదలు పెట్టింది; రెపో రేటు ను 225 బేసిస్ పాయింట్ ల మేరకు ఆర్ బిఐ పెంచింది; దీనితో వ్యవస్థ లో మిగులు గా ఉన్న ద్రవ్య చలామణి తగ్గుతూ వచ్చింది.
 • బ్యాలెన్స్ శీటు లు మెరుగుపడడం తో ఆర్థిక సహాయ సంస్థ లు రుణాల ను మంజూరు చేయడం అధికం అయింది.
 • రుణాల స్వీకరణ లో వృద్ధి కొనసాగుతుందని ఆశించడమైంది. దీనికి అదనం గా ప్రైవేటు రంగం లో మూలధన వ్యయం జోరు ను అందుకొని, పెట్టుబడి ఆశాజనకం గా మారగలదని అంచనా వేయడం జరిగింది.
 • షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకు (ఎస్ సిబి )ల ఆహారేతర రుణాలు 2022 ఏప్రిల్ నుంచే క్రమం గా రెండు అంకెల స్థాయి లో పెరుగుతున్నాయి.
 • బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బిఎఫ్ సి ) ల ద్వారా రుణాల మంజూరు సైతం వృద్ధి చెందుతున్నది.
 • ఎస్ సిబి ల స్థూల నిరర్ధక ఆస్తుల (జిఎన్ పిఎ) నిష్పత్తి ఏడు సంవత్సరాల లో అతి తక్కువ స్థాయి లో 5.0 కు పడిపోయింది.
 • కేపిటల్-టు-రిస్క్ వెయిటెడ్ ఎసెట్ రేశియో (సిఆర్ఎఆర్) ఇప్పుడు కూడాను అధికం గా 16.0 స్థాయి లో ఉన్నది.
 • ఇన్ సాల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి (ఐబిసి) పద్ధతి లో ఎస్ సిబి ల రికవరీ రేటు ఇతర మార్గాల తో పోల్చి చూసినప్పుడు ఆర్థిక సంవత్సరం 22 లో అత్యంత అధికం గా ఉంది.

 

ధరలు మరియు ద్రవ్యోల్బణం: చక్కని సమతుల్యత సాధన

• ఒక వైపు న అభివృద్ధి చెందిన దేశాల లో ముప్పై నుండి నలభై ఏళ్ళ దీర్ఘ అంతరాళం అనంతరం అధిక ద్రవ్యోల్బణం తిరిగి తలెత్తగా మరో వైపు న భారతదేశం లో 2022వ సంవత్సరం ధరల పెరుగుదల కు ఒక స్థాయి కి పరిమితం అయింది.

• భారతదేశం లో చిల్లర ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్ నెల లో 7.8 శాతం గా ఇదివరకు ఎన్నడూ ఎరుగని స్థాయి కి చేరుకొంది. ఇది రిజర్వు బ్యాంకు నిర్దేశించుకొన్న 6 శాతం పరిమితి కన్నా మించిపోయింది, అయితే లక్షిత శ్రేణి లో ఎగువ అంచె కన్నా ద్రవ్యోల్బణం మితిమీరడం అనేది ప్రపంచ దేశాల తో పోల్చినప్పుడు మాత్రం అతి తక్కువ రేటుల లో ఒకటి గా ఉండడం గమనించదగ్గది గా ఉంది.

• ధర ల స్థాయి ల లో పెరుగుదల కు కళ్ళెం వేయడం కోసం ప్రభుత్వం బహుళ విధ వ్యూహాన్ని అవలంబించింది.

• పెట్రోలు మరియు డీజిల్ ల ఎగుమతి సుంకం లో దశల వారీ గా తగ్గింపు ను అమలుపరచడమైంది.

• ప్రధానమైన ఇన్ పుట్స్ విషయం లో దిగుమతి సుంకాన్ని సున్నా స్థాయి కి తీసుకు రావడమైంది; ఇనుప ఖనిజాలు మరియు కాన్సెన్ ట్రేట్స్ ఎగుమతి పై పన్నుల ను 30 శాతం నుండి 50 శాతాని కి పెంచడం జరిగింది.

• పత్తి దిగుమతుల పై కస్టమ్స్ సుంకాన్ని 2022 ఏప్రిల్ 14వ తేదీ మొదలుకొని 2022 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాఫీ చేయడమైంది

• హెచ్ ఎస్ కోడ్ 1101 లో భాగం గా గోధుమ ఉత్పత్తుల ఎగుమతి పై నిషేధాన్ని విధించడం మరియు బియ్యం పై ఎగుమతి సుంకాన్ని విధించడం జరిగింది.

• ముడి మరియు శుద్ధి చేసిన పామ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్ మరియు ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనె లపై ప్రాథమిక సుంకాన్ని తగ్గించడమైంది.

• ద్రవ్యోల్బణం రాబోయే కాలం లో ఏ స్థాయి లో ఉండవచ్చో అనేది వివరించడం, మరి దానికి ప్రతి చర్య గా ద్రవ్య సంబంధి విధానం రూపొందించడం అనే పద్ధతుల లో ద్రవ్యోల్బణం ధోరణు లకు అడ్డుకట్ట వేయాలనే వ్యూహాన్ని రిజర్వు బ్యాంకు అనుసరించడం దేశం లో ద్రవ్యోల్బణం తాలూకు పయనాన్ని అవగాహన ను ఏర్పరచుకోవడం లో సాయపడింది.

• అటు వ్యాపార సంస్థ లు, ఇటు కుటుంబాలు రాబోయే ఒక సంవత్సర కాలం లో ద్రవ్యోల్బణం ఏ విధం గా ఉండబోతోందో అనే విషయం లో వేసుకొన్న అంచనాలు వర్తమాన ఆర్థిక సంవత్సరం లో సులభతరం గా మారిపోయాయి.

• గృహ నిర్మాణ రంగం లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధానం పరం గా జోక్యం చేసుకొంటూ రావడం, చవక గృహ రుణ వడ్డీ రేటులు అనేవి డిమాండు ను పెంచివేయడానికి దోహదం చేశాయి. కొనుగోలు దారులు ఎఫ్ వై 23 లో తక్కువ ధరల గృహాల విభాగం వైపు ఆకర్షితులు అయ్యారు.

కాంపోజిట్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్ పిఐ) ను పరిశీలిస్తే మొత్తంమీద నమోదైన వృద్ధి మరియు గృహ నిర్మాణం సంబంధి ధరల సూచికల తో ముడిపడ్డ బజారు విలువల తో హౌసింగ్ ఫినాన్స్ రంగం లో మళ్ళీ వేగం పుంజుకొన్న సంకేతాలు కానవస్తున్నాయి. హెచ్ పిఐ లో స్థిరం నుండి మొదలుకొని సాధారణ వృద్ధి చోటు చేసుకొంటుండడం తో ఆస్తుల ను కలిగివుంటే వాటి విలువ పెరగడం కొనసాగగలదన్న విశ్వాసం ఇటు ఇంటి యజమానుల లోను, అటు ఇళ్ల నిర్మాణానికి రుణాల ను అందించే సంస్థల లోను పెరిగిపోతుంది.

· ద్రవ్యోల్బణాన్ని సంబాళించే అంశం లో భారతదేశం ప్రయాస లు, మరీ ముఖ్యం గా గుర్తుంచుకోదగ్గవి గా ఉన్నాయి; ఇవి అభివృద్ధి చెందిన దేశాల ప్రస్తుత స్థితిగతులకు పూర్తి భిన్నం గా ఉన్నాయి ఎందుకంటే ఆ దేశాలు ఇప్పటికీ అధిక ధరల తో ఇంకా సతమతం అవుతూనే ఉన్నాయి.

సామాజిక మౌలిక వసతులు, ఉపాధి : విస్తృత అభిప్రాయాల ఫలితం

·         ప్రభుత్వ వ్యయంలో సామాజిక రంగానికి చెప్పుకోదగినంత అధిక వ్యయం  

·         కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఆరోగ్య రంగం మీద పెట్టే బడ్జెట్  వ్యయం  2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో 2.1% కు చేరిక, 2022 ఆర్థిక సంవత్సరంలో అది 2.2% కాగా 2021 ఆర్థిక సంవత్సరంలో 1.6%

·        సామాజిక రంగ వ్యయం 2016 లో 9.1 లక్షల కోట్లు కాగా 23 ఆర్థిక సంవత్సరానికి 21.3 లక్షల కోట్లకు పెరుగుదల  

·         బహుముఖ పేదరిక సూచీ మీద ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రాజెక్ట్ 2022 నివేదిక లో చెప్పిన అంశాలను ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది.  2005-06 నుంచి 2019-20 మధ్య కాలంలో 41,5 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బైటపడినట్టు చెప్పింది. 

·         మారుమూల, క్లిష్టమైన ప్రాంతాలలో సుపరిపాలనకు ఉదాహరణగా ఆకాంక్షా పూరిత జిల్లాల కార్యక్రమం సాగింది. 

·         అసంఘటిత రంగపు కార్మికుల సమాచారాన్ని పొందుపరచటానికి రూపొందించిన ఈ-శ్రమ్ పోర్టల్ ను ఆధార సాయంతో ధ్రువీకరించారు. 2022 డిసెంబర్ 31 నాటికి మొత్తం 28.5 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యారు 

·         జన్ ధన్,  ఆధార్, మొబైల్ త్రయానికి తోడుగా ప్రత్యక్ష నగదు బదలీ ఇచ్చిన శక్తితో సమాజంలోని బడుగు బలహీన వర్గాలు లాంఛన పూర్వకమైన ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు. ఈ విధమైన విప్లవాత్మక, పారదర్శక, బాధ్యతాయుత పాలనతో ప్రజలు సాధికారత పొందారు.

·         కో-విన్ వేదిక రూపకల్పనలో ఆధార చాలా కీలకపాత్ర పోషించింది. 200 కోట్లకు పైగా టీకా డోసుల నిర్వహణలో పారదర్శకత సాధించటానికి ఉపయోగపడింది.

·        పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కార్మిక మార్కెట్లు కోలుకొని కోవిడ్ పూర్వ స్థితికి చేరాయి. నిరుద్యోగితా శాతం 2018-19 లో 5.8 శాతం ఉండగా 2020-21 లో 4.2 శాతానికి పడిపోయింది.    

·         2022 ఆర్థిక సంవత్సరం  స్కూళ్ళలో స్థూల చేరికల నిష్పత్తిలోనూ, లింగ భేద తగ్గింపులోనూ పురోగతి చూసింది.  1నుంచి 5 వ తరగతి వరకూ 6-10 ఏళ్ల మధ్య జనాభాలోనూ, బాలబాలికల సంఖ్యలోనూ 2022 లో పరిస్థితి  మెరుగుపడింది. 

·         ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున అనేక చర్యల ఫలితంగా మొత్తం ఆరోగ్య వ్యయంలో స్వయంగా భరించాల్సిన వ్యయం 2014లో 64.2% ఉండగా, 2019 లో 48.2 శాతానికి తగ్గింది. 

·         శిశుమరణాల శాతం, ఐదేళ్లలోపు బాలల మరణం, పురిటి మరణాల శాతం బాగా తగ్గుతూ వస్తున్నాయి.    

·         2023 జనవరి 6 నాటికి 220 కోట్ల కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది 

·       2023 జనవరి 4 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద దాదాపు 22 కోట్లమంది లబ్ధిదారుల తనిఖీ జరిగింది.   ఆయుష్మాన్ భారత్ కింద 1.54 లక్షల ఆరోగ్య, వెల్ నెస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా వాడకంలోకి వచ్చాయి.

వాతావరణ మార్పు, పర్యావరణం: భవిష్యత్తు ఎదుర్కోవటానికి సంసిద్ధత 

·         2070 నాటికి ఉద్గారాల విడుదల సున్నా స్థాయికి తీసుకు రావటానికి భారత్ ప్రతిన బూనింది

·        2030 కి ముందే శిలాజేతర ఇంధనాలనుంచి 40 శాతం సంస్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని భారత్ సాధించింది   

·       2029-30 నాటికి శిలాజేతర ఇంధన సంస్థాపిత సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పైగా ఉండేలా చూసి, సగటు ఉద్గారాల విడుదలను 2014-15 తో పోల్చినప్పుడు  29 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.

·         2005 తో పోల్చినప్పుడు 2030 నాటికి ఉద్గారాల సాంద్రతను జీడీపీలో 45 శాతానికి భారత్ తగ్గించబోతోంది. 

·         2030 నాటికి మొత్తం సంస్థాపిత విద్యుత్ శక్తిలో సుమారు 50% శిలాజేతర ఇంధన వనరుల నుంచి రావాలి   

·         పర్యావరణం కోసం జీవనశైలి ( లైఫ్) అనే ప్రజా ఉద్యమం ప్రారంభించబడింది.

·         2022 నవంబర్ లో సావరిన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్ వర్క్ జారీ చేయబడింది. 

·         4,000 కోట్ల రూపాయల విలువచేసే సావరిన్ గ్రీన్ బాండ్స్ ను రిజర్వ్ బాంక్ రెండు దఫాలుగా వేలం వేసింది.

·        2047 నాటికి భారతదేశం ఇంధనంలో స్వావలంబన సాధించటానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజెన్ మిషన్ చేపట్టింది.   

·        2030 నాటికి కాలుష్య రహిత హైడ్రోజెన్ ఉత్పత్తి సామర్థ్యం కనీసం ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు  ఉండేట్టు చూడాలని నిర్ణయించింది.   మొత్తంగా 2030 నాటికి నేషనల్ గ్రీన్ హైడ్రోజెన్ మిషన్ కింద రూ. లక్ష కోట్ల శిలాజ ఇంధన దిగుమతులు తగ్గించాలని, 6 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని నిర్ణయించారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మరి 125 గిగావాట్ల పెంపు కూడా లక్ష్యంగా ఉంది. 

·         వాతావరణ సంబంధమైన ఎనిమిది లక్ష్యాల పురోగతిని, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించటాన్ని సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. 

·       జాతీయ సోలార్ మిషన్ కింద సౌర శక్తి సంస్థాపిత సామర్థ్యం 2022 అక్టోబర్ నాటికి 61.6 గిగావాట్లు ఉంది.    

·        పునరుత్పాదక ఇంధనానికి భారత్ ఒక గమ్యస్థానంగా మారిమిడ్. ఇందులో పెట్టుబడులు 7 ఏళ్లలో 78.1 బిలియన్ డాలర్లకు చేరాయి.   

·         2022 ఆగస్టు నాటికి 62.8 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 6.2 లక్షల సాముదాయక, ప్రజా మరుగుదొడ్లు కట్టారు  

వ్యవసాయం, ఆహార యాజమాన్యం 

·       వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పనితీరు గత కొద్ది సంవత్సరాలలో ఉత్సాహ పూరితంగా సాగుతోంది. ఇదంతా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పంటల దిగుబడికి తోడుగా పశుగణాభివృద్ధికి కూడా ప్రోత్సాహమివ్వటం  వలన రైతులకు లబ్ధి చేకూర్చవచ్చునని భావిస్తోంది. మద్దతు ధర, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, మార్కెట్ మౌలిక సదుపాయాల మెరుగుదల, రైతు-ఉత్పత్తిదారు సంస్థల ఏర్పాటును ప్రోత్సహించటం, వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి పెట్టుబడుల ప్రోత్సాహకాలు అందించటం

·         వ్యవసాయరంగంలో ప్రైవేట్ పెట్టుబడులు 2020-21 నాటికి 9.3% పెరిగాయి   

·         2018 నుంచి అన్ని నిర్దిష్ట పంటల గరిష్ఠ మద్దతు ధర అఖిల భారత సగటుకు 1.5 రెట్లు ఉండేలా నిర్దేశించారు.

·         వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021-22 కు 18.6 లక్షల కోట్లకు పెరిగింది. 

·         భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరంగా ఎదుగుతూ 2021-22 నాటికి 315.7 మిలియన్ టన్నులకు చేరింది..

·         జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 2023 జనవరి 1 తరువాత 81.4 కోట్లమంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ 

·        2022-23 ఏప్రిల్-జులై చెల్లింపు కాలంలో దాదాపు 11.3 కోట్లమంది రైతులకు లబ్ధి కలిగింది.

·         వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద పంట దిగుబడి అనంతర మద్దతు, సాముదాయక సాగుభూమి కింద రూ. 13,681 కోట్ల మంజూరు   

·         ఆన్ లైన్, పోటాపోటీ, పారదర్శక బిడ్డింగ్ వ్యవస్థ ద్వారా 1.74 కోట్లమంది రైతులు, 2.39 లక్షలమంది వర్తకులు జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) పథకంలో భాగస్వాములయ్యారు.  

·         రైతు-ఉత్పత్తిదారు సంఘాల ద్వారా సంప్రదాయ వ్యవసాయాభివృద్ధి పథకం కింద సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం  

·         అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా భారతదేశం ఈ విషయంలో అందరికంటే ముందుంది. 

పరిశ్రమ: స్థిరంగా కోలుకుంటూ 

·         2022-23 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమ రంగం మొత్తంగా చేర్చిన స్థూల విలువ 3.7 శాతం పెరిగింది. ఇది గత దశాబ్దపు ప్రథమార్థంలో సాధించిన 2.8 శాతం ఎదుగుదల కంటే ఎక్కువ.   

·        డిమాండ్ కు తగినట్టు సప్లయ్ చేసే పరిశ్రమ స్పందన చాలా చురుగ్గా ఉంది.

·         పీఎంఐ తయారీ 2021 జులై నుంచి 18 నెలలుగా విస్తరణ దిశగా సాగుతోంది.  పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆరోగ్యవంతమైన వేగంతో  ఎదుగుతోంది.  

·        సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలకు రుణాలు  2022 అక్టోబర్ నుంచి సగటున 30% ఎదుగుదల బాటలో సాగుతూ వచ్చింది. భారీ పరిశ్రమల రుణాలు 2022 అక్టోబర్ నుంచి రెండంకెల ఎదుగుదలతో సాగుతున్నాయి. 

·        ఎలక్ట్రానిక్ ఎగుమతులు 2019 లో ఉన్న 4.4 బిలియన్ డాలర్ల నుంచి 2022 నాటికి 11.6 బిలియన్ డాలర్లకు చేరి దాదాపు మూడు రెట్లు పెరిగాయి.  

·         అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం రెండవ అతి పెద్ద దేశంగా మారింది. 2015 లో 6 కోట్ల ఫోన్లు తయారు చేయగా 2021 లో అది 29 కోట్ల యూనిట్లకు పెరిగింది.  

·        ఫార్మా పరిశ్రమలోకి విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం నాలుగు రెట్లు పెరిగింది. 2019 లో అది 180 మిలియన్ డాలర్లు కాగా, 2022 కలల అది 699 మిలియన్ డాలర్లు అయింది  

·         ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాల పథకం 14 విభాగాలకు వర్తింపజేస్తూ ప్రారంభించగా వచ్చే ఐదేళ్లకోశం దీనికి 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివలన భారతదేశం అంతర్జాతీయ మార్కెట్ లో కీలకపాత్ర పోషించే అవకాకాశముంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పి ఎల్ ఐ పథకం కింద రూ. 47,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది లక్ష్యానికి 106% అధికం. ఈ పథకం కారణంగా రూ. 3.85 లక్షగాల కోట్ల ఉత్పత్తి/అమ్మకాలతోబాటు 3 లక్షలమండికి ఉపాధి కూడా దొరికింది.   

·         2023 నాటికి అనుసరించాల్సిన 39,000 కు పైగా నియమనిబంధనలను తగ్గించటం, 3500 నేర నిబంధనలను తొలగించటం చూశాం.

సేవలు : బలానికి మూల కారణం

·         2023 ఆర్థిక సంవత్సరంలో సేవారంగం 9.1% ఎదుగుతుందని అంచనా. 2022 లో అది 8.4% నమోదైంది.  

·        2022 తరువాత నమోదైన జులై పిఎంఐ  సేవల వేగవంతమైన విస్తరణను బట్టి ఈ రంగం పనితీరు తెలుస్తోంది.   

·       2021 లో సేవల ఎగుమతిలో పది ఉత్తమదేశాల్లో భారత్ అగ్రభాగాన ఉంది. వాణిజ్య సేవల ఎగుమతులలోప భారత్ వాటా 2015 లో 3 శాతం ఉండగా 2021 నాటికి 4 శాతానికి చేరింది.   

·      కోవిడ్ కాలంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణంలో డిజిటల్ సహాయానికి పెరిగిన డిమాండ్ నేపథ్యంలో క్లౌడ్ సేవలు, మౌలిక సదుపాయాల ఆధునీకరణ ద్వారా భారత సేవలు చాల వేగంగా కోలుకోగలిగాయి..

·         సేవారంగానికి పరపతి సౌకర్యం 2022 జులై నుంచి 16% పెరిగింది. 

·       2022 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 7.1 బిలియన్ డాలర్లు చేరింది.    

·         రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిరమైన ఎదుగుదల వలన ఇళ్ళ అమ్మకాలు మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరాయి. 2021-22 మధ్య కాలంలో 50% పెరుగుదల నమోదైంది 

·       హోటళ్లలో ఖాళీలు నిండిన పరిస్థితి కూడా 2021 ఏప్రిల్ లో 30-32% ఉండగా 2022 నవంబర్ నాటికి అది 68-70% కు చేరింది.  

·         పర్యాటక రంగం కూడా వేగంగా కోలుకుంటోంది.  2023 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యాటకుల రాక నెల నెలకూ పెరుగుతూ వస్తోంది. కోవిడ్ నిబంధనల సడలింపు  వలన విమానాల రాకపోకలు కూడా పెరగటంతో ఇది సాధ్యమైంది.

·        డిజిటల్ వేదికలు భారతదేశ ఆర్థిక సేవలను పూర్తిగా మార్చేశాయి.

 ·       భారతదేశపు ఈ-కామర్స్ మార్కెట్ 2025 దాకా ఏటా ఏటా 18 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా

ఎగుమతుల రంగం

·       వస్తు సామగ్రి ఎగుమతులు 2022 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 332.8 బిలియన్ డాలర్లు

·        భారతదేశం తన మార్కెట్లను వైవిధ్యభరితం చేయటం ద్వారా బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా లాంటి దేశాలకు విస్తరించింది.   

·         మార్కెట్ సైజ్ పెంచుకొని మెరుగ్గా చొచ్చుకు పోవటానికి 2022 లో యూఏఈ, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది 

·        విదేశీ నిధులు అందుకోవటంలో భారత దేశం అతిపెద్దదిగా ఉంది.  2022 లో 100 బిలియన్ డాలర్లు అందుకుంది.   విదేశీ నిధులు పొందటంలో సేవల ఎగుమతులు తరువాత ఇదే రెండో అతిపెద్ద మార్గం.   

·        2022 డిసెంబర్ నాటికి విదేశీ  మారకద్రవ్య నిల్వలు 563 బిలియన్ డాలర్లు. ఇది 9.3 నెలల దిగుమతుల ఫలితం.

·        2022 నవంబర్ ఆఖరునాటికి  భారతదేశం ప్రపంచంలో విదేశీ మారకద్రవ్య నిల్వలున్న ఆరో  అతిపెద్ద దేశం

·         ప్రస్తుత విదేశీ రుణానికి దీటైన విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. 

·        స్థూల జాతీయ ఆదాయంతో పోల్చినప్పుడు మొత్తం అప్పులో శాతంగా చూసినప్పుడు భారతదేశానికి తక్కువ స్థాయి రుణం ఉన్నట్టే లెక్క.  

భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు 

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ దార్శనికత

·         ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలు  

·        56 ప్రాజెక్టులకు సూత్ర ప్రాయ ఆమోదం లభించింది.  2014-15 నుంచి 2022-23 మధ్య విజిఎఫ్ పథకం కింద మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ. 57,870.1 కోట్లు.  

o    రూ.150 కోట్ల అంచనాతో ఐఐపిడిఎఫ్ పథకం కింద 2022 నవంబర్ 3 నుంచి 2023-25 నుంచి అమలయ్యేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. 

·         జాతీయ మౌలిక సదుపాయాల వాహిక 

o    రూ. 141.4 లక్షల కోట్ల విలువ చేసే 89,151 ప్రాజెక్టులువివిధ దశలలో అమలులో ఉన్నాయి.   

·        రూ. 5.5 లక్షల కోట్ల విలువచేసే  1009 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 

·        o    ఎన్ ఐ పి, ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్  పోర్టల్ అనుసంధానత ద్వారా వేగంగా ప్రాజెక్టులకు అనుమతుల మంజూరుకు క్లియరెన్సులకు వెసులుబాటు 

·         నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్  

o    మొత్తం పెట్టుబడులకు అవకాశం ₹ 9.0 లక్షల కోట్లుగా అంచనా.

·        2022 సంవత్సరానికి మానిటైజేషన్ లక్ష్యం రూ. 0.8 లక్షల కోట్లు కాగా, సాధించింది  రూ  0.9 లక్షల కోట్లు 

·       2023 ఆర్థిక సంవత్సరపు లక్ష్యం  ₹1.6 లక్షల కోట్లు ( మొత్తం ఎన్ ఎం పి లక్ష్యంలో 27 శాతం)   

గతిశక్తి 

o    పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ సమగ్రమైన డేటాబేస్ సృష్టించి సమీకృత ప్రణాళికా రచనకు ఉపయోగపడుతుంది. వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల మధ్య సమన్వయానికి సహాయపడుతుంది.   

o    బహుళమార్గ అనుసంధానతను మెరుగుపరచటం లక్ష్యంగా రవాణా సమర్థత పెంచుతుంది. నిరంతరాయంగా ప్రజలను, సరకును రవాణా చేయటానికి అవరోధాలు తొలగిస్తుంది.  

విద్యుత్ రంగం, పునరుత్పాదకత  

·         2022 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వం మొత్తం 40 గిగావాట్ల సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది. 16 రాష్ట్రాలలోని 50 సోలార్ పార్కుల ద్వారా మొత్తం సామర్థ్యాన్ని సాధిస్తారు. 

·       2022 ఆర్థిక సంవత్సరంలో  17.2  లక్షల గిగా వాట్ అవర్ విద్యుదుత్పత్తి జరిగింది.  2021 లో 15.9 లక్షల గిగా వాట్ అవర్  మాత్రమే ఉత్పత్తి అయింది. 

అంతర్జాతీయంగా పోటీ పడగలిగేలా భారత రవాణా

·         సాంకేతిక సమర్థతతో కూడిన, సమీకృత, ఖర్చుకు తగిన, సుస్థిర, నమ్మదగిన రవాణా వ్యవస్థ దేశంలో ఉండాలని  జాతీయ రవాణా విధానం కోరుకుంటోంది. దాని ద్వారానే వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని భావిస్తోంది.  

·       జాతీయ రహదారుల నిర్మాణంలో వేగవంతమైన పురోగతి ఉండగా 2022 లో 10457 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం   జరిగింది. 2016 లో అది 6061 కిలోమీటర్లు మాత్రమే.  

·         మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ వ్యయం 2020 లో ఉన్న 1.4 లక్షల కోట్ల నుంచి 2023 లో 2.4 లక్షల కోట్లకు పెరిగింది.   

·         2359 కిసాన్ రైళ్ళు సుమారు 7.91 లక్షల టన్నుల కూరగాయలు,పళ్ళ వంటి చెడిపోయే సరకు రవాణా చేశాయి.  

·         కోటి మందికి పైగా విమాన ప్రయాణీకులు ఉడాన్ పథకం ప్రారంభమైన 2016 నుంచి లబ్ధిపొందారు.  

·         8 ఏళ్లలో ప్రధాన నౌకాశ్రయాల సామర్థ్యం దాదాపు రెట్టింపైంది.

·       100 సంవత్సరాల నాటి చట్టం స్థానంలో ఇన్ లాండ్ వేసెల యాక్ట్ 2021 తయారైంది. దీనివలన నౌకారవాణాకు అనేక అవాంతరాలు తొలగిపోయాయి.    

భారతదేశ ప్రజల డిజిటల్ మౌలిక వసతులు  

·         ఏకీకృత చెల్లిపు మార్గం ( యూపీఐ)

o    యూపీఐ ఆధారిత లావాదేవీలు  2019-22 మధ్య కాలంలో విలువరీత్యా 121 శాతం, పరిమాణం రీత్యా 115 శాతం పెరిగాయి.  వీటిని అంతర్జాతీయంగా అనుసరించే మార్గం సుగమమైంది

·      డిజిటల్ సాధికారతకు టెలిఫోన్, రేడియో    

o    భారత్ లో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 2022 సెప్టెంబర్ నాటికి 117.8 కోట్లు కాగా వారిలో 44.3 శాతం మంది చందాదారులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు

o    98 శాతానికి పైగా టెలిఫోన్ చందాదారులు వైర్లెస్ ద్వారా అనుసంధానమయ్యారు.  

o    భారతదేశంలో మొత్తం టెలిఫోన్ సాంద్రత 2022 మార్చినాటికి 84.8 శాతం

o    2015-21 మధ్య కాలంలో గ్రామీణ ఇంటర్నెట్ పెరుగుదల 200 శాతం

o    ప్రసార భారతి 23 భాషలలో 179 యాసలలో 479 స్టేషన్ల ద్వారా ప్రసారాలు అందజేస్తూ 92 శాతం జనాభాను, 99.1 శాతం విస్తీర్ణాన్ని చేరుతోంది. 

·         డిజిటల్ ప్రజా ఉత్పత్తులు

o    2009 లో ఆధార్ ప్రారంభించినప్పటినుంచి తక్కువ ధరకే అందుబాటు మొదలైంది  

o    ప్రభుత్వ పథకాలైన మైస్కీం, ట్రెడ్స్, జెమ్, ఈ-నామ్, ఉమాంగ్ మార్కెట్ ను సమూలంగా మార్చివేసి అన్నీ రంగాల సేవాలనూ ప్రజలకు చేరువ చేసింది.   

o    ఖాతాల సమీకృతం కింద అనుమతి ఆధారంగా డేటా మార్పిడికి అవకాశం కల్పిస్తూ 110 కోట్ల బాంకు ఖాతాలు వాడకంలో ఉన్నాయి.  

o    జాతీయ కృత్రిమ మేధ పోర్టల్ లో  1520 వ్యాసాలు, 262 వీడియోలు, 120 ప్రభుత్వ చొరవలు ఉన్నాయి. భాషిణి లాంటివి  భాషాసమస్యను కూడా అధిగమించేట్టు చేశాయి.

o    వాడకందారు ప్రైవసీని కాపాడేందుకు ప్రామాణిక, పరస్పరం అనుసంధానించగల ప్రోటోకాల్స్ కు తగిన వాతావరణం సృష్టించటానికి, మెరుగైన ఆధునిక డేటా నిర్వహణకు వీలైన చట్టాలను ప్రవేశపెడుతున్నారు. 

 

***

 (Release ID: 1895116) Visitor Counter : 4873