ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ఇండోర్‌లో ప్రవాస భారతీయ దినోత్సవానికి హాజరు కానున్న ప్రధాని

Posted On: 08 JAN 2023 5:22PM by PIB Hyderabad

    ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఇండోర్‌ వెళ్తున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

"ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా రేపు… జనవరి 9న ఉజ్వల నగరం ఇండోర్‌ వెళ్లడానికి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన ప్రవాసులతో అనుబంధాన్ని మరింత పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1889666) Visitor Counter : 155