జల శక్తి మంత్రిత్వ శాఖ

దిల్లీలో భారత్- బంగ్లాదేశ్ మంత్రుల స్థాయి ఉమ్మడి నదుల కమిషన్ 38వ సమావేశం


కుషియారా నది మధ్యంతర నీటి భాగస్వామ్యానికి సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాన్ని ఖరారు చేసిన ఇరుపక్షాలు


త్రిపురలోని సబ్రూమ్ టౌన్ యొక్క తాగునీటి అవసరాలను తీర్చడానికి ఫెని నదిపై వాటర్ ఇన్‌టేక్ పాయింట్ డిజైన్ మరియు స్థానం యొక్క ముగింపును స్వాగతించిన ఇరు దేశాలు

Posted On: 26 AUG 2022 10:46AM by PIB Hyderabad

భారత్- బంగ్లాదేశ్‌ల ఉమ్మడి నదుల కమిషన్ 38వ సమావేశం 25 ఆగస్టు, 2022న దిల్లీలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి ఆ దేశ జలవనరుల రాష్ట్ర మంత్రి శ్రీ జాహీద్ ఫరూక్ నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్ ప్రతినిధి బృందంలో జలవనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ ఏకేఎం ఇనాముల్ హోక్ షమీమ్ కూడా ఉన్నారు. జేఆర్‌సీ ఫ్రేమ్‌వర్క్‌లోని సాంకేతిక పరస్పర చర్యలు ఈ మధ్య కాలంలో కొనసాగుతున్నప్పటికీ, పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సమావేశం నిర్వహించడం వలన ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ముందుగా 23 ఆగస్టు 2022 మంగళవారం జలవనరుల శాఖ కార్యదర్శి స్థాయి సమావేశం జరిగింది.

ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఉమ్మడి నదీజలాల భాగస్వామ్యం, వరద డేటాను పంచుకోవడం, నదీ కాలుష్యాన్ని పరిష్కరించడం, అవక్షేపణ నిర్వహణ, నదీతీర పరిరక్షణ పనులపై సంయుక్త అధ్యయనాలు నిర్వహించడం వంటి పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. కుషియారా నది మధ్యంతర నీటి భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ విషయంపై అక్టోబర్ 2019 భారతదేశం-బంగ్లాదేశ్ అవగాహన ఒప్పందం ప్రకారం త్రిపురలోని సబ్‌రూమ్ పట్టణం యొక్క తాగునీటి అవసరాలను తీర్చడానికి ఫెని నదిపై నీటి తీసుకోవడం కోసం ఇన్‌టేక పాయింట్ రూపకల్పన మరియు స్థానాన్ని ఖరారు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.


 

 

భారత్, బంగ్లాదేశ్‌కు సహాయం చేస్తున్న ముఖ్యమైన రంగాలలో ఒకటి, రియల్ టైం వరద డేటాను పంచుకోవడం. బంగ్లాదేశ్ ఊహించని వరదలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి భారతదేశం ఇటీవల వరద డేటా షేరింగ్ వ్యవధిని అక్టోబర్ 15 తర్వాత పొడిగించింది.

భారత్- బంగ్లాదేశ్‌ మొత్తం 54 నదులను పంచుకుంటున్నాయి., వీటిలో 7 నదులు ప్రాధాన్యతపై నీటి భాగస్వామ్య ఒప్పందాల ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ముందుగా గుర్తించబడ్డాయి. సమావేశంలో, డేటా మార్పిడి కోసం మరో 8 నదులను ఇందులో చేర్చడం ద్వారా కొనసాగుతున్న సహకారాన్ని విస్తృతం చేయడానికి అంగీకరించాయి. జేఆర్‌సీ యొక్క సాంకేతిక స్థాయి కమిటీలో ఈ విషయం మరింత చర్చించబడుతుంది.

భారతదేశం- బంగ్లాదేశ్ ఉమ్మడి నదుల కమిషన్ 1972 సంవత్సరంలో ఉమ్మడి/సరిహద్దు/సరిహద్దులు దాటిన నదులపై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ద్వైపాక్షిక యంత్రాంగంగా ఏర్పాటైంది.

*****

 



(Release ID: 1854792) Visitor Counter : 182