ప్రధాన మంత్రి కార్యాలయం

రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ను గురించిన ఒకవ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


అన్నదాత ల సంక్షేమం పట్ల ప్రభుత్వం యొక్క నిబద్ధత కు సంబంధించి MyGov లో ట్వీట్ ను కూడా ఆయన శేర్ చేశారు

Posted On: 03 JUN 2022 5:59PM by PIB Hyderabad

రైతు ల ఆదాయాన్ని పెంచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచినటువంటి narendramodi.in వెబ్ సైట్ లోని ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పశుపోషణ మొదలుకొని మత్స్య పరిశ్రమ దాకా, అటవీకరణం మొదలుకొని మధుర విప్లవం దాకా సంబంధిత ప్రయత్నాల ను అనేకం గా చేపట్టడం ద్వారా గా రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం మా ప్రభుత్వం పాటుపడింది. #8yearsOfKisanKalyan’’ అని పేర్కొన్నారు.

 

 

అన్నదాత ల సంక్షేమం దిశ లో ప్రభుత్వం యొక్క నిబద్ధత ను గురించి ప్రముఖం గా చాటినటువంటి MyGov ట్వీట్ ల మాలిక ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశం లోని అన్నదాతల కు సాధికారిత కల్పన ద్వారా ‘న్యూ ఇండియా’ కు ఒక శక్తియుక్త ఆధారం లభిస్తున్నది. విత్తనం మొదలుకొని విపణి వరకు ప్రతి క్షేత్రం లోను వారి కి నాలుగింతల అభివృద్ధి దక్కాలనే అంశం పై శ్రద్ధ ను తీసుకోవడమైంది. ఇది మన రైతు సోదరులు, రైతు సోదరీమణుల సంకల్ప శక్తి తాలూకు ఫలితమా అన్నట్లు గా భారతదేశ వ్యవసాయ రంగం లో ఒక కొత్త ఉదాహరణ ను అందిస్తున్నది. ’ #8YearsOfKisanKalyan’ అని పేర్కొన్నారు.

 

 

సోదరుల కు మరియు రైతు సోదరీమణుల కు అనేక పథకాల తాలూకు 100 శాతం ప్రయోజనాల ను అందించడం జరుగుతున్నది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పథకాల తాలూకు 100 శాతం లాభాల ను రైతు సోదరులు, రైతు సోదరీమణుల వద్దకు చేర్చడం కోసం మా ప్రభుత్వం పూర్తి స్థాయి లో కట్టుబడి ఉంది. పిఎమ్-కిసాన్ పథకం మొదలుకొని రికార్డు స్థాయి లో బడ్జెటు కేటాయింపు కావచ్చు లేదా ఉత్పాదన వ్యయాని కి ఒకటిన్నర రెట్ల మేరకు ఎమ్ఎస్ పి, సాయిల్ హెల్థ్ కార్డు మొదలుకొని ఇ-నామ్ (e-NAM) వరకు చూస్తే అన్నదాతల కు కొత్త శక్తి లభించిన అటువంటి పథకాలు అనేకం గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1831129) Visitor Counter : 150