ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తయారీ ప్రపంచంలో భారత్‌ ప్రగతి కొనసాగుతోంది: ప్రధానమంత్రి


ఏప్రిల్ - అక్టోబర్ నెలల మధ్య ఫోన్ల ఎగుమతులు

నిరుడు ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు కావడంపై ప్రశంస

Posted On: 29 NOV 2022 6:08PM by PIB Hyderabad

   దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు రెట్టింపు కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏప్రిల్‌ - అక్టోబర్‌ మధ్య 7 నెలల్లో 5 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించడాన్ని కొనియాడారు. గత ఏడాది ఇదే వ్యవధిలో భారత్ నుంచి మొబైల్‌ ఎగుమతుల విలువ 2.2 బిలియన్‌ డాలర్లు కావడం ఈ సందర్భంగా గమనార్హం.

ఈ అంశంపై కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ చేసిన ట్వీట్‌పై ప్ర‌ధానమంత్రి స్పందిస్తూ-

“తయారీ ప్రపంచంలో భారతదేశం తన పురోగమనాన్ని కొనసాగిస్తోంది” అని పేర్కొన్నారు.

*****

DS


(Release ID: 1879875) Visitor Counter : 166