ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 06 AUG 2022 10:03PM by PIB Hyderabad

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ప్ర‌ధాన‌మంత్రి వ‌రుస‌ట్వీట్లు చేశారు.

పార్టీలకు అతీతంగా అద్భుతమైన మద్దతుతో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు శ్రీ జగదీప్ ధన్‌ఖ‌డ్‌ జీకి అభినందనలు. వారు అత్యుత్తమ ఉపరాష్ట్రపతి అవుతార‌న్న‌ నమ్మకం నాకు  ఉంది. వారి మేధ‌స్సు, వివేకం వల్ల మన దేశం అద్భుతంగా లాభపడుతుంది.
"శ్రీ జగదీప్ ధ‌న్‌ఖ‌డ్‌ జీకి ఓటు వేసిన ఎంపీలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జ‌రుపుకుంటున్న‌ తరుణంలో, అద్భుతమైన న్యాయ పరిజ్ఞానం మేధ‌స్సు కలిగిన రైతుబిడ్డ ఉపప‌రాష్ట్ర‌ప‌తి గా ఉండ‌బోవ‌డం  మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం.


(रिलीज़ आईडी: 1849583) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam