ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్  డాక్టర్ నొబుహిరొ ఎండో తో సమావేశమైన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 MAY 2022 12:14PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్ డాక్టర్ నోబుహిరో ఎండో తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. భారతదేశం యొక్క టెలికమ్యూనికేశన్ రంగం లో ఎన్ఇసి పోషించినటువంటి పాత్ర ను, ప్రత్యేకించి చెన్నై- అండమాన్ & నికోబార్ దీవులు (సిఎఎన్ఐ) మరియు కోచి-లక్షద్వీప్ దీవుల (కెఎల్ఐ) కి సంబంధించిన ఒఎఫ్ సి ప్రాజెక్టుల లో ఎన్ఇసి యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం పెట్టుబడి కి ఉన్నటువంటి అవకాశాల ను గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.


భారతదేశం లో పారిశ్రామిక అభివృద్ధి, పన్నుల విధానం, శ్రమ రంగం సహా భారతదేశం లో వ్యాపారం చేయడాన్ని సులభతరం గా తీర్చిదిద్దడం కోసం అమలులోకి తీసుకువస్తున్నటువంటి వివిధ సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు డాక్టర్ నోబుహిరో ఎండో లు చర్చించారు. ఇరువురు నేత లు నూతన సాంకేతిక విజ్ఞానం తో పాటు వృద్ధి లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సంబంధి రంగం లో భారతదేశం లో అందుబాటులో ఉన్న అవకాశాల ను గురించి కూడా సమాలోచనలు జరిపారు.

***


(रिलीज़ आईडी: 1827776) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam