ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలుగు సూపర్ స్టార్ కృష్ణ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2022 1:53PM by PIB Hyderabad

తెలుగు సూపర్ స్టార్ కృష్ణ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. కృష్ణ గారి మరణం సినిమా జగతి కి మరియు వినోద ప్రపంచాని కి ఒక పెద్ద లోటు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కృష్ణ గారు తన వైవిధ్యపూర్ణమైనటువంటి నటన తోను, ఉత్సాహభరితమైనటువంటి వ్యక్తిత్వం తోను ప్రజల హృదయాల ను గెలుచుకొన్న ఒక ప్రసిద్ధుడైన సూపర్ స్టార్. ఆయన మరణం సినిమా జగతి కి మరియు వినోద ప్రపంచాని కి భారీ లోటు. ఈ వేళ లో @urstrulyMahesh కు మరియు ఆయన యావత్తు కుటుంబాని కి కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.


***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1876089) సందర్శకుల సూచీ సంఖ్య : : 210