ప్రధాన మంత్రి కార్యాలయం
బాలయోగి ఆడిటోరియమ్ లో జరిగిన ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడువీడ్కోలు కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
‘‘ఎల్లప్పుడూ చురుకుగా, పనిలో తీరిక లేకుండా ఉండేటటువంటి వెంకయ్య గారి గుణం రాబోయేదీర్ఘ కాలం పాటు సార్వజనిక జీవనం తో ఆయన ను జోడించి ఉంచుతుంది’’
‘‘పార్లమెంటు సభ్యులు అందరి మీద ఆయన పెట్టుకొన్న అపేక్షల ను నెరవేర్చడానికిమనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుండాలి’’
‘‘‘భాషిణి’ వంటి కార్యక్రమాలు మరియు పార్లమెంటు లోజరిగే చర్చల లో చోటు చేసుకొనే కొత్త పదాల వార్షిక సంచయం వెంకయ్య గారి కి మాతృభాషఅంటే ఉన్న ప్రేమ తాలూకు వారసత్వాన్ని ముందుకు తీసుకు పోతాయి’’
Posted On:
08 AUG 2022 8:49PM by PIB Hyderabad
దిల్లీ లోని జిఎంసి బాలయోగి ఆడిటోరియమ్ లో ఈ రోజు న జరిగిన ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లోప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఎల్లవేళ ల క్రియాశీలం గా ఉంటూ, ఏదో ఒక పని లో నిమగ్నం అయ్యే శ్రీ వెంకయ్య నాయుడు లోని గుణాన్ని గురించి చెప్తూ ఇది ఎటువంటి గుణం అంటే అది ఆయన ను సార్వజనిక జీవనం లోని కార్యకలాపాల తో సదా జోడించి ఉంచుతుంది అన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు తో తన కు దీర్ఘకాలం గా ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. వాజ్ పేయీ ప్రభుత్వం లో మంత్రి గా శ్రీ వెంకయ్య నాయుడు ను తీసుకొనే సందర్భం లో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పట్ల ఆయన మక్కువ ను చూపడాన్ని గుర్తకు తెచ్చుకొన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గ్రామీణాభివృద్ధి తోపాటు పట్టణాభివృద్ధి శాఖ ను కూడా పర్యవేక్షించారని ప్రధాన మంత్రి తెలిపారు. ఉపరాష్ట్రపతి కి రాజ్య సభ చైర్ మన్ గా, ఉప రాష్ట్రపతి గా వ్యవహరించే ప్రథమ రాజ్య సభ సభ్యుడు అయ్యే దుర్లభ గౌరవం దక్కిన సంగతి ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆయన కు గల ఈ అనుభవాని కి తోడు పార్లమెంటరీ కార్యకలాపాల మంత్రి గా పని చేసినటువంటి అనుభవం జతపడి, ఆయన కు విస్తృత నియంత్రణ ను మరియు సహజత్వంతో సభ ను నడపడం లో తోడ్పడ్డాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
సభ యొక్క, సభ్యుల యొక్క మరియు సంఘాల యొక్క సామర్థ్యాల ను పటిష్టపరచడం కోసం, పెంపొందింప చేయడం కోసం శ్రీ వెంకయ్య నాయుడు చేసిన ప్రయాసల ను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. పార్లమెంటు సభ్యులు అందరి మీద ఆయన పెట్టుకొన్న ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం మనం అందరం సదా ప్రయత్నాలు చేయాలి అనేది ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు.
సమయ పాలన పట్ల శ్రీ వెంకయ్య నాయుడు కనబరచినటువంటి క్రమశిక్షణ ను ప్రధాన మంత్రి పొగడుతూ, కరోనా కాలం లో ఆంక్షలు అమలులో ఉన్నప్పుడు సైతం ఉప రాష్ట్రపతి ఏ విధం గా ‘టెలి -యాత్రల’ మాధ్యమం ద్వారా పలువురి తో ఫోన్ లో సంప్రదింపులు జరిపిందీ, కష్ట కాలాల్లో అనేక మందికి సాంత్వన ను మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిందీ గుర్తు కు తెచ్చారు. అదే మాదిరి గా మహమ్మారి కాలం లో ఎంపి లు అందరి తో ఆయన సంభాషించే వారన్నారు. బిహార్ ను సందర్శించినప్పుడు శ్రీ వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అకస్మాత్తు గా ల్యాండింగ్ చేయవలసి రాగా ఒక రైతు ఆయన కు సాయం చేసిన ఘటన ను కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ రైతు తోను, ఆ రైతు కుటుంబ సభ్యుల తోను శ్రీ వెంకయ్య నాయుడు ఈనాటి వరకు కూడాను సంప్రదింపులు జరపడాన్ని కొనసాగిస్తూ వస్తున్నారని ప్రధాన మంత్రి చెప్పారు. భవిష్యత్తు లో చాలా కాలం పాటు అదే సమర్పణ భావం తోను, జ్ఞానం తోను సార్వజనిక జీవనం లో ప్రజల కు శ్రీ వెంకయ్య నాయుడు మార్గదర్శనం చేయగలరన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
మాతృ భాష అంటే శ్రీ వెంకయ్య నాయుడు కు ఉన్న గౌరవాన్ని ప్రధాన మంత్రి గుర్తిస్తూ, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంకా కొత్త గా ఉనికి లోకి వస్తూ ఉన్నటువంటి ఇతర సాంకేతిక పరిజ్ఞానం ల తాలూకు శక్తి ని పరిపూర్ణం గా పౌరులకు సేవల ను ఉత్పాదనల ను అభి వృద్ధి పరచే దిశ లో భాషల కోసం ఒక జాతీయ సార్వజనిక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన ‘భాషిణి’ ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీని పట్ల శ్రద్ధ తీసుకోవలసింది గా ఉభయ సభ ల సభ్యుల కు ఆయన సూచన చేశారు. మాతృ భాష లో చర్చ ల సందర్భం గా వెలుగు లోకి వచ్చేటటువంటి మంచి కొత్త పదాల ను ఒక చోటు కు తీసుకు రావడం, దేశ భాషల ను సమృద్ధం చేసేందుకు వాటిని జోడించడం చేయాలి అంటూ స్పీకర్ కు మరియు రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. మంచి మాటల సంకలనాన్ని విడుదల చేసే వార్షిక సంప్రదాయాన్ని మొదలు పెట్టి మనం మాతృభాష పట్ల వెంకయ్య నాయుడు గారి కి ఉన్న మమకారం తాలూకు వారసత్వాన్ని ముందుకు తీసుకు పోదాం అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1850570)
Visitor Counter : 100
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam