ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్ఐఐఒ సెమినార్ ‘స్వావలంబన్’ నుఉద్దేశించి జులై 18వ తేదీ న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


భారతీయ నౌకాదళం లో స్వదేశీ సాంకేతికపరిజ్ఞ‌ానాన్ని వినియోగించడానికి ఒక ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం ఉద్దేశించిన‘స్ప్రింట్ చాలెంజెస్’ ను ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి 

Posted On: 17 JUL 2022 10:02AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జులై 18వ తేదీ నాడు సాయంత్రం పూట 4:30 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని డాక్టర్ ఆంబేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో ఎన్ఐఐఒ (నావల్ ఇన్నొవేశన్ అండ్ ఇండైజెనైజేశన్ ఆర్గనైజేశన్) నిర్వహించే ఒక చర్చాసభ అయిన ‘స్వావలంబన్’ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

రక్షణ రంగం లో స్వయం సమృద్ధి ని సాధించడం అనేది ఆత్మనిర్భర్ భారత్ లో ఒక ముఖ్య ఆధార స్తంభం అని చెప్పాలి. ఈ ప్రయాస ను ముందుకు తీసుకు పోయే క్రమం లో ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ‘స్ప్రింట్ చాలెంజెస్’ (SPRINT Challenges) ను ఆవిష్కరించనున్నారు. భారతదేశం యొక్క నౌకాదళం లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞ‌ానం వినియోగాన్ని పెంపుచేయడం దీని ఉద్దేశ్యం గా ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో ఓ భాగం గా, డిఫెన్స్ ఇన్నొవేశన్ ఆర్గనైజేశన్ (డిఐఒ) తో కలసి భారతదేశం నౌకాదళం లో కనీసం 75 కొత్త దేశవాళీ సాంకేతిక పరిజ్ఞ‌ానాలను / ఉత్పత్తుల ను చేర్చాలి అని ఎన్ఐఐఒ ధ్యేయం గా పెట్టుకొంది. ఆ సహకార యుక్త ప్రాజెక్టు కు స్ప్రింట్ అని పేరు పెట్టారు. సపోర్టింగ్ పోల్- వాల్టింగ్ ఇన్ ఆర్ అండ్ డి త్రూ ఐడెక్స్, ఎన్ఐఐఒ అండ్ టిడిఎసి) (Supporting Pole-Vaulting in R&D through iDEX, NIIO and TDAC) ని సంకేతించే ఆంగ్ల అక్షరాలే SPRINT.

రక్షణ రంగం లో స్వావలంబన ను సాధించడం కోసం భారతదేశం లోని పరిశ్రమ రంగాన్ని మరియు విద్య రంగాన్ని ఈ కారక్రమం లో కలుపుకొని పోవడం అనేది చర్చాసభ ఉద్దేశ్యం గా ఉంది. రెండు రోజుల పాటు జులై 18వ మరియు 19వ తేదీ లలో సాగే ఈ చర్చాసభ రక్షణ రంగాని కి ఏయే ఉపాయాలను అందించాలి అనే అంశం పై ఒక చోటు లో చేరి ఆలోచన లు చేసి, తగిన సిఫారసుల ను ఇవ్వడం కోసం పరిశ్రమ రంగం, విద్య రంగం, సేవల రంగం మరియు ప్రభుత్వం యొక్క ప్రతినిధుల కు ఒక ఉమ్మడి వేదిక ను సమకూర్చనుంది. నూతన ఆవిష్కరణ లు, స్వదేశీకరణ, ఆయుధాలు మరియు విమానయానం సంబధిత విషయాల పైన ప్రత్యేకం గా సమావేశాల ను నిర్వహించడం జరుగుతుంది. సెమినార్ లో రెండో రోజు న ప్రభుత్వం యొక్క ‘సాగర్’ (సెక్యూరిటీ అండ్ గ్రోథ్ ఫార ఆల్ ఇన్ ద రీజియన్.. ఎస్ఎజిఎఆర్) దృష్టికోణాని కి అనుగుణం గా అవుట్ రీచ్ టు ద ఇండియన్ ఓశన్ రీజియన్ అనే అంశం పై చర్చ చోటు చేసుకోనుంది.

***



(Release ID: 1842267) Visitor Counter : 154