ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 NOV 2022 8:58AM by PIB Hyderabad

   రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన అనిర్వచనీయ త్యాగం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“రాణి లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె ధైర్యసాహసాలు దేశం కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం. వలస పాలనపై ఆమె మొక్కవోని పోరాటం మనకెంతో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా గత సంవత్సరం ఇదేరోజున నేను  ఝాన్సీని సందర్శించిన జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1877397) आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam