యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరగనున్న కార్యక్రమాలను రేపు న్యూ ఢిల్లీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి ప్రారంభించనున్న శ్రీ అనురాగ్ ఠాకూర్


750 మంది యువ సైక్లిస్టులతో కలిసి 7.5 కి.మీ దూరం సైకిల్ తొక్కనున్న కేంద్రమంత్రి

దేశంలో 35 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు 75 ఐకానిక్ ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్న ఎన్ వై కె ఎస్

సైకిళ్లపై 9.68 లక్షల కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణం చేయనున్న యువ సైక్లిస్టులు

Posted On: 02 JUN 2022 1:11PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-ఇండియా@75 వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 3న దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 12 మార్చి 2021   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కర్టెన్ రైజర్ సందర్భంగా భారత ప్రధానమంత్రి చేసిన ఉపన్యాసం నుంచి  ప్రారంభ ప్రసంగం నుండి స్ఫూర్తి పొందిన  యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను @75 ప్రణాళికలుకార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

 

దీనిలో భాగంగా 2022 జూన్ 3న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్,  నేషనల్ సర్వీస్ స్కీమ్ రెండు  యువజన సహకారంతో  యువజన వ్యవహారాల విభాగం  ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది.   ఏకకాలంలో ఢిల్లీలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రారంభించడందేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదేశంలోని అన్ని బ్లాక్‌లు,  75 ఐకానిక్ ప్రాంతాలలో   సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని యువజన వ్యవహారాల విభాగం నిర్ణయించింది. 

 

దేశవ్యాప్త కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ 3 జూన్ 2022న ఢిల్లీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి  ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా  కేంద్ర మంత్రి 750 మంది యువ సైక్లిస్టులతో కలిసి 7.5 కిలోమీటర్ల దూరం వరకు జరిగే  సైకిల్ యాత్రలో పాల్గొని సైకిల్ తొక్కుతారు. ఇదే సమయంలో   నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో   35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల  రాజధానులలో సైకిల్ ర్యాలీలు  జరుగుతాయి. ఇంతేకాకుండా  75 ఐకానిక్  ప్రాంతాలలో జరిగే  సైకిల్ ర్యాలీలలో   75 మంది 7.5 కి.మీ. దూరం వరకు సైకిల్ ర్యాలీ జరుపుతారు.   అంతేకాకుండానెహ్రూ యువ కేంద్ర సంఘటన్ తన  యువ  వాలంటీర్లు మరియు యూత్ క్లబ్‌ల సభ్యుల సహకారం మరియు సహకారంతో దేశంలోని అన్ని బ్లాక్‌లలో స్వచ్ఛంద ప్రాతిపదికన  సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తుంది. 

3 జూన్ 2022న ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే సైకిల్ ర్యాలీల్లో    ప్రతిపాదిత సైకిల్ ర్యాలీల ద్వారా 1.29 లక్షల మంది యువ సైక్లిస్టులు ఒకే రోజు అంటే 3 జూన్ 2022లో 9.68 లక్షల కి.మీ. దూరాన్ని సైకిళ్లపై ప్రయాణిస్తారు. 

 

శారీరక దృఢత్వం  కోసం ప్రజలు తమ దైనందిన జీవితంలో సైకిల్ తొక్కడం అలవాటు చేసుకుని దానిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల    ఊబకాయంసోమరితనంఒత్తిడిఆందోళనవ్యాధులు మొదలైన వాటి నుండి విముక్తి కలుగుతుంది. సాధారణ ప్రజలు సైకిల్ పై ప్రయాణించడం వల్ల   కార్బన్ ఉద్గారాల విడుదల కూడా తగ్గుతుంది.  .  ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పాటించడం ద్వారా   తమ జీవితంలో ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమను ఫిట్‌నెస్ కి డోస్ ఆధా ఘంటా రోజ్” చేర్చాలనే పిలుపు ఇవ్వడం జరుగుతుంది. 

 

  ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను రూపొందించింది.   ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగించడం,  సైకిల్ ర్యాలీలను ప్రారంభించే కార్యక్రమాలను కూడా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.   ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి అనుగుణంగా తమ గ్రామాలు మరియు ప్రాంతంలో   సైకిల్ ర్యాలీ నిర్వహించేందుకు  యువ వాలంటీర్ కృషి చేసి కార్యక్రమంలో పాల్గొంటారు.  ప్రజలు మరియు ముఖ్యంగా యువత తమ సోషల్ మీడియా ఛానెల్‌లలో #Cycling4India మరియు #worldbicycleday2022తో సైకిల్ ర్యాలీలను ప్రచారం చేయవచ్చు.

ప్రముఖులు, ప్రజాప్రతినిధులుపిఆర్ఐ  నాయకులు, సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు మరియు ఇతర ప్రముఖులు వివిధ స్థాయిలలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలను ప్రోత్సహించాలని  యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. 

 

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలు తమ తమ ప్రాంతాలలో సైకిల్ ర్యాలీలు  నిర్వహించాలని  యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది.   ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని  స్నేహితులు, కుటుంబం మరియు పీర్ గ్రూప్ మొదలైనవాటిని గరిష్ట సంఖ్యలో కార్యక్రమంలో  పాల్గొనేలా చూసేందుకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. 

 



(Release ID: 1830442) Visitor Counter : 150