ప్రధాన మంత్రి కార్యాలయం
జూలై 7న వారణాశిని సందర్శించనున్న ప్రధానమంత్రి
1800 కోట్ల రూపాయల ఖర్చు విలువ వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
వారణాశిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాన్యుల సులభతర జీవనంపై దృష్టితో ఈ ప్రాజెక్టులు చేపట్టారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) అమలుపై అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
అక్షయపాత్ర మధ్యాహ్న భొజన పథకం పాకశాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
04 JUL 2022 6:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 , జూలై 7 వతేదీన వారణాశిని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి వారణాశిలోని ఎల్.టి.కాలేజ్‌లో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పాకశాలను ప్రారంభించనున్నారు. లక్షమంది విద్యార్ధులకు భోజన సదుపాయం అందించగల సామర్ధ్యం దీనికి ఉంది. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి అంతర్జాతీయ సహకార సమ్మేళన కేంద్రం - రుద్రాక్షను సందర్శిస్తారు. అక్కడ ఆయన అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ విద్యావిధానం అమలుపై దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధానమంత్రి సిగ్రాలోని డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా ప్రాంగణానికి చేరుకుని అక్కడ 1800 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుః
గత 8 సంవత్సరాలలో ప్రధానమంత్రి వారణాశిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా వారణాశిలో రవాణా విషయంలో ప్రతిఫలించింది. ప్రధానంగా ప్రజల సులభతర జీవనానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈ దిశగా మరో కీలక ముందడుగు వేస్తూ, సిగ్రాలోని డాక్టర్ సమపూర్ణానంద్ క్రీడా ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి 590 కోట్ల రూపాయల విలుగల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. వారణాశి స్మార్ట్‌సిటీ, అర్బన్ ప్రాజెక్టులు, నమో ఘాట్ తొలి దశ పునర్ అభివృద్ధి, స్నానాల జట్టి నిర్మాణం, 500 పడవలకు సంబంధించిన పెట్రోలు, డీజిల్ ఇంజిన్లను సిఎన్‌జికి మార్పు, పాత కాశీకి సంబంధించి కామేశ్వర్ మహదేవ్ వార్డు పునర్ అభివృద్ధి,దాసీపూర్ లోని హర్‌హువా గ్రామంలో నిర్మించిన 600 ఇడబ్లుఎస్ ఫ్లాట్ల ప్రారంభోత్సవం, కొత్త వెండింగ్ జోన్, లహరతారా-చౌకా ఘాట్‌ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేసిన అర్బన్ ప్లేసి,దశాశ్వమేథ ఘాట్‌లో పర్యాటకుల సదుపాయం, మార్కెట్ ప్రాంగణం, ఐపిడిఎస్ వర్క్ ఫేస్ 3 కింద నగ్వా వద్ద నిర్మించిన 33-11 కెవి సబ్ స్టేషన్‌ల ప్రారంభోత్సవాలు ఉ న్నాయి.
ప్రధానమంత్రి వివిధ రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. ఇందులో బాబత్‌పూర్-కాప్‌సేథి- భదోహి రోడ్ లో నాలుగు లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జికి, సెంట్రల్ జైల్ రోడ్‌లో వరుణ నదిపై బ్రిడ్జికి, పిండ్ర-కథిరాన్ రోడ్ వెడల్పు కార్యక్రమానికి, ఫూల్పూరర్ -సింధూర లింక్ రోడ్‌కు, 8 గ్రామీణ రోడ్లను బలోపేతం చేసే కార్యక్రమానికి, పిఎంజిఎస్‌వై కింద ఏడు రోడ్ల నిర్మాణం, ధర్ సనా-సింధూరా రోడ్ వెడల్పు కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రధానమంత్రి వారణాశి జిల్లా లో మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా మెరుగుదలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో వారణాశి నగరంలో ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో చేపట్టిన ,పాత ట్రంక్ సీవరరర్ లైన్ పునరుద్ధరణను ప్రారంభించనున్నారు. మురుగునీటి లైన్ల ఏర్పాటు, 25,000 ఇళ్లకు మురుగు నీటి సరఫరా లైన్లను ట్రాన్స్ వారణాశి ఏరియాలో ఏర్పాటు, నగరంలోని సిస్ వరుణ ప్రాంతంలో లీకేజ్ రిపేర్ పనులు, తాతేపూర్ గ్రామంలో గ్రామీణ నీటిసరఫరా పథకం, వివిధ సామాజికకక ,విద్యారంగ పథకాలు ప్రారంభించనున్నారు. అలాగే మహగావ్ లో ఐటిఐ ఏర్పాటు, బిహచ్‌యు గవర్నమెంట్ గరల్స్‌హోమ్, రామ్‌నగర్‌లో వేదిక్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, దుర్గాకుంద్‌లోని ప్రభుత్వ వయోధికుల మహిళా వసతి గృహంలో థీమ్ పార్క్ ఏర్పాటు ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రధానమంత్రి బడాలాలాపూర్ లోని డాక్టర్ .భీమ్‌రావు అంబేడ్కర్ క్రీడాప్రాంగణంలో సింథటిక్ అథెలిటిక్ ట్రాక్, సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభిస్తారు. అలాగే పోలీసు, ఫైర్ సేఫ్టీ ప్రాజెక్టులు, సింధూరా లో నాన్ రెసిడెన్షియల్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్, మిర్జామురాద్, చోలాపూర్,జానా్స, కాప్‌సేథి పోలీస్ స్టేషన్లలో హాస్టల్ రూమ్‌లు, బారక్‌ల నిరా్మణం, పిండ్రాలో అగ్ని నిరోధ భవనాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో బహుళరోడ్డు మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో లహర్‌తారా- బిహెచ్‌యు నుంచి విజయ సినిమా వరకు ఆరు లేన్ల వెడల్పు కార్యక్రమం, పండేపూర్ ఫ్లైఒవర్ నుంచి రింగ్ రోడ్ వరకు నాలుగు లేన్ల విస్తరణ, కుచాహెరి నుంచి సందాహ వరకు నాలుగు లేన్ల రోడ్డువిస్తరణ, వారణాశి భదోహి గ్రామీణ రోడ్డు విస్తరణ, దానిని మరింత బలోపేతం చేయడం, కొత్తగా ఐదు రోడ్ల నిర్మాణం, వారణాశి గ్రామీణ ప్రాంతంలో నాలుగు సిసి రోడ్ల నిర్మాణ,ం బబత్‌పూర్ -చౌబేపూర్ రోడ్‌లో బబత్‌పూర్ వద్ద ఆర్.ఒ.బి నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు నగరంలో రోడ్లపైన ,గ్రామీణ రోడ్లపైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి ఉపకరిస్తాయి.
ఈ ప్రాంతంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కల్పించడానికి ప్రధానమంత్రి, వివిధ ప్రాజెక్టులకు శంకు స్థాపనచేస్తారు. ఇందులో సారనాథ్ బుద్ధిస్ట్ సర్య్కూట్ ఒకటి. దీనిని ప్రపంచ బ్యాంకు సహాయంతో యుపి ప్రో పూర్ టూరిజం డవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద చేపడతారు. అష్ఠ వినాయక, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, అష్ఠ భైరవ, నవ గౌరి యాత్ర, కు సంబంధించి పావన్ మార్గ నిర్మాణం, పంచకోశి పరిక్రమ యాత్రా మార్గం, పాత కాశీలో ని వివిధ వార్డులలో పర్యాటక అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
అఖిలభారతీయ శిక్షా సమాగమంః
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అఖిల భారతీయ శిక్షాసమాగమాన్ని, అంతర్జాతీయ సహకారం, సమ్మేళన కేంద్రం -రుద్రాక్షలో ప్రారంభిస్తారు. దీనిని జూలై 7 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. ఇది ప్రముఖ విద్యావేత్తలకు , విధాన నిర్ణేతలకు, విద్యారంగ నాయకులకు చర్చలకు వేదికగా ఉపకరిస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి) 2020 ని సమర్ధంగా అమలు చేసేందుకు , వారు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవడానికి వేదిక అవుతుంది. ఈ సమావేశాన్ని సామర్ధ్యాల నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 300 మందికిపైగా అకడమిక్, పాలనాపరమైన, సంస్థాగత నాయకులు కేంద్ర, రాష్ట్ర డీమ్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పాల్గొంటారు.దేశవ్యాప్తంగా గల జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఐఐటి, ఐఐఎం,ఎన్.ఐటి,ఐఐఎస్ఇఆర్ వంటి సంస్థల నుంచి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వివిధ స్టేక్ హోల్డర్లు తమ తమ సంస్థలలో ఎన్.ఇ.పి అమలులో పురోగతికి సంబంధించి తెలియజేస్తారు. అలాగే ఎన్.ఇ.పి అమలు వ్యూహాలు, ఉత్తమ విధానాలు, విజయగాథలను ఇతరులతో పంచుకుంటారు.
ప్రధానమంత్రి సిగ్రాలో క్రీడా ప్రాంగణం పునర్ అభివృద్ధి తొలి దశ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మూడురోజుల పాటు జరిగే ఈ శిక్షా సమాగమంలో 9 అంశాలపై పానెల్ చర్చలు జరుగుతాయి. ఈ అంశాలను ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ఎన్.ఇ.పి 2020 కింద గుర్తించారు. ఇవి వివిధ రంగాలకు , సంపూర్ణ విద్యకు సంబంధించినవి. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, పరిశోధన, ఆవిష్కరణ, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్, నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకుల సామర్ధ్యాల నిర్మాణం,, నాణ్యత, ర్యాంకింగ్, అక్రిడిటేషన్, డిజిటల్‌సాధికారత, ఆన్ లైన్ విద్య, సమానత్వంతో కూడిన, సమ్మిళిత విద్య, భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఉన్నత విద్యను అంతర్జాతీయం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
***
(Release ID: 1839419)
Visitor Counter : 180
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam