ప్రధాన మంత్రి కార్యాలయం

‘నాగ్  పుర్  మెట్రో ఫేజ్-2’ కు శంకు స్థాపన చేసిన ప్రధాన మంత్రి;‘నాగ్  పుర్  మెట్రో ఫేజ్-1’ ని దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు


ఆయన ఫ్రీడమ్   పార్క్   మెట్రో స్టేశన్ నుండి పార్క్  ఖాప్  రీ మెట్రో స్టేశన్ వరకు మెట్రో రైలు లో ప్రయాణించారు

Posted On: 11 DEC 2022 11:46AM by PIB Hyderabad

‘నాగ్ పుర్ మెట్రో ఒకటో దశ’ ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. దీనితో పాటు గా ఖాప్ రీ మెట్రో స్టేశన్ లో ‘నాగ్ పుర్ మెట్రో రెండో దశ’ కు శంకుస్థాపన కూడా చేశారు. ప్రధాన మంత్రి ఖాప్ రీ నుండి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు, ఇంకా ప్రజాపతి నగర్ నుండి లోక్ మాన్య నగర్ వరకు మొదటి సారి గా రాక పోకల ను జరిపిన రెండు మెట్రో రైళ్ళ కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. నాగ్ పుర్ మెట్రో లో భాగం గా ఒకటో దశ ను 8650 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. ఇక రెండో దశ ను 6700 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేశన్ నుండి నాగ్ పుర్ మెట్రో లో ప్రయాణించి, ఖాప్ రీ మెట్రో స్టేశను కు చేరుకొన్నారు. ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేశన్ లో మెట్రో రైలు ను ప్రయాణించడానికి పూర్వం ప్రధాన మంత్రి నాగ్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ‘సప్ నోం సే బెహ్ తర్’ ప్రదర్శన ను కూడా ఆయన చూశారు. ప్రధాన మంత్రి ఎఎఫ్ సి గేటు దగ్గర తన కోసం ఒక ఇ-టికెటు ను కొనుగోలు చేశారు. విద్యార్థుల తో, పౌరుల తో మరియు అధికారుల తో కలసి రైలు లో ఆయన ప్రయాణించారు. యాత్ర మధ్య లో వారి తో మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నాగ్ పుర్ మెట్రో యొక్క ఒకటో దశ ప్రారంభం సందర్భం లో నాగ్ పుర్ ప్రజల కు నేను అభినందనల ను తెలియజేయదలచాను. రెండు మెట్రో రైళ్ళ కు నేను పచ్చజెండా ను చూపెట్టడం తో పాటు మెట్రో లో ప్రయాణించాను కూడా. ఈ మెట్రో రైలు హాయి గాను, అనుకూలం గాను ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

‘‘నాగ్ పుర్ మెట్రో లో ప్రయాణించినప్పుడు, ప్రధాన మంత్రి విద్యార్థుల తో, స్టార్ట్-అప్ రంగానికి చెందిన వారితో మరియు జీవనం లో ఇతర రంగాల కు చెందిన పౌరుల తో మాట్లాడారు.’’ అని తెలిపింది.

 

 

ప్రధాన మంత్రి మెట్రో రైలు లో ఖాప్ రీ మెట్రో స్టేశన్ కు చేరుకొన్నప్పుడు ఆయన వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, మహారాష్ట్ర గవర్నరు శ్రీ భగత్ సింహ్ కోశ్యారీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ లతో పాటు రహదారి రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ కూడా ఉన్నారు.

 

 

 

పూర్వరంగం

 

పట్టణ ప్రాంతాల కు సంబంధించిన రాకపోకల క్రాంతి ని తీసుకు వచ్చేటటువంటి ముందడుగు గా అన్నట్టు, ప్రధాన మంత్రి ‘నాగ్ పుర్ మెట్రో ఫేజ్-1’ ని దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా ఖాప్ రీ మెట్రో స్టేశను లో రెండు మెట్రో రైళ్ళ కు ఆకుపచ్చ జెండా ను చూపించి వాటిని బయలుదేరదీశారు. ఆ రెండు రైళ్ల లో ఒకటి ఆరెంజ్ లైన్ లో ఖాప్ రీ నుండి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు, ఇంకొకటి ఆక్వా లైన్ లో ప్రజాపతి నగర్ నుండి లోక్ మాన్య నగర్ వరకు రాకపోక లను జరుపుతాయి. నాగ్ పుర్ మెట్రో లో భాగం అయిన ఒకటో దశ ను మొత్తం 8,650 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి చేయడమైంది. ప్రధాన మంత్రి నాగ్ పుర్ మెట్రో యొక్క రెండో దశ కు శంకుస్థాపన ను కూడా చేశారు. రెండో దశ ను 6,700 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధిపరచడం జరుగుతుంది.

 

 

https://youtu.be/vr3Sz4TF9lk

 

*****

DS/TS

***



(Release ID: 1882699) Visitor Counter : 115