ప్రధాన మంత్రి కార్యాలయం

ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 10 JUL 2022 9:01AM by PIB Hyderabad

ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఇదివరకు ప్రసారం అయిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో, పంఢర్ పుర్ యొక్క దివ్యత్వాన్ని గురించి మరియు వార్ కరీ సంప్రదాయం గురించి శ్రీ నరేంద్ర మోదీ తాను మాట్లాడిన సంగతుల ను కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ పవిత్రమైనటువంటి ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. భగవాన్ విఠలుని ఆశీస్సులు మనకు ప్రాప్తించుగాక; మన సమాజం లో ఆనంద భావన పెంపొందుతూ ఉండుగాక. ఇదివరకు ప్రసారం అయిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం పంఢర్ పుర్ దివ్యత్వాన్ని గురించి, మరి అలాగే వార్ కరీ సంప్రదాయాన్ని గురించి మాట్లాడుకొన్న సంగతులను కూడాను నేను శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

దేహూ లో సంత్ తుకారామ్ జీ కి అంకితం చేసిన ఒక ఆలయాన్ని కొన్ని వారాల క్రితం తాను ప్రారంభించినప్పుడు ఇచ్చిన ఉపన్యాసం తాలూకు ఒక వీడియో ను సైతం ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కొన్ని వారాల కిందట, దేహూ లో సంత్ తుకారామ్ జీ కి అంకితం చేసిన ఒక ఆలయాన్ని ప్రారంభించడం కోసమని నేను అక్కడ కు వెళ్లాను. నా ఉపన్యాసం లో, నేను ఆయన యొక్క పవిత్రమైన బోధనల ను గురించి ప్రముఖం గా ప్రస్తావించడం జరిగింది. మనం అందరం మహానుభావులైన వార్ కరీ సాధువులు, రుషుల నుంచి ఏమేమి నేర్చుకోవచ్చో అనే వాటిని గురించి తెలియజేశాను.’’ అని పేర్కొన్నారు.

దీనికి తోడు, వార్ కరీ సంప్రదాయాన్ని గురించి ప్రధాన మంత్రి కిందటి ఏడాది నవంబర్ నెల లో తాను ఇచ్చిన ఉపన్యాసాన్ని కూడా శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పంఢర్ పుర్ లో ఆధ్యాత్మిక పర్యటన కు ఊతాన్ని ఇచ్చేటటువంటి కీలకమైన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసే భాగ్యం కిందటి సంవత్సరం నవంబరు నెల లో నాకు దక్కింది. ఇది వార్ కరీ సంప్రదాయానికి భారతదేశం యువతీయువకుల లో మరింత ఆదరణ లభించాలని మనం చేస్తున్న ప్రయాసల లో ఒక భాగం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

 



(Release ID: 1840555) Visitor Counter : 145