ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్ కోట్ లోని ఎట్ కోట్ లో గల మాతుశ్రీ  కె.డి.పి.మల్టీస్పెశలిటీ హాస్పిటల్ ను సందర్శించిన ప్రధాన మంత్రి


‘‘ప్రజల జీవితాల ను మెరుగు పరచడం కోసం పాటుపడడం లో ప్రభుత్వాని కి మరియుప్రైవేటు రంగాని కి మధ్య సమన్వయానికి ఈ ఆసుపత్రి ఒక ఉదాహరణ గా ఉంది’’

‘‘గడచిన 8 సంవత్సరాల లో ‘పేదల కు సేవ’ కు, ‘సుపరిపాలన’ కు  మరియు ‘పేదల సంక్షేమాని’ కి అత్యంత అధిక ప్రాధాన్యాన్నికట్టబెట్టడం జరిగింది’’

‘‘గత ఎనిమిది ఏళ్ళ లో దేశ ప్రజల కు ఇబ్బంది కలిగించే ఎటువంటి అపకారమూచోటుచేసుకోలేదు’’ 

‘‘పథకాలు అర్హులైన అందరికీ చేరేటట్లు చూడటం కోసం ప్రచార ఉద్యమాల ను ప్రభుత్వంమొదలు పెట్టింది’’

Posted On: 28 MAY 2022 1:36PM by PIB Hyderabad

రాజ్ కోట్ లోని ఎట్ కోట్ లో నూతనం గా నిర్మాణం జరిగిన మాతుశ్రీ కె.డి.పి. మల్టీస్పెశలిటీ హాస్పిటల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. ఈ ఆసుపత్రి ని శ్రీ పటేల్ సేవా సమాజ్ నిర్వహిస్తుంది. ఈ ఆసుపత్రి ఆ ప్రాంత ప్రజల కు అత్యధునాతన వైద్య సామగ్రి ని అందుబాటు లోకి తీసుకు రావడం తో పాటు ప్రపంచ శ్రేణి కలిగిన ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ను అందిస్తుంది. ఈ సందర్భం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ పురుషోత్తమ్ రూపాలా, డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా, డాక్టర్ మహేంద్ర ముంజాపారా, పార్లమెంటు సభ్యులు, గుజరాత్ ప్రభుత్వం లోని మంత్రులు మరియు సంత్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆసుపత్రి ని ప్రారంభించినందుకు తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి సౌరాష్ట్ర లో ఆరోగ్య సేవల ను మెరుగు పరచడం కోసం ఉద్దేశించింది అని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రి ప్రజల జీవితాల ను మెరుగు పరిచేందుకు పాటుపడటం లో ప్రభుత్వాని కి మరియు ప్రైవేటు రంగానికి మధ్య ఉన్న సమన్వయానికి ఒక ఉదాహరణ గా ఉంది.

ఎన్ డిఎ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలాన్ని ఫలప్రదం గా ముగించుకొన్నందుకు దేశ ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజల కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మాతృ భూమి కి ఎనిమిది ఏళ్ళ సేవ పూర్తి అయిన ముందు రోజు న గుజరాత్ గడ్డ కు తాను చేరుకోవడం సముచితం గా ఉంది అని ఆయన అన్నారు. దేశాని కి సేవ చేసే అవకాశాన్ని మరియు సంస్కారాన్నితనకు ఇచ్చినందుకు గాను గుజరాత్ ప్రజల కు ఆయన శిరసు ను వంచి నమస్కరించారు. ఈ సేవ చేయడం అనేది మన సంస్కృతి లో, మన నేల లో ఉంది, మరి ఇది బాపూ , ఇంకా పటేల్ ల సంస్కృతి లోనూ ఉంది అని ఆయన అన్నారు. గడచిన 8 సంవత్సరాల కాలం లో దేశ ప్రజల కు ఇబ్బంది ని కలిగించినటువంటి ఎలాంటి అపకారమూ జరుగలేదు అని ఆయన అన్నారు. ఇన్ని సంవత్సరాల లో పేదల కు సేవచేయడం; ‘సుపరిపాలనను అందించడం; ‘పేద ప్రజల సంక్షేమం’.. వీటికి అత్యంత ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరిగింది అని ఆయన అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్అనే మంత్రం దేశం అభివృద్ధి కి జోరు ను అందించింది అని ఆయన అన్నారు.

పేదల, దళితుల, ఆదరణ కు నోచుకోని వర్గాల, ఆదివాసీల, మహిళల తదితరుల సశక్తీకరణ కోసం పూజ్య బాపూజీ మరియు సర్ దార్ పటేల్ కలలు కన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. స్వచ్ఛత మరియు స్వస్థత అనేవి దేశ ప్రజల చేతన లో ఒక భాగం గా మారిన అటువంటి భారతదేశం కోసం వారు తపించారని ఆయన అన్నారు. స్వదేశీ పరిష్కార మార్గాల వల్ల పటిష్టం అయినటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశం లో ఏర్పడాలి అని బాపూ ఆకాక్షించారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం 3 కోట్ల కు పైగా కుటుంబాల కు ఒక పక్కా ఇల్లు లభించింది; 10 కోట్ల పై చిలుకు కుటుంబాలు బహిరంగ మలమూత్రాదుల విసర్జన అగత్యం బారి నుంచి తప్పించుకోగలిగాయి; 9 కోట్ల పైచిలుకు సోదరీమణులు వంట గదిలో పొగబారి నుంచి స్వేచ్ఛ ను సంపాదించుకొన్నారు; మరి అదే విధంగా రెండున్నర కోట్లకు పైగా కుటుంబాలు విద్యుత్తు కనెక్షన్ ను అందుకొన్నాయి, 6 కోట్లకు పైగా కుటుంబాలు తాగునీటి సదుపాయాన్ని పొందాయి, ఇంకా 50 కోట్ల కు పైచిలుకు లబ్ధిదారులు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య రక్షణ కవచాన్ని ఉచితం గా అందుకొన్నారు అంటూ ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఇవి ఒక్క సంఖ్యలు మాత్రమే కాదు, పేదల కు గౌరవం దక్కేటట్లు చూడటానికి మరియు దేశ ప్రజల కు సేవ చేయడాని కి మా సమర్పణ భావాని కి నిదర్శనం అని ఆయన అన్నారు.

వంద సంవత్సరాల కు ఒకసారి విరుచుకుపడ్డ మహమ్మారి కాలం లో సైతం పేద ప్రజలు వారి జీవనం లో ఇక్కట్టుల పాలు అయినట్లు భావించకుండా తాము జాగ్రత చర్యలను తీసుకొన్నామని ప్రధాన మంత్రి అన్నారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాల లో డబ్బు ను జమ చేయడం జరిగింది. పేదల కు ఉచిత సిలిండర్ లను ఇవ్వడమైంది. ఇంకా, అందరికీ ఉచితంగా పరీక్షలు జరపడం , టీకామందు ను ఇప్పించడమైంది అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను మేం ప్రజల కు జీవన సౌలభ్యాన్ని అందించడం కోసం ప్రయత్నించాం అని ప్రధాన మంత్రి అన్నారు. పథకాలు అర్హులైన అందరికీ చేరేటట్లు చూడటం కోసం తన ప్రభుత్వం ఉద్యమాల ను మొదలు పెట్టిందని ఆయన అన్నారు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి వారి వాటా లభిస్తుందో, అప్పుడు భేద భావానికి మరియు అవినీతి కి తావు ఉండదు అని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రయాసల తో పేదల మరియు మధ్యతరగతి కి చెందిన వారి జీవనం సులభతరం అవుతుంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని గుజరాతీ లో కొనసాగిస్తూ, ప్రజాసేవ చేస్తున్నందుకు పటేల్ సముదాయానికి అభినందనలు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి లో తాను ఉన్న రోజుల ను ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. 2001వ సంవత్సరం లో గుజరాత్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వగా, ఆ కాలంలో 9 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు గుజరాత్ లో 30 వైద్య కళాశాలలు ఏర్పాటు అయ్యాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘నేను గుజరాత్ లోను, దేశం లోను ప్రతి జిల్లా లో ఒక వైద్య కళాశాల ను చూడాలి అని కోరుకొంటున్నాను. మేం నియమాల ను మార్చాం, మరి ప్రస్తుతం వైద్య విద్యార్థులు, ఇంజీనియరింగ్ విద్యార్థులు వారి మాతృ భాష లో చదువుకోవచ్చును’’ అని ఆయన అన్నారు.

పరిశ్రమ ను గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇంతకు ముందు కేవలం వడోదరా నుంచి వాపీ వరకు పరిశ్రమలు కనిపించేవి. ప్రస్తుతం గుజరాత్ లో అవి ప్రతి చోటా ముందంజ వేస్తున్నాయి; గుజరాత్ లో హైవేస్ ను విస్తరించడమైంది. మరి ఎమ్ఎస్ఎమ్ఇ లు గుజరాత్ యొక్క పెద్ద బలం గా మారాయి. ఔషధ నిర్మాణ పరిశ్రమ కూడా వికసిస్తోంది. సౌరాష్ట్ర ఆ ప్రాంత ప్రజల సాహసిక స్వాభావానికి గుర్తింపు గా నిలచింది అని ఆయన అన్నారు.

తన ను గురించినటువంటి ఒక వ్యక్తిగత వ్యాఖ్య కు ప్రధాన మంత్రి జవాబిస్తూ, పేదరికం అంటే ఏమిటో తనకు తెలుసునని, కుటుంబంలోని మహిళలు అనారోగ్యం గా ఉన్నప్పటికీ కూడా ఎలాగ పనులు చేస్తుంటారో, చికిత్స తీసుకోకుండా ఉంటుంటారో, తద్ద్వారా కుటుంబాని కి అసౌకర్యం కలుగకుండా నడుచుకొంటారరో తాను అర్థం చేసుకోగలనన్నారు. ‘‘ఈ రోజు న దిల్లీ లో మీకంటూ ఓ కుమారుడు ఉన్నాడు. అతడు ఏ మాతృమూర్తి చికిత్స కు దూరం గా ఉండిపోకుండా తగిన జాగ్రత తీసుకొన్నాడు. ఈ కారణం తోనే పిఎమ్ జెఎవై ని ప్రారంభించడం జరిగింది’’ అని ఆయన చెప్పారు. అదే విధం గా చౌక గా మందుల ను సరఫరా చేయడాని కి జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి, మరి అంతర్జాతీయ యోగ దినాన్ని అందరికి మంచి ఆరోగ్యం కోసం పాటించడం జరుగుతున్నది అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

https://youtu.be/H7W5NvsKp3I

***

 



(Release ID: 1836006) Visitor Counter : 93