ప్రధాన మంత్రి కార్యాలయం
44వ చెస్ ఒలింపియాడ్ కోసం చారిత్రకమైన కాగడాల రిలేను ప్రారంభించిన ప్రధానమంత్రి
తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్
ప్రధానమంత్రి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఫిడే అధ్యక్షుడు
“ఇది భారతదేశం గౌరవం మాత్రమే కాదు, సమున్నతమైన చెస్ చారిత్రక వైభవానికి కూడా గౌరవం”
“ఈ ఏడాది పతకాల్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పుతుందని నేను నమ్ముతున్నాను”
“సరైన వాతావరణం కల్పించి సరైన మద్దతు అందించినట్టయితే బలహీనులకు కూడా ఏ లక్ష్యం అసాధ్యం కాదు”
“భారత క్రీడా విధానంలో దూరదృష్టి, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) వంటివి సత్ఫలితాలు ఇవ్వడం మొదలయింది”
“గతంలో యువత సరైన వేదిక కోసం ఎదురు చూడాల్సివచ్చేది.నేడు “ఖేలో ఇండియా” కార్యక్రమం కింద ఈ ప్రతిభావంతుల కోసం దేశమే అన్వేషిస్తోంది, వారి ప్రతిభకు పదును పెడుతోంది”
“ఎలాంటి ఉద్రిక్తత, ఒత్తిడి లేకుండా మీ నూరు శాతం సామర్థ్యం అందించండి”
Posted On:
19 JUN 2022 6:50PM by PIB Hyderabad
44వ చెస్ ఒలింపియాడ్ కోసం కాగడాల రిలే ప్రదర్శనను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ ద్వోర్కోవిచ్ ఆ కాగడాను ప్రధానమంత్రికి అందచేయగా దాన్ని గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు ప్రధానమంత్రి అందచేశారు. 40 రోజుల పాటు ఈ కాగడా 75 నగరాలకు తిరిగి ఈ కాగడా ప్రయాణం చివరికి చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్ద ముగుస్తుంది. కాగడా ఆగే ప్రతీ ప్రాంతంలోను ఆ రాష్ర్టానికి చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్లు దాన్ని అందుకుంటారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఖేలో చెస్ లాంఛనప్రాయమైన కదలికకు శ్రీకారం చుట్టగా కోనేరు హంపి తొలి అడుగు వేశారు. కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, శ్రీ నితిష్ ప్రామాణిక్, చెస్ క్రీడాకారులు, ఔత్సాహికులు, రాయబారులు, చెస్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలిసారిగా కాగడా రిలే అనే కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించినందుకు భారత ప్రభుత్వానికి ఫిడే అధ్యక్షుడు ఆర్కడీ ద్వోర్కోవిచ్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో ఈ కాగడా రిలే మరింత ప్రాచుర్యంలోకి రావడమే కాకుండా ప్రపంచం అంతటా ఈ క్రీడను ఉత్తేజితం చేస్తుందని ఆయన అన్నారు. “ఒక కొత్త మార్గం చూపినందుకు, మమ్మల్ని గౌరవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫిడే రుణపడి ఉంటుంది” అని ఆయన చెప్పారు. 2010 సంవత్సరంలో ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది చెస్ క్రీడాకారులు చదరంగం ఆడిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని, కొత్త సామర్థ్యాల నిర్మాణంతో పాటుగా ఉమ్మడిగా విద్యా, క్రీడా విజయాలకు బాటలు వేయాలని ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు. భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా కూడా పాఠశాల క్రీడల్లో చెస్ ఒక భాగం అవుతుందన్న ఆశాభావం ఫిడే అధ్యక్షుడు వ్యక్తం చేశారు. “భారతదేశం నేడు త్వరితగతిన చెస్ విస్తరిస్తున్న దేశంగా నిలిచింది. అందుకు మీరు గర్వపడదగిన కారణాలెన్నో ఉన్నాయి. చెస్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు చేస్తున్న అద్భుతమైన కృషికి, మీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ “చెస్ ఒలింపియాడ్ కోసం తొలి కాగడాల రిలే ప్రదర్శన భారతదేశం నుండే ప్రారంభమవుతోంది. ఈ ఏడాది తొలిసారిగా భారతదేశం చెస్ ఒలింపియాడ్ క్రీడలకు అతిథ్యం కూడా ఇస్తోంది. ఒక క్రీడ తన జన్మస్థానం నుంచి వెలుపలికి తరలిపోయి ప్రపంచం అంతటా తన ముద్ర వేసి ఎన్నో దేశాలకు వ్యామోహంగా మారడం మాకు గర్వకారణం” అన్నారు. “శతాబ్దాల క్రితం చతురంగ పేరుతో ఈ క్రీడకు సంబంధించిన కాగడా ప్రదర్శన ప్రపంచం అంతటా తిరిగింది. నేడు తొలి ఒలింపియాడ్ కాగడా కూడా భారతదేశం నుంచే బయలుదేరుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారతదేశం స్వాతంత్ర్య 75వ సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చెస్ ఒలింపియాడ్ కాగడా దేశంలోని 75 నగరాలను చుట్టి వస్తుంది” అని చెప్పారు. “భారతదేశం నుంచే ప్రతీ చెస్ ఒలింపియాడ్ క్రీడకు కాగడా రిలే బయలుదేరాలని ఫిడే నిర్ణయించింది. ఇది భారతదేశానికి గౌరవం మాత్రమే కాదు, సమున్నతమైన చెస్ వారసత్వానికి కూడా లభించిన గౌరవం. ఇందుకోసం ఫిడేను, దాని సభ్యులను అభినందిస్తున్నాను” అన్నారు.
చెస్ లో భారతదేశ వారసత్వాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. “విశ్లేషణాత్మక శక్తి, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గల మెదడు కోసం మా పూర్వీకులు చతురంగ లేదా చెస్ వంటి క్రీడను ప్రారంభించారు. చెస్ భారతదేశం మీదుగా ప్రపంచంలోని పలు దేశాలను చేరి బహుళ ప్రాచుర్యం పొందింది. నేడు పాఠశాలల్లో యువత, పిల్లల కోసం ఒక విద్యా సాధనంగా చెస్ ఉపయోగపడుతోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. “ఇటీవల సంవత్సరాల్లో చెస్ క్రీడలో భారతదేశం తన సామర్థ్యాలను నిరంతరాయంగా మెరుగుపరుచుకుంటూ వస్తోంది. నేడు చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందం చరిత్రలోనే అతి పెద్దది. ఈ ఏడాది పతకాల సాధనలో కూడా భారతదేశం కొత్త రికార్డును నెలకొల్పుతుందన్న ఆశ నాకుంది” ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
చెస్ మన జీవితాలకు నేర్పే పాఠాల గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. జీవితంలో తమ స్థానం ఏమిటనే అంశంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ సరైన మద్దతు లభించడం అవసరమన్న విషయం ఆయన నొక్కి చెప్పారు. “చదరంగంలో ప్రతీ ఒక్క పావుకి దాని ప్రత్యేక బలం, ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. అలాగే మీరు ఒక పావుని సరైన స్థానానికి నడిపించి దాని శక్తిని సరిగా ఉపయోగించినట్టయితే అది మరింత శక్తివంతం అవుతుంది. చెస్ బోర్డులోని ఈ ప్రత్యేకత మన జీవితాలకు మంచి సందేశం ఇస్తోంది. సరైన మద్దతు అందించి, సరైన వాతావరణం కల్పించినట్టయితే బలహీనులకు కూడా అసాధ్యం అనేది ఏదీ ఉండదు” అని ప్రధానమంత్రి అన్నారు.
చెస్ అందించే మరో పాఠం గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “దూరదృష్టి అనేది చెస్ కి గల గొప్ప శక్తి. హ్రస్వదృష్టిని విడనాడి దీర్ఘదృష్టితో ముందుకు సాగినట్టయితే సరైన విజయం మన సొంతం అవుతుంది” అనేదే ఆ పాఠం అన్నారు. భారతదేశ క్రీడా విధానం, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) సత్ఫలితాలందిస్తున్నాయనేది ఈ పాఠాల ద్వారా మనకి తెలిసే నిజం అని చెప్పారు.
భారతదేశం ఇటీవల టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్, థామస్ కప్, బాక్సింగ్ లో సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ “మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు. యువతలో సాహసానికి, అంకిత భావానికి, బలానికి కూడా కొదవ లేదు. గతంలో అయితే మన యువత సరైన వేదిక కోసం ఎదురుచూడాల్సివచ్చేది. నేడు ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశమే వారిలోని ప్రతిభ కోసం అన్వేషిస్తూ ప్రతిభకు పదును పెట్టే కృషి జరుగుతోంది” అని చెప్పారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభ కూడా వెలికి వస్తోంది. దేశంలోని భిన్న నగరాలు, జిల్లాల్లో ఆధునిక క్రీడా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి అన్నారు. కొత్త విద్యావిధానం ఇతర పాఠ్యాంశాల తరహాలోనే క్రీడలను కూడా పరిగణిస్తున్నట్టు చెప్పారు. క్రీడల్లో ఫిజియో, స్పోర్ట్స్ సైన్స్ వంటివి ముందుకు వస్తున్నాయి. దేశంలో పలు క్రీడా విశ్వవిద్యాలయాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
క్రీడాకారులపై ఉండే ఒత్తిడి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎలాంటి ఉద్రిక్తతకు, ఒత్తిడికి గురి కాకుండా మీ నూరు శాతం సామర్థ్యం అందించేందుకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి సూచించారు. మీ కఠిన శ్రమ, అంకితభావం దేశం వీక్షించిందన్నారు. విజయం సాధించడం క్రీడలో ఒక భాగం అయినప్పటికీ తిరిగి విజయం సాధించేందుకు కూడా సిద్ధం కావడం అవసరమని చెప్పారు. చెస్ లో ఒక తప్పటడుగు వేస్తే దాని మూల్యం ఎంత ఉంటుందో ప్రస్తావించిన ప్రధానమంత్రి ఒకే ఒక తప్పు కారణంగా ఆట ఓడిపోయే అవకాశం ఎంత ఉంటుందో మెదడు శక్తిని ఉపయోగించిట్టయితే ఎలాంటి పరిస్థితి అయినా మన అధీనంలోకి తెచ్చుకోవచ్చుననేది కూడా అంతే నిజం అన్నారు. అందుకే ప్రశాంతంగా ఉండడం అవసరమని చెప్పారు. ఈ విషయంలో యోగా, ధ్యానం మనకి ఎంతో సహాయకారిగా ఉంటాయని తెలిపారు. యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
క్రీడాకారులపై ఉండే ఒత్తిడి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎలాంటి ఉద్రిక్తతకు, ఒత్తిడికి గురి కాకుండా మీ నూరు శాతం సామర్థ్యం అందించేందుకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి సూచించారు. మీ కఠిన శ్రమ, అంకితభావం దేశం వీక్షించిందన్నారు. విజయం సాధించడం క్రీడలో ఒక భాగం అయినప్పటికీ తిరిగి విజయం సాధించేందుకు కూడా సిద్ధం కావడం అవసరమని చెప్పారు. చెస్ లో ఒక తప్పటడుగు వేస్తే దాని మూల్యం ఎంత ఉంటుందో ప్రస్తావించిన ప్రధానమంత్రి ఒకే ఒక తప్పు కారణంగా ఆట ఓడిపోయే అవకాశం ఎంత ఉంటుందో మెదడు శక్తిని ఉపయోగించిట్టయితే ఎలాంటి పరిస్థితి అయినా మన అధీనంలోకి తెచ్చుకోవచ్చుననేది కూడా అంతే నిజం అన్నారు. అందుకే ప్రశాంతంగా ఉండడం అవసరమని చెప్పారు. ఈ విషయంలో యోగా, ధ్యానం మనకి ఎంతో సహాయకారిగా ఉంటాయని తెలిపారు. యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
ఈ ఏడాది అంతర్జాతీయ చెస్ సంఘం ఫిడే తొలిసారిగా ఒలింపిక్ సాంప్రదాయానికి అనుగుణంగా చెస్ ఒలింపియాడ్ కాగడాను ప్రారంభించింది, ఇప్పటివరకు చెస్ ఒలింపియాడ్ లో జరగని విశేషం అది అని ఆయన చెప్పారు. చెస్ ఒలింపియాడ్ కాగడా రిలేను ప్రారంభించిన తొలి దేశం ఇండియా అని ఆయన అన్నారు. చెస్ లో భారతదేశం మూలాలను మరిన్ని ఎత్తులకు తీసుకువెళ్తూ ఇక నుంచి చెస్ ఒలింపియాడ్ కాగడా రిలే భారతదేశం నుంచి ప్రారంభమై ప్రపంచం అంతటా ప్రయాణిస్తూ ఆతిథ్య దేశానికి చేరుతుందని చెప్పారు.
ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ జరగబోతోంది. 1927 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మకమైన పోటీ భారతదేశంలో తొలిసారి, ఆసియాలో 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు చెప్పారు. 189 దేశాలు భాగస్వాములౌతున్న ఈ క్రీడోత్సవం అతి భారీ భాగస్వామ్యం గల చెస్ ఒలింపియాడ్ అన్నారు.
(Release ID: 1835855)
Visitor Counter : 179
Read this release in:
Marathi
,
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam