ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కోసం సూచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి
Posted On:
13 DEC 2022 9:53AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 డిసెంబర్ 25వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు ప్రసారం కావలసి ఉన్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఎపిసోడ్ కోసం ప్రజలు వారి సూచనల ను వెల్లడించవలసిందంటూ ఆహ్వానించారు. ప్రజలు వారి ఆలోచనల ను Namo App, MyGov లలో వ్రాయాలని, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి వారి సందేశాన్ని రికార్డు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు.
ప్రధాన మంత్రి MyGov ఆహ్వానం తాలూకు లింకు ను శేర్ చేస్తూ, ఒక ట్వీట్ లో -
‘‘2022వ సంవత్సరం లో చివరి #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నాడు జరగనుంది. దీనికి గాను మీ సూచనల ను స్వీకరించాలని నేను కుతూహలం తో ఉన్నాను. మీరు మీ ఆలోచనల ను Namo App, MyGov లలో వ్రాయండి, లేదంటే 1800-11-7800 నంబరు కు డయల్ చేసి మీ సందేశాన్ని రికార్డు చేయండంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1883020)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam