ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు పూర్తి యాజమాన్యం ఉన్నఅనుబంధ కంపెనీ ‘భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్’ బ్రెజిల్ లో బిఎమ్-ఎస్ఇఎఎల్-11 ప్రాజెక్టును అభివృద్ధి పరచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 27 JUL 2022 5:17PM by PIB Hyderabad

భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు పూర్తి యాజమాన్యం ఉన్న అనుబంధ కంపెనీ అయిన భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్’ ( బిపిఆర్ఎల్) ద్వారా బ్రెజిల్ లో బిఎమ్-ఎస్ఇఎఎల్-11 రాయితీ ప్రాజెక్టు ను అభివృద్ధి పరచడం కోసం 1,600 మిలియన్ యుఎస్ డాలర్ (ఇంచుమించు 12,000 కోట్ల రూపాయలు) అదనపు పెట్టుబడి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది.

 

ఈ కింద పేర్కొన్న అంశాల కు కూడా సిసిఇఎ ఆమోదం తెలిపింది:

 

i. బిపిసిఎల్ ద్వారా బిపిఆర్ఎల్ యొక్క ఎక్విటి పెట్టుబడి పరిమితి మరియు కంపెనీ యొక్క అధీకృత వాటా మూలధనం లో వృద్ధి, దీని ని 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు (ఎప్పటికప్పుడు బిపిసిఎల్ ద్వారా కొనుగోలు కై) చేయడం.

 

ii. ఇంటర్ మీడియట్ డబ్ల్యుఒఎస్ మాధ్యమం తో బిపిఆర్ఎల్ ఇంటర్ నేశనల్ బివి ద్వారా ఇంటర్ నేశనల్ బివి బ్రెజిల్ పెట్రోలో లిమిటాడా లో లో ఎక్విటి పెట్టుబడి యొక్క పరిమితి ని ప్రస్తుతం ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయల పరిమితి ని పెంచివేసి 15,000 కోట్ల రూపాయలు చేయడం కోసం అధికారాన్ని ఇవ్వడం; అంటే 10,000 కోట్ల రూపాయల మేరకు పెరుగుదల చోటు చేసుకొంటుందన్న మాట.

 

బిఎమ్-ఎస్ఇఎఎల్-11 ప్రాజెక్టు లో 2026-27 నుంచి ఉత్పత్తి మొదలు కావచ్చని అంచనా వేయడమైంది.

 

ఇది ఈ కింద ప్రస్తావించిన అంశాలలో సహాయకారి గా ఉంటుంది:

 

. భారతదేశం యొక్క శక్తి సంబంధి భద్రత ను పటిష్ట పరచడం కోసం ఎక్విటి ఆయిల్ స్థాయి వరకు చేరుకోవడం;

 

బి. భారతదేశం యొక్క ముడి చమురు సరఫరా వనరుల లో వివిధీకరణ కు తావు ఇవ్వడం లో; భారతదేశాని కి చెందిన చమురు కంపెనీలు బ్రెజిల్ నుంచి మరింతగా క్రూడ్ ఆయిల్ ను సమకూర్చుకోవడం లో ఆసక్తి ని వ్యక్తం చేశాయి.

 

సి. బ్రెజిల్ లో భారతదేశం యొక్క పాద ముద్ర ను బలపరచుకోవడం లో; దీనితో చుట్టుపక్కల ఉన్న లాటిన్ అమెరికన్ దేశాల లో సరికొత్త వ్యాపార మార్గాలు అందివస్తాయి.

 

డి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పటి కంటే బలోపేతం గా మార్చడం లో;

 

ఈ రాయితీ లో బిపిఆర్ఎల్ యొక్క పార్టిసిపేటింగ్ ఇంటరెస్ట్ (పిఐ) 40 శాతం గా ఉంది. దీనిలో బ్రెజిల్ కు చెందిన జాతీయ చమురు కంపెనీ అయినటువంటి పెట్రోబ్రాస్ నిర్వహణదారు రూపం లో 60 శాతం భాగస్వామి గా ఉంది.

 

బిపిఆర్ఎల్ 2008వ సంవత్సరం నుంచి బ్రెజిల్ లో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అన్వేషణ మరియు అభివృద్ధి కార్యాలతో జతపడి ఉంది.

 

 

***



(Release ID: 1845623) Visitor Counter : 168