ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐసీసీ టి20 మ్యాచ్‌లో విజయంపై భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాని అభినందన


అకుంఠిత దీక్షతో ఆడిన విరాట్‌ కోహ్లీకి ప్రశంసలు

प्रविष्टि तिथि: 23 OCT 2022 11:00PM by PIB Hyderabad

   సీసీ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుపై విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“భారత జట్టు పట్టుదలతో పోరాడి విజయం సాధించింది! ఇవాళ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడంపై అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న @imVkohliకి ప్రత్యేక ప్రశంసలు. అకుంఠిత దీక్షతో తిరుగులేని రీతిలో జట్టును విజయం వైపు నడిపించడం అద్భుతం. ఇకపై ఆడబోయే మ్యాచ్‌లలోనూ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1870715) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam