సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సరైన సమాచారం, సమాచార ప్రవాహం సాఫీగా సాగడం.. సరిజోడీగా ముందుకు సాగాలి: శ్రీ అనురాగ్ ఠాకూర్
- 17వ ఆసియా మీడియా సమ్మిట్‌లో ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
- కోవిడ్-19పై ప్రజలకు మేటిగా అవగాహన కల్పించిన భారతీయ మీడియాను ప్రశంసించిన మంత్రి
- సాధికారత యొక్క సమర్థవంతమైన సాధనంగా ప్రజలకు సరైన అవగాహన మరియు ఆలోచనలను కల్పించచడంలో మీడియాకు అపారమైన సామర్థ్యం ఉంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
- నకిలీ వార్తల ముప్పుపై పీఐబీ ఫాక్ట్ చెక్ యూనిట్ సహాయంతో ప్రభుత్వం రియల్ టైమ్‌లో పోరాడింది
Posted On:
25 MAY 2022 4:41PM by PIB Hyderabad
కోవిడ్ 19 మహమ్మారి వ్యాపిస్తున్న క్లిష్ట సమయంలో భారతీయ మీడియా పోషించిన పాత్రను కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రశంసించారు. 17వ ఆసియా మీడియా సమ్మిట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ప్రసంగాన్ని అందించిన కేంద్ర మంత్రి, కోవిడ్ అవగాహన సందేశాలు, ముఖ్యమైన ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు వైద్యులతో ఉచిత సంప్రదింపులు దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా భారతీయ మీడియా కృషి చేసిందని ఆయన అన్నారు. దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలు తమ ప్రజా సేవ యొక్క ఆదేశాన్ని గణనీయంగా అందించాయని, సత్వర కవరేజ్, క్షేత్రస్థాయి నివేదికలు, మరియు దేశ ప్రజారోగ్యంపై కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ట్రెండ్‌ను సెట్ చేయడంలో ఆయా సంస్థలు తన పాత్ర నిరూపించాయని ఆయన అన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ రియల్ టైమ్ ప్రాతిపదికన నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారం యొక్క ఈ ముప్పుకు వ్యతిరేకంగా బలంగా పోరాడిందని ఆయన తెలిపారు. పీఐబీ సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు,
కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వ విజయాలను మరింత హైలైట్ చేస్తూ శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. 1.3 బిలియన్ల జనాభాకు టీకాలు వేయడం పెద్ద సవాలుగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం, కోవిడ్ యోధులు మరియు పౌర సమాజం యొక్క సంయుక్త ప్రయత్నాల కారణంగా భారతదేశం తన జనాభాలో అత్యధిక మందికి టీకాలు వేసిందని అన్నారు. ఈ భారాన్ని పంచుకున్నందుకు మరియు పంపిణీ చేసినందుకు మీడియాను ఆయన ప్రశంసించారు. “ఈ ప్రయత్నంలో, కరోనా వైరసస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భారతీయ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మేము అనేక అవరోధాలను ఎదుర్కొన్నాము. టీకా సంకోచం ప్రధాన సవాళ్లలో ఒకటి. సరైన సందేశాలు మరియు విద్య ద్వారా మీడియా దానిని విచ్ఛిన్నం చేసింది. వ్యాక్సిన్ గురించి స్పష్టమైన సందేశాన్ని అందించడానికి ప్రధాని మోడీ పౌరులను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాల ద్వారా, టీవీ ఛానెల్‌ల ద్వారా ప్రసంగించారు.“ అని మంత్రి వివరించారు. ఈ సంవత్సరం ఆసియా మీడియా సమ్మిట్ యొక్క థీమ్ “ఫ్యూచర్ ఫార్వర్డ్, రీఇమేజినింగ్ మీడియా”, ఈ సందర్భంగా మారుతున్న మీడియా డెలివరీ వ్యవస్థలను గురించి మంత్రి శ్రీ ఠాకూర్ నొక్కిచెబుతూ నేడు మీడియా అత్యంత సాంకేతికతతో నడుస్తోందని, ఆవిష్కరణల వేగవంతమైన వేగాన్ని చూస్తోందని వ్యాఖ్యానించారు. సరసమైన మొబైల్ పరికరాల ద్వారా ఇంటర్నెట్ వృద్ధి మీడియా పరిశ్రమకు మరింత వేగాన్ని జోడించిందని ఆయన అన్నారు. 5G సాంకేతికత వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని, డెలివరీ వేగాన్ని పెంచడం, మీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, సాంకేతిక పురోగతి , కంటెంట్ యొక్క ప్రామాణికత ఎల్లప్పుడూ ప్రధాన అంశంగా ఉంటుంద శ్రీ ఠాకూర్ చెప్పారు. సమాచార స్వేచ్ఛా ప్రవాహ హక్కు గురించి మనం మాట్లాడవచ్చు, సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయవలసిన అవసరం గురించి కూడా మాట్లాడాలని ఆయన అన్నారు. కేన్స్‌లో సినిమా ద్వారా భారతీయ సాఫ్ట్ పవర్ ఇటీవలి అపూర్వమైన ప్రదర్శనను గుర్తుచేస్తూ,శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాలను పాలించిందన్నారు. భారతదేశానికి ఒక గుర్తింపును సృష్టించిందని అన్నారు. ఈ ఫెస్టివల్‌లో భారతీయ చిత్రాలకు సినీ ప్రేమికుల నుండి విపరీతమైన ప్రశంసలు లభించిన తీరులో ఇది స్పష్టమైందన్నారు. 3000 విడుదలలతో భారతదేశం ప్రతి సంవత్సరం అత్యధిక చిత్రాలను నిర్మిస్తోంది. భారత దేశంలో సినిమా షూటింగ్ ప్రమోషన్ కోసం కేన్స్‌లో ప్రకటించిన వివిధ రకాల ప్రోత్సాహకాలను ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రచారం చేయడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన అని ఆయన అన్నారు. ఆ ఆలోచనను నెరవేర్చడానికి ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిందన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా, భాషలు, శైలులలో 2200 కంటే ఎక్కువ సినిమాలు వాటి పూర్వ వైభవానికి పునరుద్ధరించబడతాయి, సంరక్షణ తరాలను కలుపుతుందని శ్రీ ఠాకూర్ ప్రేక్షకులకు తెలియజేశారు. మన పూర్వీకులు ఆదరించిన విలువలను కొత్త తరాలు తెలుసుకోవాలి, గుర్తించాలి మరియు వాటిని అలవర్చుకోవాలని అన్నారు. బ్రిటిష్ పాలన నుండి దేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల గురించి శ్రీ ఠాకూర్ సభికులకు తెలియజేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మనం మన చారిత్రాత్మక నైతికతలను, సాంప్రదాయ విలువలను సంస్కృతిని పునరుజ్జీవింపజేస్తున్నామని అన్నారు. దీని వలను మన స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాల గురించి మన యువ తరానికి మరింత అవగాహన ఏర్పడుతోందని తెలిపారు. ప్రపంచంలో మీడియా పోషిస్తున్న సానుకూల పాత్రపై మంత్రి తన బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు. సాధికారతకు సమర్థవంతమైన సాధనంగా,, ప్రజల సరైన అవగాహన మరియు దృక్కోణాలను రూపొందించడంలో మీడియాకు అపారమైన సామర్థ్యం ఉందని మంత్రి అన్నారు.
***
(Release ID: 1828377)
Visitor Counter : 165