ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య చైతన్యభరిత సంబంధాల పై ఒక లేఖ ను రాసినప్రధాన మంత్రి
Posted On:
23 MAY 2022 9:07AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో ఓ స్థానిక పత్రిక లో ఓ లేఖ ను రాశారు. శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో ఆధికారిక యాత్ర జరుపుతున్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశానికి మరియు జపాన్ కు మధ్య గల చైతన్యభరిత సంబంధాల ను గురించి ఒక లేఖ ను రాశాను. శాంతి కోసం, స్థిరత్వం కోసం మరియు సమృద్ధి కోసం ఏర్పడిన భాగస్వామ్యం మనది. 70 గౌరవశాలి సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న మన విశిష్టమైనటువంటి మైత్రి తాలూకు ఈ యాత్ర ను మరింత బలపరచడం కోసం కూడా నేను తరలివస్తున్నాను. @Yomiuri_Online’’
‘‘కోవిడ్ అనంతర కాలం లోని ప్రపంచం లో భారతదేశం-జపాన్ సన్నిహిత సహకారం ముఖ్యమైంది గా ఉంది. మన దేశాలు ప్రజాస్వామిక విలువల కు దృఢం గా కట్టుబడి ఉన్నాయి. మనం ఉభయులం స్థిరమైనటువంటి మరియు సురక్షితమైనటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ కు ముఖ్య స్తంభాలు గా ఉన్నాం. మనం అనేక బహుపక్షీయ వేదికల లో కూడాను కలసి పని చేస్తుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.’’
‘‘గుజరాత్ ముఖ్యమంత్రి గా నేను పని చేస్తున్న రోజుల నుంచే జపాన్ ప్రజల తో క్రమం తప్పక భేటీ అవుతూ ఉండే అవకాశం నాకు దక్కుతూ వచ్చింది. అభివృద్ధి ప్రయాణం లో జపాన్ వేసిన అడుగులు ఎప్పటికీ ప్రశంసనీయంగా ఉంటున్నాయి. జపాన్ మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణ లు, స్టార్ట్-అప్స్ సహా మరెన్నో కీలక రంగాల లో భారతదేశం తో కలసి భాగస్వామ్యాన్ని అందిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1827772)
Visitor Counter : 132
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam