ప్రధాన మంత్రి కార్యాలయం

2022 సెప్టెంబర్, 25వ తేదీన ప్రసారమైన 'మన్-కీ-బాత్' ఆధారంగా నమో-యాప్ క్విజ్‌ లో పాల్గొనవలసిందిగా ప్రజలను కోరిన - ప్రధానమంత్రి

Posted On: 28 SEP 2022 8:53AM by PIB Hyderabad

2022 సెప్టెంబర్, 25వ తేదీన ప్రసారమైన 'మన్-కీ-బాత్' ఆధారంగా నమో యాప్‌ క్విజ్‌ లో పాల్గొనవలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.   ఈ నెల మన్-కీ-బాత్ కార్యక్రమంలో వన్యప్రాణుల నుండి పర్యావరణం వరకు అదేవిధంగా సంస్కృతి నుండి భారతదేశం యొక్క గొప్ప చరిత్ర వరకు అంశాలను ప్రస్తావించినట్లు కూడా శ్రీ మోదీ చెప్పారు.

ఇదే విషయాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, "ఇటీవలి #మన్-కీ-బాత్ కార్యక్రమంలోవన్యప్రాణుల నుండి పర్యావరణం వరకు అదేవిధంగా సంస్కృతి నుండి భారతదేశం యొక్క గొప్ప చరిత్ర వరకు వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. నమో యాప్ లో ఒక ఆసక్తికరమైన క్విజ్ ఉందిఇందులో మీరందరూ పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను." అని పేర్కొన్నారు. 

*****

DS/ST

 (Release ID: 1862866) Visitor Counter : 103