ప్రధాన మంత్రి కార్యాలయం

ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు కు రాజ్య సభ లో వీడ్కోలు పలికినప్రధాన మంత్రి


‘‘ఈ సంవత్సరం లో ఆగస్టు 15వ తేదీ కి ఎప్పుడైతే మనం చేరుకొంటామో,అది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జన్మించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకరు మరియు ప్రధాన మంత్రి.. వీరితోజరుపుకొనేటటువంటి ఒక స్వాతంత్య్ర దినం కాగలదు.  అంతేకాక, వారి లో ప్రతి ఒక్కరు అతి సీదా సాదాపూర్వ రంగాల కు చెందిన వారే’’

‘‘మా ఉప రాష్ట్రపతి గా, మీరు యువజన సంక్షేమాని కి చాలా కాలాన్ని వెచ్చించారు’’

‘‘మీరు ఆడిన ప్రతి మాట ను శ్రద్ధ తో వినడం, అభిమానించడం, అంతేకాకుండా, ఆదరించడం జరిగేది.. అంతే తప్ప ఎన్నడూ ఎదురు చెప్పడం అనేది జరుగలేదు’’

‘‘శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి వన్ లైనర్స్ సైతం చతురత నిండి ఉంటాయి’’

‘‘దేశం కోసం మన లో భావన లు ఏవైనా ఉంటే, మన ఆలోచనల ను వెల్లడి చేసే కళ, అలాగే భాషా పరమైన వైవిధ్యం పట్లవిశ్వాసం ఉంటే అప్పుడు భాష, ప్రాంతం అనేవి మనకు ఎప్పటికి అడ్డంకులు గా కాబోవు; మరి ఈ విషయాన్ని మీరు నిరూపించారు’’

‘‘వెంకయ్య గారి గురించినటువంటి ప్రశంసనీయమైన విషయాల లో ఒకటి  ఏది అంటే అది భారతదేశ భాష ల పట్ల ఆయన కు ఉన్నఉద్వేగం అని చెప్పాలి’’

‘‘ఎగువ సభ తన భావి యాత్ర లో జ్ఞాపకం పెట్టుకొనే అనేక నిర్ణయాల ను మీరుతీసుకొన్నారు’’

‘‘మీరు నెలకొల్పిన ప్రమాణాల లో ప్రజాస్వామ్య పరిణతి ఉండటాన్ని నేను గమనించాను’’

Posted On: 08 AUG 2022 1:08PM by PIB Hyderabad

ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు కు రాజ్య సభ లో ఈ రోజు న ఇచ్చిన వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఎగువ సభ కు ఎక్స్- అఫిశియో చైర్ మన్ గా ఉన్న ఉప రాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ఘనమైన నమస్సుల ను అర్పించారు.

శ్రీ వెంకయ్య నాయుడు యొక్క జ్ఞానం మరియు వాక్చాతుర్యం కలగలసినటువంటి అనేక సందర్భాల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. న్యూ ఇండియాలో నాయకత్వం యొక్క వన్నె లో వచ్చినటువంటి మార్పు ను గురించి ప్రధాన మంత్రి ప్రకటిస్తూ, ‘‘ఎప్పుడైతే మనం ఈ సంవత్సరం లో ఆగస్టు 15వ తేదీ ని అనభవం లోకి తెచ్చుకొంటామో, అది ఎటువంటి స్వాతంత్య్ర దినం అవుతుంది అంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ మరియు ప్రధాన మంత్రి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాతి కాలం లో జన్మించిన వారే అయి ఉంటారు. అదీనూ, వారి లో ప్రతి ఒక్కరు చాలా సీదా సాదా పూర్వ రంగాల కు చెందిన వారే అయి ఉంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి ఒక గొప్ప సంకేతాత్మకమైనటువంటి విలువ ఉంది; మరి ఇది ఒక కొత్త యుగాని కి అద్దం పడుతుంది అని కూడాను అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉప రాష్ట్రపతి సార్వజనిక జీవనం లో తాను చేపట్టిన అన్ని భూమికలలోనూ అదే పని గా దేశ యువత కు ప్రోత్సాహాన్ని అందిస్తూ రావడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఆయన సభ లో కూడా ఎప్పుడూ యువ సభ్యుల ను ప్రోత్సహించారన్నారు. ‘‘మన ఉప రాష్ట్రపతి గా మీరు ఉంటూ యువజన సంక్షేమాని కి చాలా కాలాన్ని సమర్పణం చేశారు. మీ కార్యక్రమాల లో చాలా వరకు కార్యక్రమాలు యువ శక్తి పైన కేంద్రీకృతం అయినటువంటివే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సభ వెలుపల ఉప రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగాల లో 25 శాతం ప్రసంగాలు భారతదేశ యువతీ యువకుల సమక్షం లో ఇచ్చినవే అని ప్రధాన మంత్రి అన్నారు.

శ్రీ వెంకయ్య నాయుడు తో వివిధ హోదాల లో తనకు ఉన్నటువంటి సన్నిహితమైన అనుబంధాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పార్టీ కార్యకర్త గా సైద్ధాంతిక నిబద్ధత, శాసన సభ్యుని గా ఆయన చేసిన కార్యాలు, పార్లమెంటు సభ్యుని గా చేపట్టిన కార్యకలాపాల స్థాయి; బిజెపి అధ్యక్షుని గా ప్రదర్శించినటువంటి సంస్థాగతమైన నైపుణ్యాలు; మంత్రి గా ఆయన చేసిన కఠోర శ్రమ మరియు కార్యదక్షత; అంతేకాక ఉప రాష్ట్రపతి గా మరియు సభాధ్యక్షుని గా ఆయన చూపిన అంకిత భావం, ఇంకా హుందాతనం లను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘నేను శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి తో సంవత్సరాల తరబడి సన్నిహితం గా పని చేశాను. ఆయన వేరు వేరు బాధ్యతల ను చేపట్టడాన్ని కూడా నేను గమనించాను. మరి వాటి లో ప్రతి ఒక్క బాధ్యత ను ఆయన గొప్ప సమర్పణ భావం తో నిర్వర్తించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సార్వజనిక జీవనం లో భాగం అయిన వారు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు వద్ద నుంచి ఎంతో నేర్చుకోవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉప రాష్ట్రపతి యొక్క వాగ్ధార ను మరియు ఉప రాష్ట్రపతి యొక్క వాక్చాతుర్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘మీరు ఆడిన ప్రతి మాట ను ఆలకించడం, అభిమానించడం, ఇంకా ఆదరించడం జరిగేది.. అంతే తప్ప మారుమాట అనడం అనేది ఎన్నడూ జరుగలేదు’’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ఇంకా ఇలా అన్నారు.. ‘‘శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి వన్ లైనర్ స్ ఎంతో ప్రసిద్ధం అయ్యాయి. అవి చమత్కారం నిండి ఉండేవి. భాష లపై ఆయన కు ఉన్న పట్టు ఎల్లప్పటికీ ఎంతో గొప్పదిగా ఉండింది.’’ సభ లోపల, సభ వెలుపల ఉప రాష్ట్రపతి యొక్క బ్రహ్మాండమైన అభిప్రాయ వ్యక్తీకరణ ప్రావీణ్యాలు గొప్పవైన ప్రభావాన్ని ప్రసరింపచేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శ్రీ వెంకయ్య నాయుడు జీ చెప్పే దానిలో అటు విషయం, ఇటు గాఢత.. రెండూ ఉంటాయి, అది ఎంత సూటి గా ఉండేదో అంతే సాటి లేనిది గా కూడా ఉండేది; ఆ మాటల లో చతురత, విలువ.. రెండూ ఉండేవి; మీరు మాట్లాడే మాటల లో ఆత్మీయత తో పాటుగా జ్ఞానం కూడా నిండి ఉండేది’’ అని ఆయన అన్నారు.

దక్షిణ భారతదేశం లో శ్రీ ఎం. వెంకయ్య నాయుడు తన రాజకీయ కరియర్ ను ఎంతో అణకువ తో మొదలు పెట్టారు అని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయన ఎంచుకొన్న సిద్ధాంతాల కు అప్పట్లో అక్కడ వెనువెంటనే ఎలాంటి అవకాశాలు కానరాలేదు అన్నారు. ఒక రాజకీయ కార్యకర్త స్థానం నుంచి ఆయన ఎంచుకొన్నటువంటి పార్టీ లో అధ్యక్ష స్థానం దాకా ఉప రాష్ట్రపతి సాగించిన యాత్ర సిద్ధాంతం మరియు దృఢత్వం ల పరం గా చూసినప్పుడు ఆయన లోని అజేయమైన ముక్కుసూటితనాన్ని ప్రతిబింబించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశం కోసం మనలో ఏవైనా భావాలు ఉన్నాయంటే గనుక, మన ఆలోచనల ను వెల్లడించే ఒక కళ, మరి భాషా పరమైన వైవిధ్యం పట్ల విశ్వాసం ఉన్నాయి అంటే అప్పుడు మనకు భాష, ప్రాంతం అనేవి ఎన్నటికి అడ్డంకులు గా మారజాలవు. మరి ఈ విషయాన్ని మీరు రుజువు చేశారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఉప రాష్ట్రపతి కి మాతృభాష అంటే ఉన్న ప్రేమ ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ‘‘వెంకయ్య గారి విషయం లో మెచ్చుకోదగిన అంశాల లో ఒకటి ఏమిటి అంటే అది భారతదేశ భాష లు అంటే ఆయన కు ఉన్న మక్కువ అని చెప్పాలి. సభ కు ఆయన ఏ విధం గా అధ్యక్షత వహించారో అనే అంశం లో అది ప్రతిబింబించింది. ఆయన రాజ్య సభ యొక్క పనితీరు వృద్ధి చెందేటట్లు చేయడానికి తోడ్పడ్డారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉప రాష్ట్రపతి స్థాపించిన వ్యవస్థ లు, ఆయన యొక్క నాయకత్వం సభ పనితీరు ను సరికొత్త శిఖరాని కి చేర్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఉప రాష్ట్రపతి యొక్క నాయకత్వం కాలం లో, సభ సాధించినటువంటి ఫలితాలు 70 శాతం మేర కు పెరిగాయి, సభ్యుల హాజరు శాతం వృద్ధి చెందింది, రెకార్డు స్థాయి లో 177 బిల్లు లు అయితే ఆమోదం పొందడమో లేదా చర్చించడమో జరిగింది. ‘‘ఎగువ సభ ఊర్ద్వ ముఖ ప్రస్థానాన్ని గుర్తుపెట్టుకొనేటటువంటి అనేకమైన నిర్ణయాల ను మీరు తీసుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

సభ ను ఉప రాష్ట్రపతి చాకచక్యం గా, వివేకవంతం గా మరియు దృఢం గా నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి కొనియాడడం తో పాటు గా ఒక స్థాయి ని మీరి సభ కు అంతరాయాన్ని కలిగించడం అనేది సభా ధిక్కారం గా మారుతుంది అనేటటువంటి స్థిరమైన నమ్మకాన్ని కలిగివున్నందుకు కూడాను ఆయన ను ప్రశంసించారు. ‘‘మీరు ఏర్పరచిన ప్రమాణాల లో ప్రజాస్వామ్యం తాలూకు పరిపక్వత ను నేను గమనించాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కష్టమైన సందర్భాల లో సైతం సభ కార్యకలాపాల ను కొనసాగించడం లో ఆయన యొక్క సమన్వయాన్ని, సర్దుబాటు ను, అవతలి పక్షం తో సంభాషించే నేర్పు ను ప్రధాన మంత్రి అభినందించారు. ప్రభుత్వాన్ని ప్రతిపాదించనివ్వండి, ప్రతిపక్షాన్ని వ్యతిరేకించనివ్వండి, అటు తరువాత సభ ను ముగియనివ్వండిఅనే దృష్టికోణం శ్రీ వెంకయ్య నాయుడు ది అంటూ ప్రధాన మంత్రి ప్రశంస లు కురిపించారు. అన్య సభ నుంచి అందినటువంటి ప్రతిపాదనల ను ఆమోదించడానికి గాని, లేదా తిరస్కరించడానికి గాని, లేదా సవరించడానికి గాని ఈ సభ కు హక్కు ఉంది, అయితే మన ప్రజాస్వామ్యం అవతలి సభ నుంచి అందినటువంటి ప్రతిపాదనల ను నిలువరించే ప్రతిపాదన ను ఊహించ లేదు అని ఆయన అన్నారు.

దేశాని కి మరియు సభ కు అందించిన తోడ్పాటుల కు మరియు మార్గదర్శనాని కి గాను ఉప రాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

DS

 

 



(Release ID: 1849919) Visitor Counter : 236