ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాల ను ఆంధ్ర ప్రదేశ్ లోనిభీమవరం లో ప్రారంభించిన ప్రధాన మంత్రి; ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా సాగుతాయి


శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 30 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధాన మంత్రి

‘‘స్వాతంత్య్ర పోరాటం ఏ కొన్ని సంవత్సరాల, కొన్ని ప్రాంతాల లేదా కొంత మంది ప్రజలచరిత్ర మాత్రమేనో కాదు’’

‘‘శ్రీ అల్లూరి సీతారామరాజు భారతదేశ సంస్కృతి, ఆదివాసీల గుర్తింపు, పరాక్రమం, ఆదర్శాలు మరియు విలువల కు ఒక ప్రతీక గా ఉన్నారు’’

‘‘మన ‘న్యూ ఇండియా’ మన స్వాతంత్య్ర యోధులు కలలు గన్నభారతదేశం గా రూపొందాలి.  అది ఎటువంటి భారతదేశం అంటే అందులో పేదల కు, రైతుల కు, శ్రమికుల కు, వెనుకబడిన వర్గాల వారికి, ఆదివాసీల కు.. ఇలా అందరికీ సమానమైనఅవకాశాలు లభించాలి’’

‘‘ప్రస్తుతం, ‘న్యూ ఇండియా’ లో సరికొత్త అవకాశాలు, మార్గాలు, ఆలోచన  విధానాలు, ఇంకాఅవకాశాలు ఉన్నాయి.  మరి మన యువత ఈ అవకాశాల ను వినియోగించుకొనేబాధ్యత ను తీసుకొంటోంది’’

‘‘ఆంధ్ర ప్రదేశ్ దేశభక్తుల మరియు వీరుల గడ్డ గా ఉంది’’

‘‘130 కోట్ల మంది భారతీయులు ప్రతి ఒక్క సవాలు తో ‘మీకు చేతనైతే మమ్మల్ని నిలువరించండి’ అని చెబుతున్నారు’’


Posted On: 04 JUL 2022 1:13PM by PIB Hyderabad

ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాల ను ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సంవత్సరం పొడవునా సాగనున్నాయి. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో ఆంధ్ర ప్ర‌దేశ్‌ గవర్నరు శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంతి శ్రీ జి. కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఘనమైన వారసత్వాన్ని కలిగినటువంటి ఆంధ్ర ప్రదేశ్ యొక్క విశిష్టమైన భూమి కి వందనాన్ని ఆచరించే అవకాశం దక్కినందుకు తాను ఎంతో సౌభాగ్యవంతుడిని అని తలుస్తున్నానన్నారు. రంప తిరుగుబాటు కు 100 సంవత్సరాలు పూర్తి అవుతుండడం, శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల వంటి ప్రధానమైన కార్యక్రమాలు యా దృచ్ఛికం గా ఒకదాని తో మరొకటి కలసి వచ్చాయి అని ఆయన అన్నారు. ‘‘మన్యం వీరుడు’’ మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క స్మృతి కి యావత్తు దేశం పక్షాన తాను నమస్సుల ను అర్పిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. ఆ ప్రముఖ స్వాతంత్య్ర యోధుని కుటుంబ సభ్యుల ను కలుసుకొన్నందుకు కూడా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆదివాసీ పరంపర కు మరియు ఆంధ్ర ప్రదేశ్ సంప్రదాయం నుంచి ఉద్భవించినటువంటి స్వాతంత్య్ర యోధుని కి సైతం ప్రధాన మంత్రి అంజలి ని ఘటించారు.

శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ని, రంప క్రాంతి యొక్క 100వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా నిర్వహించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. శ్రీ అల్లూరి జన్మస్థలం అయిన పాండ్రంగి జీర్ణోద్ధరణ, చింతపల్లి పోలీస్ ఠాణా యొక్క పునర్ నిర్మాణం, మోగల్లు అల్లూరి ధ్యాన మందిరం యొక్క నిర్మాణం.. ఈ కార్యాలన్నీ మన అమృత్ మహోత్సవం భావన తాలూకు ప్రతీకలు గా ఉన్నాయి అని ఆయన అన్నారు. నేటి కార్యక్రమం మన స్వాతంత్య్ర యోధుల వీరోచిత కృత్యాల ను గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్న ప్రతిజ్ఞ కు అద్దం పడుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్ర పోరాటం అనేది ఏ కొన్ని సంవత్సరాల, కొన్ని ప్రాంతాల లేదా ఏ కొద్ది మంది వ్యక్తుల చరిత్ర మత్రమేనో కాదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ చరిత్ర త్యాగం యొక్క చరిత్ర, దృఢ సంకల్పం యొక్క చరిత్ర, భారతదేశం లో మూల మూలనా జరిగిన త్యాగాల యొక్క చరిత్రగా ఉందన్నారు. ‘‘మన స్వాతంత్య్ర ఉద్యమం తాలూకు చరిత్ర అనేది మన వైవిధ్యం యొక్క, మన సంస్కృతి యొక్క, ఇంకా ఒక దేశం లోని ప్రజలు గా మన లోని ఐకమత్యం తాలూకు శక్తి గా ఉంది’’ అని ఆయన అన్నారు.

శ్రీ అల్లూరి సీతారామరాజు భారతదేశ సంస్కృతి, ఆదివాసుల గుర్తింపు, పరాక్రమం, ఆదర్శాలు, మరియు విలువల కు ఒక ప్రతీక గా ఉన్నారు అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, శ్రీ సీతారామరాజు గారు జన్మించింది మొదలుకొని ఆయన చేసిన త్యాగం వరకు కూడా చూస్తే ఆయన జీవన యాత్ర మనకు అందరికీ ఒక ప్రేరణ గా ఉందన్నారు. ఆదివాసీ సమాజం యొక్క హక్కుల కోసం, వారి సుఖ దు:ఖాల కోసం మరియు దేశ ప్రజల కు స్వేచ్ఛ లభించడం కోసం ఆయన తన జీవితాన్ని అర్పించేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశాన్ని ఒకే బంధం లో ముడివేస్తుస్తున్నటువంటి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్భావన కు శ్రీ అల్లూరి సీతారామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లోని ఆధ్యాత్మిక వాదం శ్రీ అల్లూరి సీతారామరాజు కు కరుణ, దయార్ద్ర భావన లను, ఒక గుర్తింపు తాలూకు భావన ను, ఆదివాసీ సమాజాని కి సమానత్వాన్ని తీసుకురావాలనే భావన ను, జ్ఞానాన్ని మరియు సాహసాన్ని అందించింది అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క యవ్వనాన్ని, రంప తిరుగుబాటు లో ప్రాణాలను త్యాగం చేసిన వారిని ప్రధాన మంత్రి స్మరించుకొంటూ వారి త్యాగం ఈనాటికీ యావత్తు దేశ ప్రజల కు ఒక శక్తి వనరు గాను, ప్రేరణ గాను ఉంటోందని స్పష్టంచేశారు. ‘‘స్వాతంత్య్ర పోరాటానికి దేశ యువత నాయకత్వం వహించింది. దేశం అభివృద్ధి చెందడం కోసం ముందంజ వేయడానికి ప్రస్తుత కాలం యువత కు అత్యుత్తమమై అవకాశం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇవాళ న్యూ ఇండియాలో కొత్త కొత్త అవకాశాలు, మార్గాలు, ఆలోచన విధానాలు, ఇంకా సంభవనీయతలు ఉన్నాయి. మరి ఈ సంభావ్యతల ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం మన యువత బాధ్యత ను చేపడుతున్నది’’ అని ఆయన చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ దేశ భక్తుల గడ్డ, వీరుల నిలయం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ దేశం కోసం ఒక జెండా ను తయారు చేసిన శ్రీ పింగళి వెంకయ్య వంటి స్వాతంత్య్ర వీరులు ఉండే వారు. ఇది శ్రీయుతులు కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు మరియు పొట్టి శ్రీరాములు గారు ల వంటి వీరుల నేల అని ఆయన అన్నారు. ఈ యోధుల కలల ను నెరవేర్చడం అమృత కాలంలో మన అందరి బాధ్యత అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మన న్యూ ఇండియా వారి కలల భారతదేశం గా రూపొందాలి. అది ఎటువంటి భారతదేశం అని అంటే అందులో పేదల కు, రైతుల కు, శ్రమికుల కు, వెనుకబడిన వర్గాల కు, ఆదివాసీల కు.. అందరికీ సమాన అవకాశాలు లభించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో ఆదివాసీ సముదాయం సంక్షేమం కోసం గడచిన 8 సంవత్సరాల లో ప్రభుత్వం అవిశ్రాంతం గా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి చూస్తే మొట్టమొదటిసారి గా దేశం లో ఆదివాసీ గౌరవాన్ని, ఆదివాసీ వారసత్వాన్ని కళ్ళకు కట్టేటందుకని ఆదివాసీ సంగ్రహాలయాల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని లంబసింగి లో ‘‘శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక ఆదివాసీ స్వాతంత్య్ర యోధుల సంగ్రహాలయం’’ ను కూడా నిర్మించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. అదే విధం గా భగవాన్ బిర్ సా ముండా పుట్టిన రోజు అయినటువంటి నవంబర్ 15వ తేదీ ని రాష్ట్రీయ జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని నిశ్చయించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. విదేశీ పాలకులు ఆదివాసీ సముదాయం పై అత్యధిక అఘాయిత్యాల కు ఒడిగట్టారని, వారి సంస్కృతి ని నాశనం చేయడానికి ప్రయత్నించారని ప్రధాన మంత్రి అన్నారు.

ఆదివాసీ కళలు, ఆదివాసీ నైపుణ్యాలు ప్రస్తుతం స్కిల్ ఇండియా మిశన్ద్వారా ఒక కొత్త గుర్తింపు ను తెచ్చుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీ కళా ప్రావీణ్యాల ను ఒక ఆదాయార్జన మార్గం గా వోకల్ ఫార్ లోకల్తీర్చిదిద్దుతోంది అని ఆయన అన్నారు. ఆదివాసీ ప్రజల ను వెదురు వంటి అటవీ ఉత్పత్తుల ను నరికి వేయడం వంటి పనుల జోలికి వెళ్ళకుండా దశాబ్దాల నాటి పాత చట్టాలు అడ్డగించాయి, ఆ చట్టాల ను మేం మార్చివేసి వన ఉత్పత్తుల పైన వారికి హక్కుల ను కల్పించాం అని ఆయన అన్నారు. అదే మాదిరి గా, ఎమ్ఎస్ పి కి సేకరించే ఉత్పత్తుల సంఖ్య ను 12 నుంచి 90 కి పైచిలుకు కు పెంచడం జరిగింది. ఆదివాసీ ఉత్పాదనల కు, వారి కళాకృతుల కు 3000 వన గణ వికాస్ కేంద్రాలు మరియు 50,000 కు పైగా వన గణ స్వయం సహాయ సమూహాలు ఆధునిక అవకాశాల ను కల్పిస్తున్నాయి. ఆకాంక్షభరిత జిల్లాల పథకంఆదివాసీ జిల్లాల కు ఎంతగానో లబ్ధి ని చేకూర్చుతున్నది. ఇక విద్య విషయాని కి వస్తే, 750 పైగా ఏకలవ్య నమూనా పాఠశాలల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి జాతీయ విద్య విధానంలో భాగం గా మాతృ భాష లో విద్య బోధన ను ప్రోత్సహించడం జరుగుతోంది అంటూ ప్రధాన మంత్రి వివరించారు.

మన్యం వీరుడుశ్రీ అల్లూరి సీతారామరాజు బ్రిటిషు వారికి ఎదురొడ్డి పోరాటం సలిపిన కాలం లో మీకు చేతనైతే నన్ను నిలువరించిండిఅని చాటిచెప్పారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశం సైతం తన ఎదుట నిలచిన సవాళ్ళ ను ఎదుర్కొంటోంది. 130 కోట్ల మంది దేశ ప్రజలు ఇదే సాహసం తో, ఇదే ఐకమత్యం తో, ఇదే సామర్థ్యం తో ప్రతి ఒక్క సవాలు తో దమ్ముంటే మమ్మల్ని ఆపాలిఅని అంటున్నారు అని ప్రధాన మంత్రి చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమం యొక్క పూర్వరంగం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగం గా, స్వాతంత్య్ర యోధుల తోడ్పాటు కు తగిన గుర్తింపు ను ఇవ్వాలని, వారిని గురించి దేశం అంతటా ప్రజలు తెలుసుకొనేటట్లు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఈ ప్రయాస లో భాగం గా, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భీమవరం లో ప్రారంభించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు 1897వ సంవత్సరం లో జులై 4వ తేదీ నాడు జన్మించారు. తూర్పు కనుమల ప్రాంతం లో ఆదివాసీ సముదాయాల ప్రయోజనాల ను పరిరక్షించడం కోసం బ్రిటిషు వారి కి వ్యతిరేకం గా ఆయన జరిపిన పోరాటాని కి గాను శ్రీ అల్లూరి సీతారామరాజు ను స్మరించుకోవడం జరుగుతున్నది. 1922వ సంవత్సరం లో మొదలైన రంప తిరుగుబాటు కు ఆయన నాయకత్వం వహించారు. ఆయన ను స్థానిక ప్రజానీకం మన్యం వీరుడు’ (అడవుల యొక్క వీరుడు) అని పిలుచుకొనే వారు.

ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల లో భాగం గా అనేక కార్యక్రమాల తాలూకు ప్రణాళిక ను సిద్ధం చేసింది. విజయనగరం జిల్లా లోని పాండ్రంగి లో శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని మరియు చింతపల్లి పోలీస్ ఠాణా ను (రంప తిరుగుబాటు కు 100 సంవత్సరాలు అయినందువల్ల- ఈ పోలీసు స్టేశన్ మీద జరిగిన దాడి తోనే రంప తిరుగుబాటు మొదలైంది) పునర్ నిర్మించడం జరుగుతుంది. మోగల్లు లో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మందిరం లో ధ్యాన ముద్ర లో ఉండే శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోడల మీది చిత్రలేఖనాలు మరియు ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) తో కూడినటువంటి ఇంటర్ యాక్టివ్ సిస్టమ్ మాధ్యమం ద్వారా ఆ స్వాతంత్య్ర యోధుని జీవన గాథ ను వివరించడం జరుగుతుంది.

***

DS/AK

 

 

 



(Release ID: 1839126) Visitor Counter : 290