ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన సోనాల్‌ పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 07 AUG 2022 8:38AM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పారా టెబుల్‌ టెన్నిస్‌లో కాంస్య  పతకం సాధించిన భారత క్రీడాకారిణి సోనాల్‌ పటేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “ప్రతిభ, దీక్ష, పట్టుదల కలగలిస్తే అసాధ్యమన్నది లేనేలేదు. ఆమె ఈ మూడు లక్షణాలనూ సంపూర్ణ స్థాయిలో ప్రదర్శించడం వల్లనే పారా టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమెకు నా అభినందనలు. భవిష్యత్తులోనూ ఆమె తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకోవాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1849555) Visitor Counter : 147