ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల లాంగ్ జంప్ లో వెండి పతకాన్నిగెలుచుకొన్నందుకు శ్రీ ఎమ్. శ్రీశంకర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 AUG 2022 9:40AM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల లాంగ్ జంప్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ ఎమ్. శ్రీశంకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ ఎమ్. శ్రీశంకర్ సాధించిన రజత పతకం విశిష్టమైనటువంటిది. దశాబ్దాల తరువాత భారతదేశం కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో పురుషుల లాంగ్ జంప్ లో పతకాన్ని గెలిచింది. ఆయన ప్రదర్శన భారతదేశం ఎథ్ లెటిక్స్ యొక్క భవిష్యత్తు కు శుభ సంకేతం గా నిలుస్తుంది. ఆయన కు ఇవే అభినందన లు. రాబోయే కాలాల్లో ఆయన మరింత చక్కనైనటువంటి ప్రదర్శన ను ఇస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1848848) సందర్శకుల సూచీ సంఖ్య : : 186