ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 2022 లో స్థూల జీఎస్టీ రెవెన్యూ రూ.1,51,718 కోట్ల సేకరణ


ఏప్రిల్ 2022లో వచ్చిన సేకరణ తర్వాత రెండవ అత్యధిక సేకరణ

వరుసగా ఎనిమిది నెలల పాటు నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ, ఈ పన్ను విధానం
ప్రారంభించిన తర్వాత 2వ సారి రూ.1.5 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ .

సెప్టెంబర్ 2022 లో 8.3 కోట్ల ఇ-వే బిల్లులు వచ్చాయి, ఇది ఆగస్టు 2022లో జారీ ఆయిన 7.7 కోట్ల ఇ-వే
బిల్లుల కంటే చాలా ఎక్కువ.

Posted On: 01 NOV 2022 12:12PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 2022 అక్టోబర్ నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ  ఆదాయం రూ. 1,51,718 కోట్లు, ఇందులో సిజీఎస్టీ రూ.26,039 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 33,396 కోట్లు, ఐజీఎస్టీ రూ.81,778 కోట్లు (వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ. 37,297 కోట్లతో సహా), సుంకం కింది రూ.10,505 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.825 కోట్లతో సహా), ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధికం.

ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సిజీఎస్టీ కి రూ. 37,626 కోట్లు,  ఎస్జీఎస్టీకి రూ. 32,883 కోట్లను రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా సెటిల్ చేసింది. అదనంగా, కేంద్రం, రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో తాత్కాలిక ప్రాతిపదికన రూ. 22,000 కోట్లను కూడా కేంద్రం పరిష్కరించింది. అక్టోబర్ 2022 నెలలో సాధారణ,  తాత్కాలిక సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్రం,రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజీఎస్టీ కి రూ.74,665 కోట్లు,  ఎస్జీఎస్టీకి రూ.77,279 కోట్లు.

2022 అక్టోబర్ ఆదాయం రెండవ అత్యధిక నెలవారీ వసూళ్లు. 2022 ఏప్రిల్ వసూళ్ల తర్వాత ఇది రెండవసారి స్థూల  జీఎస్టీ  సేకరణ రూ. 1.50 లక్షల కోట్ల దాటడం. 2022  ఏప్రిల్ తర్వాత మాత్రమే అక్టోబర్‌లో దేశీయ లావాదేవీల నుండి రెండవ అత్యధిక వసూళ్లు జరిగాయి, . ఇది తొమ్మిదవ నెల. వరుసగా ఎనిమిది నెలల పాటు, నెలవారీ జీఎస్టీ ఆదాయాలు రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 2022 నెలలో, 8.3 కోట్ల ఇ-వే బిల్లులు జారీ అయ్యాయి. ఇది ఆగస్టు 2022లో జారీ అయిన 7.7 కోట్ల ఇ-వే బిల్లుల కంటే గణనీయంగా ఎక్కువ.

దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. అక్టోబరు 2021తో పోలిస్తే 2022 అక్టోబర్ నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించబడిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను చూపుతుంది.

.

 

అక్టోబర్ 2022లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రాబడి వృద్ధి

రాష్ట్రం 

అక్టోబర్-21

అక్టోబర్ -22

వృద్ధి 

జమ్మూ కాశ్మీర్ 

648

425

-34%

హిమాచల్ ప్రదేశ్ 

689

784

14%

పంజాబ్ 

1,595

1,760

10%

చండీగఢ్ 

158

203

28%

ఉత్తరాఖండ్ 

1,259

1,613

28%

హర్యానా 

5,606

7,662

37%

ఢిల్లీ 

4,045

4,670

15%

రాజస్థాన్ 

3,423

3,761

10%

ఉత్తర ప్రదేశ్ 

6,775

7,839

16%

బీహార్ 

1,351

1,344

-1%

సిక్కిం 

257

265

3%

అరుణాచల్ ప్రదేశ్ 

47

65

39%

నాగాలాండ్ 

38

43

13%

మానిటర్\

64

50

-23%

మిజోరామ్ 

32

24

-23%

త్రిపుర 

67

76

14%

మేఘాలయ 

140

164

17%

అస్సాం 

1,425

1,244

-13%

పశ్చిమ బెంగాల్ 

4,259

5,367

26%

ఝార్ఖండ్ 

2,370

2,500

5%

ఒడిశా 

3,593

3,769

5%

ఛత్రిస్గర్ 

2,392

2,328

-3%

మధ్యప్రదేశ్ 

2,666

2,920

10%

గుజరాత్ 

8,497

9,469

11%

దమన్ డయ్యు 

0

0

20%

దాద్రా నగర్ హవేలీ 

269

279

4%

మహారాష్ట్ర 

19,355

23,037

19%

కర్ణాటక 

8,259

10,996

33%

గోవా 

317

420

32%

లక్షద్వీప్ 

2

2

14%

కేరళ 

1,932

2,485

29%

తమిళనాడు 

7,642

9,540

25%

పుదుచ్చేరి 

152

204

34%

అండమాన్ నికోబర్ దీవులు 

26

23

-10%

తెలంగాణ 

3,854

4,284

11%

ఆంధ్రప్రదేశ్ 

2,879

3,579

24%

లడఖ్ 

19

33

74%

ఇతర ప్రాంతం 

137

227

66%

కేంద్ర పరిథి 

189

140

-26%

మొత్తం 

96,430

1,13,596

18%

 

 

****


(Release ID: 1872915) Visitor Counter : 246