ప్రధాన మంత్రి కార్యాలయం
పారా టేబుల్ టెన్నిస్ క్రీడలో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన భవీనా పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
07 AUG 2022 8:32AM by PIB Hyderabad
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 పారా టేబుల్ టెన్నిస్ క్రీడలో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన భవీనా పటేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“అద్భుత క్రీడాకారిణి @BhavinaOfficial మనమంతా గర్వించదగిన మరొక సందర్భాన్ని సృష్టించారు. పారా టేబుల్ టెన్నిస్‌లో ఆమె ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. ఇది ఆమె తొలి స్వర్ణం కావడం విశేషం! భారత యువతరం టేబుల్ టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకోవడంలో ఆమె విజయం స్ఫూర్తిదాయకం కాగలదని ఆశిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఆమె అత్యుత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
(Release ID: 1849552)
Visitor Counter : 141
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam