ప్రధాన మంత్రి కార్యాలయం
ఏనుగుల సంరక్షకుల కృషి ని ప్రపంచ ఏనుగు దినం నాడు ప్రశంసించిన ప్రధాన మంత్రి
గత 8 సంవత్సరాల లో ఏనుగు అభయారణ్యాల సంఖ్య లో వృద్ధి పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్నివ్యక్తం చేశారు
Posted On:
12 AUG 2022 11:03AM by PIB Hyderabad
ఏనుగుల ను సంరక్షించడం కోసం పాటుపడుతున్న వారి యొక్క కృషి ని ప్రపంచ ఏనుగు దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. గడచిన 8 సంవత్సరాల లో ఏనుగు అభయారణ్యాల సంఖ్య వృద్ధి చెందడం పట్ల కూడా ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి -
‘‘#WorldElephantDay సందర్బం లో, ఏనుగు సంతతి ని పరిరక్షించడం కోసం మన వచన బద్ధత ను పునరుద్ఘాటించుదాం. ఆసియా లో ఉన్న అన్ని ఏనుగుల లోకి దాదాపు గా 60 శాతం ఏనుగు లు భారతదేశం లోనే ఉన్నాయి అని తెలిస్తే మీరు సంతోషిస్తారు. గత 8 సంవత్సరాల లో ఏనుగు అభయారణ్యాల సంఖ్య వృద్ధి చెందింది. ఏనుగు ల సంరక్షణ లో నిమగ్నం అయిన వారందరిని కూడాను నేను అభినందిస్తున్నాను.’’
‘‘ఏనుగు ల జాతి ని సంరక్షించడం లో లభిస్తున్న సాఫల్యాల ను- మనిషి కి మరియు పశువుల కు మధ్య సాగుతున్న ఘర్షణల ను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి, పర్యావరణ పరమైన చైతన్యాన్ని పెంపొందింప చేయడం లో స్థానిక సముదాయాల ను వారి సాంప్రదాయిక జ్ఞానాన్ని జోడించడానికి భారతదేశం లో విస్తృతమైనటువంటి కృషి కొనసాగుతున్న పూర్వరంగం లో- గమనించవలసి ఉంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1851169)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam