ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 జూన్ 26వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా నమో ఏప్ ద్వారారూపొందిన ఒక క్విజ్ లో పాల్గొనాలంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 JUN 2022 9:10PM by PIB Hyderabad

2022వ సంవత్సరం జూన్ 26వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన ఒక క్విజ్ లో నమో ఏప్ (NaMo App) ద్వారా పాలుపంచుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అంతరిక్ష రంగం లో భారతదేశం వేసిన ముందడుగు లు, చెత్త నుంచి సంపద ను సృష్టించే దిశ లో సాగుతున్న సామూహిక ప్రయాస లు, మన క్రీడాకారుల కార్యసాధన లు సహా అనేక వైవిధ్యభరితమైనటువంటి విషయాలు ఈ నెల లో జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో అంశాలు చోటు చేసుకొన్నాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అంతరిక్ష రంగం లో భారతదేశం వేసిన ముందంజ లు, చెత్త నుంచి సంపద ను సృష్టించే దిశ లో సాగుతున్న సామూహిక ప్రయత్నాలు, మన క్రీడాకారులు సాధించిన విజయాలు, ఇంకా మరెన్నో వైవిధ్య భరితమైన విషయాల ను గురించి ఈ నెల లో జరిగిన #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం మాట్లాడుకొన్నాం. ఈ ఎపిసోడ్ ఆధారం గా రూపొందించిన ఒక క్విజ్ ను నమో ఏప్ లో పొందుపరచడం జరిగింది. దీనిలో మీరు పాలుపంచుకోగలరు.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1838160) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam