ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 08 AUG 2022 8:10AM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాడ్ మింటన్ డబుల్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు తృష జాలి గారు మరియు గాయత్రి గోపిచంద్ గారు లను చూసి మన కు గర్వం గా ఉంది. తృష కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు, గాయత్రి తో తనకు ఉన్న స్నేహాన్ని గురించి నాతో చెప్పారు. అయితే, ఒకవేళ తాను ఒక పతకాన్ని సాధించడం అంటూ జరిగితే గనక ఆ గెలుపు ను ఏ విధం గా వేడుక గా నిర్వహించుకొనేదీ తాను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె దీనికి సంబంధించిన ప్రణాళిక ను సిద్ధం చేసుకొనే ఉండి ఉండవచ్చని నేను ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 


(रिलीज़ आईडी: 1849900) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam