ప్రధాన మంత్రి కార్యాలయం
1800 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
“కాశీ ప్రస్తుతం , వారసత్వంతో కూడిన అభివృద్ధి చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది.”
“ నా కాశీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్‌కు ఒక గొప్ప ఉదాహరణ”
“ షార్ట్ కట్‌లు దేశానికి ఎంతమాత్రం మేలు చేయవని కాశీ పౌరులు దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు”
“ ప్రభుత్వం పేదల సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ కృషి చేస్తూవచ్చింది.వారి సుఖంలో , దుఃఖంలో వారికి అండగా ఉంటూ వచ్చింది.”
“మనకు, అభివృద్ధి అనేది కేవలం మెరుగు కాదు, మనకు అభివృద్ధి అంటే పేదలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, తల్లులు, సోదరీమణుల సాధికారత”
Posted On:
07 JUL 2022 5:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వారణాశిలోని సిగ్రాలో గల డాక్టర్ సంపూర్ణానంద క్రీడా ప్రాంగణం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 1800 కోట్ల రూపాయల విలువగల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉత్తర ప్రదేశ్, కాశీ ప్రజలు ఇటీవలి ఎన్నికలలో తమకు భారీ మద్దతు నిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కాశీ ఎల్లప్పుడూ సజీవంగా ఉందని , నిరంతరం మార్పు కలిగి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు కాశీ దేశం మొత్తం ఒక వారసత్వంతో పాటు అభివృద్ధి చిత్రాన్ని చూపించింది.
కాశీ ఎల్లప్పుడూ సజీవత్వంతో పాటు , నిరంతరం మార్పు కలిగి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు కాశీ దేశం మొత్తం ఒక గొప్ప వారసత్వంతో పాటు అభివృద్ధి చిత్రాన్నీ చూపించిందని అన్నారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, మరి కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. కాశీ ఆత్మ అంతర్గతమని, అయితే కాశీ రూపానికి నిరంతరం మెరుగులు దిద్దేందుకు కృషి జరుగుతుందని అన్నారు. కాశీలో అభివృద్ధి వల్ల కాశీలో సులభంగా తిరగడానికి వీలు కలగడంతోపాటు, ప్రగతికి దోహదపడుతోందని అన్నారు. “నా కాశీ సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌కు గొప్ప ఉదాహరణ” అని ఆయన అన్నారు.
కాశీ పార్లమెంటు సభ్యుడు కూడా అయిన ప్రధానమంత్రి, “చైతన్యవంతులైన కాశీ ప్రజలు దేశానికి దిశా నిర్దేశం చేసేలా పని చేశారు. షార్ట్ కట్ పద్ధతులేవీ దేశానికి మేలు చేయవని కాశీ ప్రజలు దేశం మొత్తానికి సందేశం తెలియజేశారు. ” అని అన్నారు. తాత్కాలిక, షార్ట్ కట్ పద్ధతులను కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్థానిక ప్రజలను అభినందించారు. మౌలిక సదుపాయాలలో అభివృద్ధి, ఇతర రంగాలలో అభివృద్ధి కాశీ నగరానికి పర్యాటకాన్ని తీసుకువచ్చిందని, వ్యాపారానికి , సులభతర జీవనానికి కొత్త అవకాశాలు వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు.
రానున్న శ్రావణమాసం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దేశవ్యాప్తంగా గల బాబా విశ్వనాథ్‌భక్తులు పెద్దసంఖ్యలో కాశీ తరలి రానున్నారని చెప్పారు. విశ్వనాథ్ థామ్ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత జరుగుతున్న తొలి శ్రావణమాసం ఇది అని ప్రధానమంత్రి అన్నారు. కాశీ విశ్వనాథ్ థామ్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది నెలలుగా ఎంతో ఉత్సాహం నెలకొన్న విషయం ప్రజలు గమనించారని ఆయన అన్నారు. భక్తులకు కాశీ యాత్ర గొప్పనుభవాన్ని మిగిల్చేలా చేసేందుకు , యాత్రను వీలైనంత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్టు చెప్పారు. వివిధ విశ్వాసాలకు సంబంధించిన యాత్రలను సులభతరం, అనుకూలంగా ఉండేట్టు చేస్తున్నట్టు చెప్పారు.
“ మాకు అభివృద్ధి అంటే మెరుగులు కాదు. మాకు అభివృద్ది అంటే పేదలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు,తల్లులు, ఆడబిడ్డల సాధికారత. ” అని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోన ప్రతి ఇంటికీ పక్కా ఇంటి సదుపాయం కల్పించేందుకు, పైపు ద్వారా నీటని సరఫరా చేసేందుకు నిరంతరం చర్యలుతీసుకుంటున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం ఎప్పుడూ పేదల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నదని, వారి బాధలలో, సంతోషాలలో అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. కరోనా ఉచిత వాక్సిన్‌నుంచి పేదలకు ఉచిత రేషన్ పంపిణీ వరకు పేదలకు సేవ చేసే విషయంలో ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టలేదని ప్రధానమంత్రి చెప్పారు. డిజిటల్ ఇండియా, ఆయుష్మాన్‌భారత్, వైద్య మౌలిక సదుపాయాల పెంపు వంటివి ప్రజలకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు.
ఒక వైపుమనం సిఎన్‌జి ఆధారిత వాహనాల ద్వారా నగరాలను వాయు కాలుష్య రహితం చేస్తున్నామని, మరోవైపు డీజిల్, పెట్రోలు తో నడిచే పడవలకు సిఎన్‌జి అమర్చడం ద్వారా గంగానది పరిక్షణ పట్ల శ్రద్ధ వహిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు.
కొత్త క్రీడా కేంద్రం ఏర్పాటుతో క్రీడాకారులలో ఉత్సాహం వెల్లివిరిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ఒలింపిక్‌క్రీడలకు అవసరమైన అన్ని సదుపాయాలను కాశీలోకల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. సిగ్రాలో పునర్ అభివృద్ధి చేసిన స్టేడియంలో అంతర్జాతీయ సదుపాయాలు కల్పిస్తున్నట్టు శ్రీనరేంద్రమోదీ చెప్పారు. ఆరు దశాబ్దాల నాటి స్టేడియంలొ 21 వ శతాబ్దపు అవసరాలకు అనుగుణమైన సదుపాయాలు కల్పిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
గంగా నదిని, వారణాశి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల తోడ్పాటు, బాబా విశ్వనాథ్ ఆశీస్సులతో నగరానికి సంకల్పించిన పనులన్నీ పూర్తికాగలవన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుః
గత 8 సంవత్సరాలలో ప్రధానమంత్రి వారణాశిలో పలు మౌలికసదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీనితో వారణాశి నగరం రూపురేఖలు మారిపోయాయి. ఈ కృషికి ప్రత్యేక కారణం, ప్రజల సులభతర జీవనాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం.ఇందుకు సంబంధించి మరింత ముందడుగు దిశగా చర్యలు తీసుకుంటూ ప్రధానమంత్రి 590 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు.ఇందులో పలు ప్రాజెక్టులు వారణాశి స్మార్ట్ సిటీ, అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నాయి. ఇందులో నమో ఘాట్ తొలి దశ పునర్ అభివృద్ధి, స్నానాల జెట్టి, 500 పడవలకు సంబంధించి డీజిల్, పెట్రోలు ఇంజిన్లను సి.ఎన్.జి కి మార్చడం, పాత కాశీలోని కామేశ్వర మహదేవ్ వార్డు పునర్ అభివృద్ధి, హర్‌హువా, దాసేపూర్ గ్రామాలలో 600 ఇడబ్ల్యుఎస్ ఫ్లాట్ల నిర్మాణం, లహరతర-చౌకాఘాట్ ఫ్లై ఓవర్ కింద కొత్త వెండింగ్ జోన్, అర్బన్ ప్లేస్, దశాశ్వమేథ ఘాట్‌లో పర్యాటక సదుపాయాలు, మార్కెట్ కాంప్లెక్స్, నాగ్‌వా వద్ద ఐపిడిఎస్ వర్క్ ఫేజ్ 3 కింద 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణం వంటివి ఉన్నాయి.
పలు రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో ఆబట్‌పూర్ -కాప్‌సెథి- బడోహి రోడ్ కు సంబంధించి నాలుగు లేన్ల రోడ్ ఓఒర్ బ్రిడ్జి (ఆర్ ఒ.బి)ని, సెంట్రల్ జైల్ రోడ్ లో వరుణా నదిపై బ్రిడ్జిని, పిండారా- కథిరాన్ రోడ్ విస్తరణ పనులను, ఫూల్‌పూర్ -సింధౌరా లింక్ రోడ్ వెడల్పు పనులను, 8 గ్రామీణ రోడ్లను పటిష్టం చేసే పనులను, 7 పిఎంజిఎస్‌వై రోడ్ల ను ధర్సౌనా-సింధూరారోడ్‌లో విస్తరణకు సంబంధించిన పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు.
జిల్లాలో మురుగునీటి వ్యవస్థ మెరుగు, నీటి సరఫరా ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే వారణాశి నగరంలో ఓల్డ్ ట్రంక్‌సీవర్ లైన్‌ను ట్రెంచ్ లెస్ టెక్నాలజీతో తిరిగి తీర్చిదిద్దడం, మురుగునీటి సరఫరా లైన్ల ఏర్పాటు, వారణాశి ప్రాంతంలో 25000 ఇళ్లకు మురుగునీటి కనక్షన్ ఏర్పాటు, సిస్ వరుణ ప్రాంతంలో లీకేజి ని చక్కదిద్దే పనులు, తాతేపూర్ గ్రామంలో గ్రామీణ మంచినీటి పథకం పనులు, మహగాన్‌లో ఐటిఐ ప్రారంభం వివిధ సామాజిక విద్యా సంబంధ పనులు , రామ్‌నగర్‌లో ని బిహెచ్‌యు ప్రభుత్వ బాలికల పాఠశాలలో వేదిక్ విజ్ఞాన కేంద్రం రెండో దశ , దుర్గాకుండ్ లో ని ప్రభుత్వ వయోధిక మహిళా వసతి గృహంలో థీమ్ పార్కు వంటి వాటిని ప్రధానమంత్రి ప్రారంభించారు.
బడాలాల్ పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో ప్రధానమంత్రి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ బాస్కెట్‌బాల్ కోర్టును ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే సింధౌరాలో నాన్ రెసిడెన్షియల్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్, వివిధ పోలీస్, ఫైర్ సేఫ్టీ ప్రాజెక్టులు , హాస్టల్ రూమ్‌ల నిర్మాణం, మిర్జామురద్, చోలాపూర్, ఝాన్సా, కాప్‌సేథి పోలీస్ స్టేషన్ల లో హాస్టల్ రూమ్‌లు, బారక్ ల నిర్మాణం, పిండ్రాలో అగ్నిమాకప వ్యవస్థా కేంద్ర భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి సుమారు 1200 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనచేశారు . వీటిలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. అవి లహర్‌తారా- బిహెచ్‌యు నుంచి విజయ సినిమా వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, పందేపూర్ ఫ్లైఓవర్‌నుంచి రింగ్ రోడ్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, కుచహెరి నుంచి సంధహ వరకు నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ, వారణాశి బడోహి గ్రామీణ రోడ్డు పటిష్ట పరచడం, ఐదు కొత్త రోడ్ల నిర్మాణం, వారణాశిలో నాలుగు సిసి రోడ్ల నిర్మాణం, బబతాపూర్- చౌబేపూర్ రోడ్ లో బబతాపూర్ రైల్వేస్టేషన్ వద్ద ఆర్.ఒ.బి నిర్మాణం వంటివి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వారణాశి నగరంలో , గ్రామీణ రోడ్లపైన ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించనున్నాయి.
ఈ ప్రాంతంలో పర్యాటకానికి మరింత ఊతం ఇచ్చేందుకు ప్రధానమంత్రి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సారనాథ్ బుద్ధిస్ట్ సర్కూట్ అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇవి ప్రపంచబ్యాంకు సహాయంతో యుపి పేదల అనుకూల పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నది. అష్ట వినాయక, ద్వాదశ జ్యోతిర్లంగ యాత్ర, అష్టభైరవ, నవ గౌరీయాత్ర కు సంబంధించి పావన్ పథ్ నిర్మాణ పనులు , పంచకోశి పరిక్రమ యాత్రా మార్గం, పాత కాశీలో పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకు స్థాపనచేశారు.
సిగ్రాలో క్రీడా స్టేడియం పునర్ అభివృద్ధి తొలి దశ పనులకు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
***
DS/AK
(Release ID: 1840036)
Visitor Counter : 189
Read this release in:
Bengali
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil