ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 11వ తేదీమరియు 12 తేదీల లో కర్నాటక, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలను సందర్శించనున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైనప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా చేయనున్నారు
బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క రెండో టర్మినల్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి; చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కూడా ఆయన పచ్చ జెండా ను చూపెట్టిఆ రైలు ను ప్రారంభిస్తారు
బెంగుళూరులోనాదప్రభు కెంపెగౌడ యొక్క 108 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
విశాఖపట్నంలోఒఎన్ జిసి కి చెందిన యు ఫీల్డ్ ఆన్ శోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టు ను దేశప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి; జిఎఐఎల్ కు చెందిన శ్రీకాకుళం అంగుల్నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు
విశాఖపట్నం లో ఆరు లేన్ ల గ్రీన్ ఫీల్డ్ రాయ్‌పుర్-విశాఖపట్నం ఇకనామిక్ కారిడర్ కు చెందిన ఎపి సెక్షను కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి; విశాఖపట్నం రైల్ వే స్టేశన్ పునరాభివృద్ధి పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు
ప్రధానమంత్రి రామగుండం లో ఎరువుల కర్మాగారాన్ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు; దీనికి 2016 లో శంకుస్థాపన చేసింది కూడా ప్రధాన మంత్రే
డిండీగుల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్ టిట్యూట్ యొక్క 36వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించిప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
09 NOV 2022 4:28PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 నవంబర్ 11వ తేదీ న మరియు 12వ తేదీ న కర్నాటక, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లను సందర్శించనున్నారు. నవంబర్ 11వ తేదీ న ఉదయం 9 గంటల 45 నిమిషాల కు బెంగళూరు లో గల విధాన సౌధ లో గొప్ప భక్తుడు, కవి శ్రీ కనక దాసు విగ్రహాని కి మరియు మహర్షి వాల్మీకి విగ్రహాని కి ప్రధాన మంత్రి పుష్పాంజలి సమర్పిస్తారు. ఉదయం పూట సుమారు 10 గంటల 20 నిమిషాల సమయం లో, బెంగళూరు లోని కె.ఎస్.ఆర్. రైల్ వే స్టేశన్ వద్ద వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కు ప్రధాన మంత్రి ఆకుపచ్చటి జెండా ను చూపెట్టి ఆ రైళ్ల ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఉదయం ఇంచుమించు 11 గంటల 30 నిమిషాల వేళ కు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రెండో టర్మినల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల కు, 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బెంగళూరు లో జరిగే బహిరంగ సభ లో ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, తమిళ నాడు లోని డిండీగుల్ లో జరిగే గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్ టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాన మంత్రి హాజరు అవుతారు.
నవంబర్ 12వ తేదీ న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు, ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో పలు ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల కు, తెలంగాణ లోని రామగుండం లో ఆర్.ఎఫ్.సి.ఎల్. ప్లాంటు ను ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వేళ రామగుండం లో పలు ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కర్ణాటక లోని బెంగళూరు లో ప్రధాన మంత్రి
బెంగళూరు లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టర్మినల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఏడాదికి 2.5 కోట్లు గా ఉన్న విమానాశ్రయ ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం, ఈ టర్మినల్ అందుబాటు లోకి వచ్చాక రెట్టింపై, సంవత్సరానికి 5-6 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణ సామర్ధ్యానికి చేరనుంది.
ఉద్యానవన నగరమైన బెంగళూరు కు ఒక బహుమతి గా, ప్రయాణీకులకు ఒక ఉద్యానవనం లో నడిచిన అనుభూతి కలిగేలా ఈ రెండో టర్మినల్ ను రూపొందించడం జరిగింది.
ప్రయాణికులు పది వేలకు పైగా చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోట లు, ఆరుబయలు ఉద్యానవనాల గుండా ప్రయాణిస్తారు. ప్రాంగణం అంతా నూరు శాతం పునరుత్పాదక ఇంధన వినియోగం తో ఈ విమానాశ్రయం ఇప్పటికే స్థిరత్వం లో ఒక గుర్తింపు పొందింది.
ఈ రెండవ టర్మినల్ రూపకల్పన స్థిరత్వ సూత్రాల తో సృష్టించబడింది. స్థిరత్వం కోసం చేపట్టిన చర్యల ఆధారంగా, ఈ రెండో టర్మినల్, కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందే అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (జిబిసి) ద్వారా ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం రేటింగ్ ను పొందిన ప్రపంచం లోని అతి పెద్ద టర్మినల్ గా నిలచింది. రెండో టర్మినల్ కోసం ఏర్పాటుచేసిన అన్ని కళాఖండాల ను ‘నవరస’ ఇతివృత్తం ఏకం చేస్తుంది. ఇక్కడ అమర్చిన కళాఖండాలు కర్నాటక వారసత్వం, సంస్కృతి లతో పాటుగా సువిశాల భారతీయ తత్వాన్ని కూడాను ప్రతిబింబిస్తాయి.
మొత్తం మీద, రెండో టర్మినల్ రూపకల్పన, నిర్మాణం నాలుగు మార్గదర్శక సూత్రాల ద్వారా ప్రభావితమైంది : పచ్చని తోట లో టర్మినల్, స్థిరత్వం, సాంకేతికత, కళ మరియు సంస్కృతి. రెండోవ టర్మినల్ ఆధునికమైంది అయినప్పటికీ, ఈ అంశాల వల్ల ఈ టర్మినల్ ప్రకృతి తో మమేకమై, ప్రయాణికులందరికీ ‘ఒక చిరస్మరణీయమైన గమ్యం’ తాలూకు అనుభవాన్ని అందిస్తుంది.
చెన్నై- హోసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ను బెంగళూరు లోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కె.ఎస్.ఆర్) రైల్ వే స్టేశన్ లో ప్రధాన మంత్రి జెండా ను ఊపి, ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, దక్షిణ భారతదేశం లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, టెక్ & స్టార్టప్ హబ్ బెంగళూరు, ప్రసిద్ధ పర్యాటక నగరం మైసూర్ నగరాల మధ్య సంధానాన్ని మెరుగుపరుస్తుంది.
బెంగుళూరు కె.ఎస్.ఆర్. రైల్ వే స్టేశన్ నుండి భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు ను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. కర్నాటక నుండి కాశీకి యాత్రికుల ను పంపేందుకు, కర్నాటక ప్రభుత్వం మరియు రైల్ వే మంత్రిత్వ శాఖ లు సంయుక్తంగా కృషి చేశాయి. భారత్ గౌరవ్ పథకం లో భాగం గా ఈ రైలు ను ప్రారంభిస్తున్న మొదటి రాష్ట్రం గా కర్నాటక నిలచింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను సందర్శించడానికి, యాత్రీకులకు సౌకర్యవంతమైన బస, మార్గదర్శకత్వం అందించడం జరుగుతుంది.
శ్రీ నాదప్రభు కెంపెగౌడ 108 మీటర్ల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. బెంగళూరు నగర అభివృద్ధి కోసం నగర స్థాపకుడైన నాదప్రభు కెంపెగౌడ చేసిన కృషి కి గుర్తుగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడమైంది. ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ తో పేరు తెచ్చుకొన్న రామ్ వి సుతార్ ఈ విగ్రహాని కి రూపకల్పన చేశారు. ఈ విగ్రహం తయారీ కి 98 టన్నుల కంచు ను మరియు 120 టన్నుల ఉక్కు ను వినియోగించడమైంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి 10,500 కోట్ల రూపాయల కు పైగా విలువచేసే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు గా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన ఆరు లేన్ ల తో కూడిన గ్రీన్ ఫీల్డ్ రాయ్ పుర్-విశాఖపట్నం ఇకనామిక్ కారిడర్ కు సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ సెక్షను కు శంకుస్థాపన చేస్తారు. దీనిని 3750 కోట్ల రూపాయల కు పైబడిన వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఈ ఇకనామిక్ కారిడర్ ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా లో ఇండస్ట్రియల్ నోడ్స్ మొదలుకొని విశాఖపట్నం పోర్టు, ఇంకా చెన్నై-కోల్ కాతా జాతీయ రహదారి మధ్య వేగవంతమైనటువంటి సంధానాన్ని ప్రసాదించనుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాల లో ఆదివాసీ మరియు వెనుకబడిన ప్రాంతాల లో కనెక్టివిటీ లో మెరుగుదలను సైతం తీసుకువస్తుంది. ప్రధాన మంత్రి విశాఖపట్నం లో కాన్వెంట్ జంక్షన్ నుండి శీలా నగర్ జంక్షన్ వరకు ఒక ప్రత్యేక పోర్ట్ రోడ్డు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇది స్థానికం గా రాక పోక లను వేరు చేసి విశాఖపట్నం నగరం లో వాహనాల రద్దీ ని తగ్గించగలుగుతుంది. ఆయన 200 కోట్ల రూపాయల వ్యయం తో శ్రీకాకుళం-గజపతి కారిడర్ లో భాగం అయినటువంటి 200 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మాణం జరిగిన ఎన్ హెచ్-326ఎ కు చెందిన నరసనన్నపేట నుండి పాతపట్నం సెక్షను ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతం లో మెరుగైన సంధానాన్ని అందించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఒఎన్‌జిసి కి చెందిన యు-ఫీల్డ్ ఆన్ శోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనిని 2900 కోట్ల రూపాయల కు పైబడిన వ్యయం తో అభివృద్ధి పరచడమైంది. ఇది ఈ ప్రాజెక్టు లో ఇప్పటి వరకు చేపట్టినటువంటి అత్యంత లోతయిన గ్యాస్ అన్వేషణ అని చెప్పాలి. దీనికి రోజు కు రమారమి 3 మిలియన్ మీట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎమ్ఎమ్ఎస్ సి ఎమ్ డి) మేర గ్యాసు ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. ప్రధాన మంత్రి 6.65 ఎమ్ఎమ్ఎస్ సి ఎమ్ డి సామర్థ్యం కలిగివుండే జిఎఐఎల్ యొక్క శ్రీకాకుళం- అంగుల్ సహజవాయు గొట్టపు మార్గం ప్రాజెక్టు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. 745 కిలోమీటర్ ల పొడవైన ఈ గొట్టపు మార్గం యొక్క నిర్మాణానికి 2650 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించడం జరుగుతుంది. నేచురల్ గ్యాస్ గ్రిడ్ (ఎన్ జిడి)లో ఒక భాగం అయినందువల్ల, ఈ గొట్టపు మార్గం ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశా లో వివిధ జిల్లాల లో గృహాల కు, పరిశ్రమల కు, వాణిజ్య సంస్థల కు, మరియు ఆటోమొబైల్ రంగాలలో సహజవాయువు సరఫరా కోసం కీలకం అయినటువంటి మౌలిక సదుపాయాల ను సమకూర్చుతుంది. ఈ పైప్‌లైను ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మరియు విజయనగరం జిల్లా లో సిటీ గ్యాస్ పంపిణీ నెట్ వర్కు కు సహజవాయువు ను సరఫరా చేయనుంది.
సుమారు 450 కోట్ల రూపాయల వ్యయం తో రూపుదిద్దుకొనే విశాఖపట్నం రైల్ వే స్టేశన్ యొక్క పునరభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 450 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. పునర్ అభివృద్ధిపరచిన స్టేశన్ రోజు కు 75 వేల మంది ప్రయాణికుల కు సేవల ను అందించగలుగుతుంది. అంతేకాక ఆధునిక సౌకర్యాల ను సమకూర్చి, ప్రయాణికుల యాత్రానుభూతి ని మెరుగుపరచగలుగుతుంది కూడాను.
విశాఖపట్నం ఫిశింగ్ హార్బర్ యొక్క ఆధునికీకరణ మరియు ఉన్నతీకరణ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం 150 కోట్ల రూపాయలు గా ఉంది. ఆధునికీకరణ మరియు ఉన్నతీకరణ ల తరువాత ఈ ఫిశింగ్ హార్బర్ యొక్క హ్యాండ్ లింగ్ సామర్థ్యం రోజు కు 150 టన్ను ల నుండి రెట్టింపు అయ్యి, రోజు కు ఇంచుమించు 300 టన్నుల కు చేరుకోగలదు. ఇది సురక్షితమైనటువంటి ల్యాండింగ్ మరియు బర్థింగ్ సదుపాయాన్ని సమకూర్చనుంది. అంతేకాకుండా ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు ఈ జెటీ లో టర్న్ అరౌండ్ కాలాన్ని, వృథా ను తగ్గించగలుగుతాయి. అలాగే దీనివల్ల మంచి ధర ను రాబట్టుకోవడం లో తోడ్పాటు లభించనుంది.
తెలంగాణా లోని రామగుండం లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి 9500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన పలు ప్రాజెక్టుల కు రామగుండం లో శంకుస్థాపన చేయడం తో పాటు గా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన రామగుండం ఎరువుల ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. రామగుండం ప్రాజెక్టు కు శంకుస్థాపన సైతం 2016 వ సంవత్సరం లో ఆగస్టు 7వ తేదీ న ప్రధాన మంత్రి చేతుల మీదు గా జరిగింది. ఎరువుల ప్లాంటు ను పునరుద్ధరించడం వెనుక ప్రేరణ నిజానికి యూరియా యొక్క ఉత్పాదన లో దేశం స్వయంసమృద్ధి ని సాధించుకోవాలన్న ప్రధాన మంత్రి యొక్క దార్శనికత నుండి లభించింది. రామగుండం ప్లాంటు ఏటా 12.7 ఎల్ ఎమ్ టి మేరకు స్వదేశీ వేప పూత పూసిన యూరియా ను అందించనుంది.
ఈ ప్రాజెక్టు ను రామగుండం ఫర్టిలైజర్స్ ఎండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ఆధ్వర్యం లో ఏర్పాటు చేయడమైంది. ఇది నేశనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజీనియర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్), ఫర్టిలైజర్స్ కార్ పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సిఐఎల్) ల కు చెందిన ఒక సంయుక్త భాగస్వామ్య కంపెనీ గా ఉంది. ఆర్‌ఎఫ్‌సిఎల్ కు ఈ కొత్త అమోనియా యూరియా ప్లాంటు ను స్థాపించే బాధ్యత ను అప్పగించడమైంది. దీనిలో 6,300 కోట్ల రూపాయలకు పైచిలుకు పెట్టుబడి ని పెట్టడం జరిగింది. ఈ ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంటు కు గ్యాస్ జగదీశ్ పుర్- ఫూల్‌పుర్- హల్దియా గొట్టపు మార్గం ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది.
ఈ ప్లాంటు తెలంగాణా రాష్ట్రం తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, చత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్ర ల రైతుల కు యూరియా ఎరువు తగినంత గాను మరియు సకాలం లోను సరఫరా అయ్యేందుకు పూచీ పడనుంది. ఈ ప్లాంటు కేవలం ఎరువుల అందుబాటు ను మెరుగు పరచడమే కాకుండా రహదారి మార్గాలు, రైలు మార్గాలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదపాయాల అభివృద్ధి సహా ఆ ప్రాంతం లో సమగ్ర ఆర్థిక అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని అందించనుంది. దీనికి తోడు ఇక్కడ ఫ్యాక్టరీ లో సరకుల సంబంధి విభిన్న సరఫరాల పరం గా ఎమ్ఎస్‌ఎమ్ఇ విక్రేతల వృద్ధి వల్ల ఈ ప్రాంతానికి లాభం కలుగుతుంది. ఆర్‌ఎఫ్‌సిఎల్ యొక్క ‘భారత్ యూరియా’ దిగుమతులను తగ్గించడం ఒక్కటే కాకుండా ఎరువులు మరియు విస్తృత సేవల ను సకాలం లో సరఫరా చేసే మాధ్యం తో స్థానికి రైతుల కు ప్రోత్సాహాన్ని అందించి ఆర్ధిక వ్యవస్థ కు అద్భుతమైనటువంటి అండ గా నిలుస్తుంది.
ప్రధాన మంత్రి భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్ లైను ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనిని దాదాపు గా 1000 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడమైంది. దీనితో పాటు గా 2200 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగినటువంటి వివిధ రహదారి పథకాల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ఎన్‌హెచ్ 765 డిజి కి చెందిన మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షను, ఎన్‌హెచ్ 161 బిబి కి చెందిన బోధన్-బాసర-భైంసా సెక్షను, ఎన్‌హెచ్ 353సి కి చెందిన సిరోంచా నుండి మహాదేవపుర్ సెక్షను లు ఉన్నాయి.
తమిళ నాడు లోని గాంధీగ్రామ్ లో ప్రధానమంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్ టిట్యూట్ యొక్క 36వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో 2018-19 మరియు 2019-20 బ్యాచ్ లకు చెందిన 2300 మందికి పైగా విద్యార్థులు పట్టాల ను అందుకొంటారు.
***
(Release ID: 1874845)
Visitor Counter : 218
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam