ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్ లో భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAY 2022 6:25PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.

కార్యక్రమాని కన్నా ముందు, ప్రధాన మంత్రి జపాన్ లో భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య సాంస్కృతిక సంబంధాల ను మరియు ఒక దేశ నివాసులు మరొక దేశాని కి రాకపోకలు జరపడాన్ని ప్రోత్సహించడం లో తోడ్పాటు ను ఇస్తున్న ఇండాలజిస్టు లు, క్రీడాకారులు, ఇంకా సాంస్కృతిక కళాకారుల తో భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి జపాన్ లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాల విజేతల తో కూడా భేటీ అయ్యారు. జపాన్ లో ప్రవాసీ భారతీయులు 40,000 కు మించి ఉంటున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ సముదాయం యొక్క సభ్యుల నైపుణ్యాల ను, ప్రతిభ ను, నవ పారిశ్రామికత్వాన్ని మరియు మాతృభూమి తో వారి కి ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రశంసించారు. స్వామి వివేకనంద మరియు గురుదేవ్ రబీంద్ర నాథ్ టాగోర్ లను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య ఇప్పుడున్న సాంస్కృతిక సంబంధాల ను గురించి కూడా ప్రత్యేకం గా ప్రస్తావించారు. ఇటీవలి కొన్నేళ్ల లో భారతదేశం లో చోటు చేసుకొన్న సామాజిక- ఆర్థిక అభివృద్ధి మరియు సంస్కరణ తాలూకు వివిధ పార్శ్వాలను గురించి కూడా చర్చించారు. భారత్ చలో, భారత్ సే జుడోఉద్యమం లో కలవవలసిలంది గాను, ముందడుగు వేయవలసిలందిగాను భారతీయ సముదాయాన్నొ ఆయన ఆహ్వానించారు.

***



(Release ID: 1827872) Visitor Counter : 120