ఆర్థిక మంత్రిత్వ శాఖ
మే 2022 లో 1,40,885 కోట్ల రూపాయల స్థూల జిఎస్టీ రెవెన్యూ రాబడి
గత ఏడాదితో పోల్చి చూస్తే 44% పెరుగుదల
జిఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి 4వ సారి 1.40 లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటిన జీఎస్టీ వసూళ్లు
మార్చి 2022 నుంచి వరుసగా 3వ నెలలో రికార్డు స్థాయి జిఎస్టీ రెవెన్యూ రాబడి
Posted On:
01 JUN 2022 1:28PM by PIB Hyderabad
మే , 2022 నెలలో 1,40,885 కోట్ల రూపాయల మేరకు స్థూల జీఎస్టీ ఆదాయంగా లభించింది. అందులో సిజీఎస్టీ రూ. 25,036 కోట్లు, ఎస్జీఎస్టీ, రూ. 32,001 కోట్లు ఐజీఎస్టీ రూ.73,345 కోట్లు ( దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 37469 కోట్లు కలుపుకుని), సెస్ 10,502 కోట్లు ( దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 931 కోట్లు కలుపుకుని) ఉన్నాయి.
ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి రూ. 27,924 కోట్లను సిజీఎస్టీకి, రూ. 23,123 కోట్లను ఎస్జీఎస్టీకి సర్దుబాటు చేసింది. సాధారణ సర్దుబాట్ల తర్వాత 2022 మే నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సి జీఎస్టీ గా రూ. 52,960 కోట్లు, ఎస్జీఎస్టీగా రూ. 55,124 కోట్లుగా ఉంది . దీనితో పాటు జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 31.05.2022న 86912 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.
గత ఏడాది మే నెలలో జరిగిన జీఎస్టీ రాబడితో పోల్చి చూస్తే 2022 మే నెలలో వచ్చిన రాబడి 44% ఎక్కువగా ఉంది. గత ఏడాది మే నెలలో జీఎస్టీ రాబడి 97,821 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 2022 మే నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 30% మేరకు పెరిగింది. అదేవిధంగా, గత ఏడాది మే తో పోల్చి చూస్తే ఈ నెలలొ దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చిన ఆదాయాలు 17% ఎక్కువగా ఉన్నాయి.
జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది వరుసగా నాల్గవసారి మరియు మార్చి 2022 నుంచి వరుసగా మూడో నెల . మే నెలలో వసూళ్లు ఏప్రిల్ మొదటి నెల రిటర్న్‌లకు సంబంధించినవి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల కావడంతో ఏప్రిల్‌లో వసూళ్లు ఎల్లప్పుడూ తక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెల వసూళ్లు ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చికి సంబంధించిన రిటర్న్‌లకు సంబంధించినవిగా ఉంటాయి. అయితే, మే 2022 నెలలో కూడా స్థూల జీఎస్టీ రాబడులు 1.40 లక్షల కోట్ల రూపాయలను మార్కును అధిగమించడం ఆశాజనక అంశంగా ఉంది.
దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ రాబడి ట్రెండ్‌లను చూపుతుంది. మే 2021తో పోల్చితే 2022 మే నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించబడిన రాష్ట్రాల వారీగా జీఎస్టీ గణాంకాలను పట్టిక చూపుతుంది.
మే 2022లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రాబడిలో వృద్ధి [1]
రాష్ట్రం
|
మే-21
|
మే-22
|
వృద్ధి
|
జమ్మూ మరియు కాశ్మీర్
|
232
|
372
|
60%
|
హిమాచల్ ప్రదేశ్
|
540
|
741
|
37%
|
పంజాబ్
|
1,266
|
1,833
|
45%
|
చండీగఢ్
|
130
|
167
|
29%
|
ఉత్తరాఖండ్
|
893
|
1,309
|
46%
|
హర్యానా
|
4,663
|
6,663
|
43%
|
ఢిల్లీ
|
2,771
|
4,113
|
48%
|
రాజస్థాన్
|
2,464
|
3,789
|
54%
|
ఉత్తర ప్రదేశ్
|
4,710
|
6,670
|
42%
|
బీహార్
|
849
|
1,178
|
39%
|
సిక్కిం
|
250
|
279
|
12%
|
అరుణాచల్ ప్రదేశ్
|
36
|
82
|
124%
|
నాగాలాండ్
|
29
|
49
|
67%
|
మణిపూర్
|
22
|
47
|
120%
|
మిజోరం
|
15
|
25
|
70%
|
త్రిపుర
|
39
|
65
|
67%
|
మేఘాలయ
|
124
|
174
|
40%
|
అస్సాం
|
770
|
1,062
|
38%
|
పశ్చిమ బెంగాల్
|
3,590
|
4,896
|
36%
|
జార్ఖండ్
|
2,013
|
2,468
|
23%
|
ఒడిషా
|
3,197
|
3,956
|
24%
|
ఛత్తీస్‌గఢ్
|
2,026
|
2,627
|
30%
|
మధ్యప్రదేశ్
|
1,928
|
2,746
|
42%
|
గుజరాత్
|
6,382
|
9,321
|
46%
|
డామన్ మరియు డయ్యూ
|
0
|
0
|
153%
|
దాద్రా మరియు నగర్ హవేలీ
|
228
|
300
|
31%
|
మహారాష్ట్ర
|
13,565
|
20,313
|
50%
|
కర్ణాటక
|
5,754
|
9,232
|
60%
|
గోవా
|
229
|
461
|
101%
|
లక్షద్వీప్
|
0
|
1
|
148%
|
కేరళ
|
1,147
|
2,064
|
80%
|
తమిళనాడు
|
5,592
|
7,910
|
41%
|
పుదుచ్చేరి
|
123
|
181
|
47%
|
అండమాన్ మరియు నికోబార్ దీవులు
|
48
|
24
|
-50%
|
తెలంగాణ
|
2,984
|
3,982
|
33%
|
ఆంధ్రప్రదేశ్
|
2,074
|
3,047
|
47%
|
లడఖ్
|
5
|
12
|
134%
|
ఇతర భూభాగం
|
121
|
185
|
52%
|
కేంద్రం అధికార పరిధి
|
141
|
140
|
0%
|
సంపూర్ణ మొత్తం
|
70,951
|
|
|
***
(Release ID: 1830093)
Visitor Counter : 277
Read this release in:
English
,
Malayalam
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada