ప్రధాన మంత్రి కార్యాలయం

‘పిఎమ్కేర్స్ ఫార్ చిల్డ్రన్ స్కీము’ లో భాగం గా ప్రయోజనాల నువిడుదల చేసిన ప్రధాన మంత్రి


‘‘దేశం లో ప్రతి ఒక్క పౌరుడు పూర్తి సంవేదనశీలం తో మీకుఅండగా నిలబడుతున్నారు అనే వాస్తవాని కి పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ అద్దంపడుతోంది’’

‘‘ఈ సంకట ఘడియ లో మీ బాలలందరి వెన్నంటి భరత మాత నిలబడింది’’

‘‘ఈ కఠినమైన కాలాల్లో, మంచి పుస్తకాలు అనేవి మీకు విశ్వసనీయమైన నేస్తాలుకాగలుగుతాయి’’

‘‘ఈ రోజు న ఎప్పుడైతే మా ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకొంటోందో, మరి దేశం యొక్క విశ్వాసం, అలాగే దేశ పౌరుల లో వారి పట్ల వారికిగల బరోసా ఇదివరకు ఎరుగని  స్థాయి లోఉన్నాయి’’

‘‘గడచిన 8 ఏళ్ళ కాలాన్ని పేదల సంక్షేమం కోసం మరియు వారికి సేవ చేయడం కోసం సమర్పించడం జరిగింది’’

‘‘ప్రస్తుతం నిరుపేదలు ప్రయోజనాల ను అందుకొనే అంశం లో నమ్మకం తో ఉన్నారు. ఈ బరోసా ను పెంచడం కోసం మా ప్రభుత్వం ప్రస్తుతం 100 శాతం సశక్తీకరణ తాలూకు ఉద్యమాన్ని నడుపుతున్నది’’

Posted On: 30 MAY 2022 11:35AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ స్కీమ్ లో భాగం గా ప్రయోజనాల ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, మంత్రిమండలి లో అనేక మంది సభ్యులు మరియు ముఖ్యమంత్రులు ఉన్నారు.

హాజరైన జన సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కరోనా కారణం గా ఆప్తుల ను కోల్పోయిన బాలల జీవనం లో ఎదురైన ఇక్కట్టుల పట్ల సహానుభూతి ని వ్యక్తం చేశారు. ‘‘ప్రతి రోజూ ఒక పోరాటం, ప్రతి రోజూ ఎన్నెన్నో సవాళ్ళు. ఈ రోజు న మనతో పాటు ఉన్న బాలల యొక్క బాధ ను మాటల లో చెప్పాలి అంటే అది ఎంతో కష్టం. మరి వారి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి బాలల తో అన్నారు. తాను ఒక ప్రధాన మంత్రి గా కాక ఒక కుటుంబ సభ్యుని గా మాట్లాడుతున్నట్లు వారి తో ఆయన చెప్పారు.

ఇటువంటి పరిస్థితుల లో, ‘‘తమ తల్లి ని మరియు తండ్రి ని ఇద్దరి ని పోగొట్టుకొన్న కరోనా ప్రభావిత బాలల కు ఎదురైన ఇక్కట్టుల ను తగ్గించడం కోసం చేపట్టిన ఒక చిన్న ప్రయాసే పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్. అంతేకాదు, దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఈ పూర్తి సంవేదనశీలం తో మీతో పాటు ఉన్నారు అనే నిజాని కి పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ అనేది ఒక ప్రతిబింబం’’అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఎవరికైనా ఉన్నత విద్య ను చదువుకొనేందుకు రుణం లేదా ప్రొఫెశనల్ కోర్సు కు రుణం కావాలి అంటే అందుకు పిఎమ్-కేర్స్ సాయపడుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఇతర రోజువారి అవసరాల కోసం, సర్దుబాటు ల కోసం వేరే పథకాల ద్వారా వారికి ప్రతి నెలా 4 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 23 ఏళ్ళ వయస్సు వచ్చిన తరువాత బాలల కు ఇచ్చే 10 లక్షల రూపాయల కు అదనం గా ఆయుష్మాన్ కార్డు ద్వారా ఆరోగ్య సంరక్షణ కవచాన్ని అందించడం జరుగుతుంది. మానసిక అండదండ ల కోసం సంవాద్ హెల్ప్ లైన్ద్వారా కౌన్సెలింగ్ ఉంటుంది అని ఆయన వివరించారు.

మహమ్మారి తాలూకు అత్యంత వేదన భరిత ప్రభావాన్ని ఇంతటి ధైర్యం తో ఎదుర్కొన్నందుకు గాను బాలల కు ప్రధాన మంత్రి వందనం చేశారు. తల్లి తండ్రుల ప్రేమ ను ఏదీ భర్తీ చేయజాలదు అని ఆయన అన్నారు. ‘‘ఈ కఠినమైన కాలం లో భరత మాత మీ బాలలు అందరి వెన్నంటి ఉంది.’’ ఈ బాధ్యత ను పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ ద్వారా నెరవేర్చడం కోసం దేశం ప్రయత్నిస్తోంది అని ఆయన అన్నారు. మహమ్మారి విజృంభించిన కాలం లో మానవీయ కరుణ ఉప్పొంగిన ఘటనల ను గురించి, ప్రత్యేకించి బాధితుల సంక్షేమం కోసం ప్రజలు ఏ విధం గా తోడ్పాటు ను అందించింది ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఆసుపత్రుల ను సన్నద్ధం గా ఉంచడం లో, వెంటిలేటర్ లను కొనుగోలు చేయడం, ఇంకా ఆక్సీజన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడం లో ఈ నిధి సాయపడింది అని ప్రధాన మంత్రి వివరించారు. దీనితో ఎంతో మంది ప్రాణాల ను, మరెన్నో కుటుంబాల భవిష్యత్తు ను కాపాడడం సాధ్యపడింది అని ఆయన పేర్కొన్నారు.

నిరాశ కమ్ముకొన్న వేళ లోనూ మనం మన పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నామా అంటే అప్పుడు ఒక కిరణం తప్పక కనుపిస్తుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మన దేశమే అని ఆయన ప్రస్తావించారు. నిరాశ ను ఓటమి గా మారనివ్వకండి అని బాలల కు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. మీ పెద్దల మరియు మీ గురువుల మాటల ను సావధానం గా వినండి అని బాలల తో ఆయన చెప్పారు. ఇటువంటి కష్టమైన కాలాల్లో మంచి పుస్తకాలే వారి విశ్వసనీయమైన స్నేహితులు కాగలుగుతాయి అని కూడా ఆయన అన్నారు. వ్యాధి బారి న పడకుండా జాగ్రత్త పడవలసింది గాను, ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో, ఖేలో ఇండియా లో పాలుపంచుకొని నాయకత్వం వహించండి అని కూడా ఆయన వారిని కోరారు. యోగ దినం లో సైతం పాలుపంచుకోండంటూ వారికి ఆయన సూచన చేశారు. ప్రతికూల వాతావరణం లో భారతదేశం తన బలం మీద బరోసా పెట్టుకొంది అని ఆయన అన్నారు. ‘‘మనం మన శాస్త్రవేత్తల పైన, మన వైద్యుల పైన, మన యువత పైన బరోసా పెట్టుకొన్నాం. మరి మనం ప్రపంచాని కి ఒక బాధ గా మిగిలిపోలేదు, ఒక ఆశాకిరణం లా బయటకు వచ్చాం. మనం ఒక సమస్య కాలేదు, అంతకంటే పరిష్కారాన్ని అందించే వాళ్ళం గా బయల్పడ్డాం. మనం ప్రపంచం లోని అనేక దేశాల కు మందుల ను, టీకా మందుల ను పంపించాం. ఇంత పెద్ద దేశం లో మనం వేక్సీన్ ను ప్రతి ఒక్క పౌరుని చెంతకు, పౌరురాలి చెంతకు తీసుకు పోయాం’’ అని ఆయన అన్నారు. మన దేశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వలె ముందంజవేస్తున్నది; మరి ప్రపంచం సరికొత్త ఆశ తో, విశ్వాసం తో మనకేసి చూస్తున్నది అని ఆయన అన్నారు.

ఈ రోజు న ఎప్పుడైతే తన ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొంటోందో, మరి దేశం యొక్క ఆత్మవిశ్వాసం, పౌరుల లో వారి పట్ల వారి కి బరోసా ఇది వరకు ఎన్నడు ఎరుగని స్థాయి లో ఉందని చెప్తూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2014వ సంవత్సరం కన్నా ముందు దేశం అవినీతి లో, వేల కొద్దీ కోట్ల కుంభకోణాల లో, బంధుప్రీతి తో, దేశం అంతటా ఉగ్రవాద సంస్థల వ్యాప్తి తో, ప్రాంతీయ భేద భావాల తో చిక్కుకొని ఉండేది. అది ఇప్పుడు ఈ విషవలయం నుంచి బయటపడుతోంది. ‘‘బాలల్లారా, అత్యంత కఠినమైన రోజు లు కూడా వెనుకబడిపోతాయి అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ’’ అని ఆయన అన్నారు.

స్వచ్ఛ్ భారత్ మిశన్, జన్ ధన్ యోజన, లేదా హర్ ఘర్ జల్ అభియాన్ వంటి సంక్షేమ విధానాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్ భావన తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. గడచిన ఎనిమిదేళ్ళ కాలాన్ని పేద ప్రజానీకం సంక్షేమం కోసం మరియు సేవ కోసం అంకితం చేయడం జరిగింది అని ఆయన అన్నారు. ‘‘కుటుంబం లోని ఒక సభ్యుని వలే మేం ఇబ్బందుల ను తగ్గించడాని కి ప్రయత్నించాం. దేశం లో పేదల కు జీవన సౌలభ్యాన్ని మెరుగు పరచే ప్రయత్నం చేశాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

సాంకేతిక విజ్ఞానం తాలూకు వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం పేదల అధికారాల కు పూచీ పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు నిరుపేద వ్యక్తి కి కూడా ప్రభుత్వ పథకాల తాలూకు ప్రయోజనం తనకు అందుతుంది అనే విశ్వాసం ఏర్పడింది. అంతేకాక, ఆ ప్రయోజనం నిరంతరం గా అందుతుంది అని ఆయన చెప్పారు. ఈ బరోసా ను పెంచడం కోసం మా ప్రభుత్వం ఇప్పుడు 100 శాతం సశక్తీకరణ కల్పన కు ఒక కార్యక్రమాన్ని నడుపుతున్నది అని ఆయన అన్నారు.

భారతదేశం గత 8 ఏళ్ళ లో చేరిన శిఖరాల ను గురించి ఇంతకు ముందు ఎవరూ ఊహించి అయినా ఉండక పోవచ్చు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం గా భారతదేశం యొక్క గౌరవం పెరిగింది, ప్రపంచ వేదికల లో మన భారతదేశం యొక్క బలం అధికం అయింది. భారతదేశం యొక్క ఈ యాత్ర కు యువ శక్తి నాయకత్వాన్ని వహిస్తోంది అని చెప్తూ ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీరు మీ కలల కోసం మీ జీవనాన్ని సమర్పితం చేసివేయండి చాలు, అవి తప్పక నెరవేరతాయి అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.


***

DS/AK

 

 

 

 

 



(Release ID: 1829669) Visitor Counter : 125